
మహబూబ్‌నగర్ క్రైం: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను విడుదల చేయాలనే డిమాండ్‌తో ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి ఆందోళన చేశాడు. దీంతో అక్కడకు పెద్దసంఖ్యలో స్థానికులు చేరుకోగా ట్రాఫిక్ జాం కావడంతో దాదాపు అర గంట పాటు ఉట్కంఠ నెలకొంది. హన్వాడ మండల ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి కేశవులు మంద కృష్ణను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌తో సోమవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలో బాధం సరోజిని దేవి ఆడిటోరియం ఆవరణలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ సెల్‌టవర్ ఎక్కాడు. అక్కడకు చేరుకున్న టూటౌన్ సీఐ డీవీపీ.రాజు, ఎస్‌ఐ మురళి అతడికి నచ్చచెప్పినా కిందకు రాలేదు. ఆ తర్వాత మంద కృష్ణ జైలు నుంచి విడుదల అయ్యాడని ఫోన్‌లో సమాచారం ఇవ్వడంతో కేశవులు కిందకు దిగాడు. ఈ మేరకు కేశవులుపై టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో 309 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.