MRPS activists
-
అమరావతిలో అణగారిన వర్గాలకు చోటులేదా?
తాడికొండ: అమరావతి ఆంధ్రుల సొత్తయితే, ఈ ప్రాంతంలో దళితులు, ముస్లిం, మైనార్టీలకు చోటు కల్పించకుండా చంద్రబాబు ఎందుకు అడ్డుపడుతున్నారో సమాధానం చెప్పాలని అమరావతి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మల్లవరపు నాగయ్య ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 49వ రోజు రిలే నిరాహార దీక్షల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బినామీలతో భూములు స్వాహాచేసి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన చంద్రబాబు.. ఇళ్ల స్థలాల కోసం దీక్షలకు వస్తున్న దళిత మహిళలపై దాడులు చేసి బెదిరించి ట్రాక్టర్లతో తొక్కిస్తామనడంపై మండిపడ్డారు. అణగదొక్కాలని చూస్తే ఉవ్వెత్తున లేచి చంద్రబాబు అండ్ కోను ముంచెత్తుతామని హెచ్చరించారు. పాల్గొన్న మహిళలు, దళిత సంఘాలు దళిత నేతలు పరిశపోగు శ్రీనివాసరావు, నత్తా యోనరాజు మాట్లాడుతూ మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి సాధ్యమన్నారు. చంద్రబాబు తన కుల రాజధాని నిర్మాణానికి కృత్రిమ ఉద్యమంతో మభ్యపెట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. కార్పొరేట్ విద్యా వ్యవస్థకు చంద్రబాబు వత్తాసు పలుకుతూ..ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులకెక్కి వ్యవస్థను ప్రలోభాలకు గురిచేస్తున్నాడని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్‌కు ప్రజాబలం, దళిత, మైనారీ్ట, బీసీ వర్గాల అండ ఉందని స్పష్టం చేశారు. కాగా బుధవారంతో రిలే నిరాహార దీక్షలు 50వ రోజుకు చేరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి దళిత, బహుజన సంఘాలు భారీగా పాల్గొని మద్దతు తెలుపనున్నాయి. బేతపూడి సాంబయ్య, ఆదాం పాల్గొన్నారు. -
సుఖాంతమైన ప్రేమ కథ
చందర్లపాడు: ప్రేమ కథ సుఖాంతమైంది. వేర్వేరు సామాజికవర్గాలు కావడం, పెళ్ళికి పెద్దల అంగీకారం లేనప్పటికీ అనేక మలుపుల మధ్య ప్రేమికులిద్దరూ ఒక్కటయ్యారు. ఆరేళ్లుగా ప్రేమిస్తూ పెద్దలు ఒప్పుకోలేదన్న సాకుతో ముఖం చాటేసిన యువకుడు పోలీసుల కౌన్సెలింగ్‌తోపాటు ఎమ్మార్పీఎస్ నాయకుల రంగప్రవేశంతో పెళ్లికి ఒప్పుకోకతప్పలేదు. ఆరేళ్ల ప్రేమకు ఫుల్స్టాప్ పెట్టి గ్రామ దేవత సాక్షిగా ఒక్కటయ్యారు. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన వేదాంతం పవన్‌కుమార్(24), తిరువూరు మండలం చౌటపల్లికి చెందిన దేవి(20)కి మధ్య ఆరేళ్ళుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఫోన్లో మాట్లాడుకోవడమేగాక అప్పుడప్పుడూ కలిసి తిరిగేవారు. వీరి సామాజిక వర్గాలు వేరైనందున విషయం దేవి ఇంట్లో తెలిసి మందలించారు. అయినా ఆమె పవన్ ఒత్తిడి మేరకు స్నేహం కొనసాగించింది. పెళ్లి మాట వచ్చేసరికి ముఖం చాటేశాడు. ఈ క్రమంలో కొద్ది నెలల క్రితం తిరువూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకునేందుకు రెండు నెలల గడువు కోరిన పవన్ అప్పటినుంచి ముఖం చాటేశాడు. ఫోన్లోకూడా స్పందించకపోవడంతో ఈ నెల 10వ తేదీ ఉదయం పవన్ ఇంటికి వచ్చిన దేవి జరిగినదానిపై అతని తల్లిదండ్రులకు చెప్పింది. వారినుంచి సరైన సమాధానం రాకపోవండతో అక్కడే దీక్ష చేపట్టింది. ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆమెకు ఆసరాగా నిలిచారు. పవన్‌ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆమె వద్ద ఉన్న సాక్ష్యాల ఆధారంగా జరగబోయే పరిణామాలపై హెచ్చరించారు. విధి లేని పరిస్థితిలో పవన్ పెళ్ళికి అంగీకరించగా గురువారం రాత్రి చందర్లపాడు గ్రామ దేవత అలివేలమ్మ సాక్షిగా ఒక్కటయ్యారు. -
సెల్‌టవర్ ఎక్కిన ఎమ్మార్పీఎస్ నేత
మహబూబ్‌నగర్ క్రైం: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను విడుదల చేయాలనే డిమాండ్‌తో ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి ఆందోళన చేశాడు. దీంతో అక్కడకు పెద్దసంఖ్యలో స్థానికులు చేరుకోగా ట్రాఫిక్ జాం కావడంతో దాదాపు అర గంట పాటు ఉట్కంఠ నెలకొంది. హన్వాడ మండల ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి కేశవులు మంద కృష్ణను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌తో సోమవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలో బాధం సరోజిని దేవి ఆడిటోరియం ఆవరణలో ఉన్న బీఎస్ఎన్ఎల్ సెల్‌టవర్ ఎక్కాడు. అక్కడకు చేరుకున్న టూటౌన్ సీఐ డీవీపీ.రాజు, ఎస్ఐ మురళి అతడికి నచ్చచెప్పినా కిందకు రాలేదు. ఆ తర్వాత మంద కృష్ణ జైలు నుంచి విడుదల అయ్యాడని ఫోన్లో సమాచారం ఇవ్వడంతో కేశవులు కిందకు దిగాడు. ఈ మేరకు కేశవులుపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో 309 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
ఎమ్మార్వో కార్యాలయంలో వ్యక్తి హల్చల్
సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ సృష్టించాడు. రోషయ్య అనే ఎమ్మార్పీఎస్ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆందోళనకు దిగాడు. అంతేకాకుండా కిరోసిన్ డబ్బాతో ఆఫీసులోపలికి వెళ్లి తలుపులు బిగించుకున్నాడు. తన డిమాండ్లను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశాడు. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించాడు. అయితే వెంటనే అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు రోశయ్యను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కొలకలూరు రైల్వేస్టేషన్లో కలకలం
గుంటూరు : తెనాలి మండలం కొలకలూరు రైల్వే స్టేషన్లో కలకలం రేగింది. స్టేషన్ మాస్టర్ గదికి గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. దీంతో గదిలో ఉన్న రికార్డులు, ఫర్నిచర్ స్వల్పంగా దగ్దమయ్యాయి. ఘటనా స్థలంలో మందుబాటిళ్లు , ఎంఆర్పీఎస్ జెండాలు లభ్యమయ్యాయి. ఎంఆర్పీఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ అక్రమ అరెస్టుకు నిరసనగానే ఈ ఘటనకు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
సెల్‌టవర్ ఎక్కిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు
సాక్షి, నిజామాబాద్: ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు బుధవారం సెల్‌టవర్ ఎక్కారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని ఎడవల్లి మండల కేంద్రంలోని ఎంఆర్వో కార్యాలయం వద్ద ఉన్న సెల్‌టవర్‌ను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఎక్కి తమ నిరసన తెలియజేశారు. కాగా... ట్యాంక్‌బండ్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించిన మంద క్రిష్ణమాదిగను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. -
ఏపీ సీఎం దిష్టిబొమ్మ దహనం
ఏపీ సీఎం దిష్టిబొమ్మ దహనం బంజారాహిల్స్: ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అక్రమ అరెస్టును నిరసిస్తూ జూబ్లీహిల్స్ డివిజన్ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు గురువారం ఫిలింనగర్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా డివిజన్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కాటూరి రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మార్పీఎస్ మద్దతుతో గెలిచి ముఖ్యమంత్రి పీఠమెక్కిన చంద్రబాబు మాదిగలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణను విస్మరించిన చంద్రబాబు తమ అధినేత మందకృష్ణ మాదిగను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి దయ్యాల దాసు, ఉపాధ్యక్షులు నడిమింటి కృష్ణ, భవానీ రమేష్, వేణు, డి. ప్రభాకర్, పాపయ్య, కె. నర్సింహ్మ, నాగరాజు, కె.కృష్ణ, ఎన్. బిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముట్టడికి యత్నం ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగను అకారణంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మందా కుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు గురువారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముట్టడికి యత్నించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చౌరస్తాలో బైఠాయించారు. దీంతో పోలీసులు వీరందరిని అరెస్ట్ చేసేందుకు యత్నించగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ట్రస్ట్‌భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు పలువురు కార్యకర్తలు తీవ్ర యత్నాలు చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం వీరిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆందోళన చేసిన వారిలో ఎంఎస్ఎఫ్ జాతీయ నాయకులు లింగస్వామి, రాష్ట్ర అధ్యక్షుడు విజయ్, రమేష్, రంగారెడ్డి అర్బన్ ప్రధాన కార్యదర్శి కేశవ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ, శ్రీహరి, జంగం బబ్బి, కుమ్మరి సత్యనారాయణ, ఎంఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షుడు శేఖర్ తదితరులు ఉన్నారు. -
మాలెక్క తేల్చండి
-
పార్టీలకు నాయకులు కరువు
-
పార్టీలకు నాయకులు కరువు
టీడీపీ వాళ్లను అరువు తీసుకెళుతున్నాయని బాబు ధ్వజం వలసలపై ఎవరినీ విమర్శించబోనని వ్యాఖ్య ‘మిషన్ కాకతీయ’ కమీషన్లతో తమ ఎమ్మెల్యేలకు ఎర కేసీఆర్‌పై రేవంత్, ఇతర నేతల ధ్వజం మహబూబ్‌నగర్: సొంతంగా నాయకులను తయారు చేసుకోలేక టీడీపీ నేతలను ఇతర పార్టీలు అరువు తెచ్చుకుంటున్నాయని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఒక్కరు పోతే వంద మంది నాయకులను తయారు చేసుకునే సత్తా తమ పార్టీకి ఉందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన టీడీపీ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. ‘తెలంగాణలో టీడీపీని దెబ్బతీసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. కొందరు నాయకులు పార్టీకి అన్యాయం చేసినా కార్యకర్తలే కాపాడుతున్నారు. సామాన్య కార్యకర్తలను ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేస్తే.. వారు పార్టీని వదలడం బాధాకరం. ఇలాంటి విషయాల్లో ఎవరినీ విమర్శించదలచుకోలేదు. మన నాయకులను వేరే పార్టీలు అరువు తెచ్చుకుంటున్నాయి. సొం తంగా నాయకులను తయారు చేసుకోలేకపోవడం వారి బలహీనత. కార్యకర్తల సహాయంతో వంద మంది నాయకులను తయారు చేసుకునే సత్తా పార్టీకి ఉంది’ అని టీడీపీ అధినేత వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలపడం టీడీపీ అభిమతం కాదని, రెండు రాష్ట్రాలను కలిపి బలమైన శక్తిగా రూపొందించాలన్నదే తన ఆశయమని చంద్రబాబు పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎస్సీలను వర్గీకరించి మాదిగలకు రిజర్వేషన్లు కల్పించినా.. తర్వాతి ప్రభుత్వాలు లోపాలను సరిచేయలేదన్నారు. రాష్ర్ట విభజన తర్వాత తెలంగాణలో మాదిగలు, ఆంధ్రప్రదేశ్‌లో మాలలు ఎక్కువగా ఉన్నందు న ఈ విషయంపై ఆలోచన చేస్తున్నట్లు తెలి పారు.అంతకుముందు శంషాబాద్ మీదుగా మహబూబ్‌నగర్ వస్తూ బుద్వేల్ వద్ద చంద్రబాబు మాట్లాడారు. తెలంగాణలో టీడీపీని నామరూపాల్లేకుండా చేయడం ఎవరితరం కాదన్నారు. ఆంధ్ర, తెలంగాణ తనకు రెండు కళ్లలాంటివని, 2019లో తెలంగాణలో టీడీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యమని పేర్కొన్నారు. కమీషన్ల డబ్బుతో ఎమ్మెల్యేల కొనుగోలు ‘మిషన్ కాకతీయ’ కమీషన్లతో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేస్తోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. ఎన్నికల హామీల అమలులో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. టీడీపీ నుంచి వెళ్లిన నేతలతో రాజీనామాలు చేయించి తిరిగి గెలిపిస్తే రాజకీయ సన్యాసం చేస్తామని టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ చేశారు. కాగా, రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వందలాది మంద్రి ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణను కేసీఆర్ తన కుటుంబంతో కలిసి దోచుకుతింటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘శాసనసభలో నన్ను కళ్లలోకి కళ్లు పెట్టి సూటిగా చూడలేనోడివి... నువ్వు మా పార్టీని ఖాళీ చేస్తావా? తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని జోకుడుగాళ్లు అంటున్నరు. మందేస్తే తప్ప కాలు కదపని నువ్వు జాతిపితవా’’ అని రేవంత్ ఘాటుగా వ్యాఖ్యానించారు. పార్టీ ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, వివేక్‌గౌడ్, సాయన్న, గాంధీ, సీనియర్ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రమేశ్ రాథోడ్, నర్సిరెడ్డి కూడా ప్రసంగించారు. ఎమ్మార్పీఎస్ రచ్చ చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఒక్కసారిగా సభలో గందరగోళం సృష్టించారు. పోలీసుల కళ్లుగప్పి సభావేదిక సమీపానికి దూసుకొచ్చి కుర్చీలు, చెప్పులు విసిరారు. తేనెటీగలను ప్లాస్టిక్ కవర్లో తెచ్చి సభ మధ్యలో విడిచారు. టీడీపీ కార్యకర్తలు కూడా కుర్చీలు విసరడంతో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, పోలీసులతోపాటు ఓ పత్రికా ఫొటోగ్రాఫర్‌కు గాయాలయ్యాయి. జెండాలు ఊపుతూ నిరసన తెలిపిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీలు విదిల్చి చెదరగొట్టారు. -
చంద్రబాబు సభలో డిష్యుం డిష్యుం
మహబూబ్‌నగర్ క్రైం: చంద్రబాబు నాయుడు గురువారం మహబూబ్‌నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సభ రణరంగాన్ని తలపించింది. సభలో చంద్రబాబునాయుడు ప్రసంగిస్తుండగానే ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. ఏమవుతుందో అని పోలీసులు తెలుసుకునేలోగానే గాల్లోకి కుర్చీలు లేచాయి. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ సభా వేదికపైకి కుర్చీలు విసిరారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభ ఒక్కసారిగా అట్టుడికిపోయింది. దీంతో తేరుకున్న టీడీపీ కార్యకర్తలు కూడా ఎమ్మార్పీఎస్ కార్యకర్తల పైకి కుర్చీలు విసిరారు. టీడీపీ కార్యకర్తలు లేచి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపైకి దూసుకెళ్లారు. ఒకరిపైకి ఒకరు కుర్చీలు విసురుకోవడంతో కొద్దిసేపు సభా ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. చాలా సేపటి వరకు అక్కడ ఏం జరుగుతుందో పోలీసులకు, నాయకులకు అర్థం కాలేదు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలకు, జర్నలిస్టులకు, పోలీసులకు గాయాలయ్యాయి. అదే సమయంలో మిడ్జిల్ మండలంలోని గుడిగండ్ల గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ కార్యకర్త రాజు, మరో యువకుడు సభా ప్రాంగణం కప్పుపైకి వెళ్లి ఎమ్మార్పీఎస్ జెండాలతో చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేయడంతో పోలీసులు నివ్వెరపోయారు. వెంటనే పోలీసులు పెకైక్కి వారిని దింపేందుకు ప్రయత్నించారు. అంతలో సభలో ఉన్న టీడీపీ కార్యకర్తలు చెప్పులు, నీళ్ల బాటిళ్లు, కుర్చీలను ఎమ్మార్పీఎస్ నాయకులపైకి విసిరారు. టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నిస్తుండంతో పోలీసులు వలయంగా ఏర్పడి లాఠీచార్జి చేసి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. తేనెటీగల దాడికి యత్నం చంద్రబాబు సభలో నిరసన తెలిపేందుకు వచ్చిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తేనెటీగల దాడికి యత్నించారు. ఓ ప్లాస్టిక్ కవర్లో తేనెతుట్టెను తీసుకొచ్చి సభాప్రాంగణంపైకి విసిరేందుకు యత్నించారు. గుర్తించిన అగ్నిమాపక సిబ్బంది దానిని వెంటనే నివారించారు. ఎస్ఐని సస్పెండ్ చేయాలని నినాదాలు.. సభప్రాంగణంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి డీసీఎంలోకి తరలిస్తున్న క్రమంలో పోలీసులు వారిని కులం పేరుతో దూషించడమే కాకుండా తమ కార్యకర్తలపై విచక్షణ రహితంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి అన్నారు. కార్యకర్తలను అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఉంచడంతో అధ్యక్షుడితో పాటు మరో 50మంది కార్యకర్తలు పోలీసుస్టేషన్ ఎదుట బైటాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆంధ్రా పాలకులకు వత్తాసు పలుకుతూ పోలీసులు కార్యకర్తలపై జులుం చేయడం సమంజసం కాదని చెప్పారు. ప్రశాంతంగా తమ నిరసనను తెలియజేస్తున్న క్రమంలో పోలీసులు అత్యుత్సాహంగా తమపై దాడులకు దిగారని ఆరోపించారు. ఈ దాడులలో గాయాల పాలైన బాధితులను పోలీసులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘర్షణలో ఇద్దరు పోలీసులకు గాయాలు.. ఎమ్మార్పీఎస్ కార్యకర్తల నిరసన సందర్బంగా ఎమ్మార్పీఎస్, టీడీపీ కార్యకర్తలు ఒకరిపైకి ఒకరు రాళ్లు, చెప్పులు, కుర్చీలు విసురుకునే క్రమంలో పోలీసులకు, జర్నలిస్టులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ యాదయ్య, మరో ఎస్ఐ తలకు గాయాలయ్యాయి. అదేవిధంగా ఓ పత్రిక ఫొటోగ్రాఫర్ తలకు తీవ్ర గాయమైంది. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై చంద్రబాబు విచారం వ్యక్తం చేయడంతో పాటు గాయపడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చును పార్టీ భరిస్తుందని హామీ ఇచ్చారు. గాయపడిన పత్రిక ఫొటోగ్రాఫర్‌కు లక్ష రూపాయల సాయం ప్రకటించారు. వేదిక వద్ద షార్ట్‌సర్క్యూట్ చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలోనే వేదిక వద్ద షార్ట్‌సర్క్యూట్ జరిగి కార్పెట్‌కు మంటలు అంటుకున్నాయి. అక్కడే కూర్చున్న కళాకారుల బృందం ఒక్కసారిగా పరుగులు తీయడంతో కలకలం చెలరేగింది. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. -
ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తల దాడి
-
ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తల దాడి
మహబూబ్‌నగర్: ఈ రోజు ఇక్కడ జరుగుతున్న టీడీపీ బహిరంగ సభలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించే సమయంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. దాంతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. సభాప్రాంగణం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
వర్గీకరణ కోసం కదంతొక్కిన ఎమ్మార్పీఎస్
ఏపీ అసెంబ్లీ ముట్టడికి యత్నం ఎక్కడికక్కడ కార్యకర్తల అరెస్టు చంద్రబాబుకు వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు సాక్షి,హైదరాబాద్: ఎస్సీల వర్గీకరణపై మాట తప్పిన ఏపీ సీఎం చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, వర్గీకరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టే వరకు ఆయనను వెంటాడి తీరుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. చంద్రబాబు మాదిగలను మోసం చేశాడని, ఏపీలో తెలుగుదేశం గద్దె దిగే వరకు వదిలిపెట్టబోమని, అలాగే తెలంగాణలో టీడీపీ ఉనికిని కోల్పోక తప్పదని ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ బుధవారం చేపట్టిన ‘చలో ఏపీ అసెంబ్లీ’ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏపీలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు నగర శివా రు ప్రాంతాలు, బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లలోనే అదుపులోకి తీసుకున్నారు. లక్డీకాఫూల్లో మంద కృష్ణతో పాటు, పలువురు నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఆందోళనకారులను అడ్డుకొనేందుకు ఉదయం నుంచే ఇందిరాపార్క్‌ను పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్న పోలీ సులు రెండు వైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. అసెంబ్లీకి వెళ్లే దారులన్నింటినీ మూసివేశారు. అసెంబ్లీ పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నిర్బంధాన్ని ఛేదించి పలువురు కార్యకర్తలు వాహనాల్లో అసెంబ్లీ వరకు వెళ్లి ముట్టడికి యత్నించారు. శాసన సభలోకి వెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. కాగా, ఇందిరాపార్కు వద్ద ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు గోషామహల్, గాంధీనగర్,బొల్లారం తదితర పోలీస్స్టేషన్లకు తరలిస్తున్న క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు టీడీపీ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం తమపై తీవ్ర నిర్బంధాన్ని అమలు చేసినప్పటికీ అసెంబ్లీ ముట్టడి విజయవంతమైందని మంద కృష్ణ ప్రక టించారు. ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగగా పేరు తెచ్చుకుంటానన్న చంద్రబాబు తమను మోసం చేశారన్నారు. చంద్రబాబు గెలుపు కోసం ఎమ్మార్పీఎస్ ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తు చేశారు. వర్గీకరణపై తెలుగుదేశం పొలిట్‌బ్యూరోలో తీర్మానం చేసిన చంద్రబాబు ఏపీలో వర్గీకరణను వ్యతిరేకిస్తూ, తెలంగాణలో మద్దతునిస్తూ రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. వర్గీకరణపై ఇప్పటికైనా చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని, మాదిగల రుణం తీర్చుకోవాలని డిమాండ్ చేశారు. -
MRPS కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
-
ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు
మహ్మదాపురం (తిరుమలాయపాలెం): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందకుండా సీఎం చంద్రబాబు నాయుడు మోకాలడ్డుతున్నారన్న ఆగ్రహంతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు గురువారం ఇక్కడ విధ్వంసానికి దిగారు. వరంగల్ జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటనను నిరసిస్తూ మాదిరిపురం-సుబ్లేడు క్రాస్ రోడ్డు వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టారు. విగ్రహ ఆవిష్కరణ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం... ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్బంగా సుబ్లేడు క్రాస్ రోడ్డు వద్ద 100 అడుగుల భారీ పైలాన్‌ను టీడీపీ నాయకులు నిర్మించారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. దీనిని చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఆనాడు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘మాదిగలకు పెద్ద కొడుకుగా ఉండి, ఎస్సీ వర్గీకరణకు న్యాయం చేస్తా’ అని ప్రకటించారు. ఆయన ఆనాడు ఇచ్చిన మాట తప్పారని, ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, ఆయన (చంద్రబాబు) పర్యటనను అడ్డుకునేందుకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే, పైలాన్ వద్ద చంద్రబాబు ఆవిష్కరించిన ఎన్టీఆర్ విగ్రహంపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. టీడీపీ జెండా దిమ్మెను కూల్చేందుకు ప్రయత్నించారు. చుట్టుపక్కలవారు వచ్చేసరికి వారు ఆటోలో, మోటార్ సైకిళ్లపై సుబ్లేడు వైపు పరారయ్యూరు. స్థానికులు నీళ్లు తెచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి అంటుకున్న మంటలను ఆర్పేశారు. విగ్రహం వెనుక బాగం పూర్తిగా కాలిపోరుు, ఒకవైపునకు వంగింది. ఘటన స్థలంలో ఎమ్మార్పీఎస్ జెండా ఉంది. ఈ సమాచారమందుకున్న వెంటనే ఎస్సై ఓంకార్ యాదవ్ అక్కడకు వెళ్లారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నిప్పు పెట్టిన విగ్రహాన్ని కూసుమంచి సీఐ రవీందర్‌రెడ్డి పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ మండల అధ్యక్షుడు జోగుపర్తి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం కూసుమంచి సీఐ రవీందర్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు ముమ్మరం గాలిస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు జోగుపర్తి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో ఖండించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు ఉనికి కోసమే ఇలాంటి విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. -
MRPS కార్యకర్తలను చితక్కొట్టిన టీడీపీ కార్యకర్తలు