బీరు బాటిల్‌తో దాడి.. ఒకరి మృతి | 1 died in guntur district | Sakshi
Sakshi News home page

బీరు బాటిల్‌తో దాడి.. ఒకరి మృతి

Published Fri, Oct 23 2015 12:57 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

1 died in guntur district

బొల్లపల్లి : మద్యం మత్తులో జరిగిన గొడవ ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. గుంటూరు జిల్లా బొల్లపల్లి మండలం వెల్లటూరులో  కోటేశ్వరరావు (28), ఏసుబాబు అనే ఇద్దరు వ్యక్తుల మధ్య గురువారం రాత్రి ఘర్షణ జరిగింది. ఆ సమయంలో వారిద్దరూ మద్యం మత్తులో ఉన్నారు. దీంతో ఏసుబాబు తండ్రి పెద్ద సుబ్బారావు రంగప్రవేశం చేశాడు.

అనంతరం ఇద్దరూ కలసి బీర్ బాటిల్‌తో కోటేశ్వరరావు పై దాడి చేశాడు. ఈ ఘటనలో కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలు కాగా నర్సారావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఏసుబాబు, అతని తండ్రి పరారీలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement