గుంటూరు : తెనాలి మండలం కొలకలూరు రైల్వే స్టేషన్‌లో కలకలం రేగింది. స్టేషన్ మాస్టర్ గదికి గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. దీంతో గదిలో ఉన్న రికార్డులు, ఫర్నిచర్ స్వల్పంగా దగ్దమయ్యాయి. ఘటనా స్థలంలో మందుబాటిళ్లు , ఎంఆర్‌పీఎస్ జెండాలు లభ్యమయ్యాయి. ఎంఆర్‌పీఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ అక్రమ అరెస్టుకు నిరసనగానే ఈ ఘటనకు ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment