తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలో చేపట్టిన అయుత మహాచండీయాగం శనివారం నాలుగోరోజుకు చేరుకుంది.
జగ్‌దేవ్‌పూర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలో చేపట్టిన అయుత మహాచండీయాగం శనివారం నాలుగోరోజుకు చేరుకుంది. అయుత చండీయాగం చూసేందుకు వచ్చే భక్తుల సంఖ్య శనివారం ఉదయం మరింత పెరిగింది. చివరి రెండు రోజులు కావటంతో శనివారం ఉదయానికే సుమారు 80 వేల మంది యాగశాలకు చేరుకున్నారు. యాగశాల వైపునకు వచ్చే బైక్‌లు సహా వాహనాలను నర్సన్నపేట్, ప్రజ్ఙాపూర్, గౌరారం, తుర్కపల్లి వద్దనే పోలీసులు నిలిపివేస్తున్నారు.
దాదాపు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మధ్యాహ్నానికి రద్దీ తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు యాగానికి లక్ష వరకు భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా నేడు కుంకుమార్చన రద్దు చేస్తున్నట్లు నిర్వహాకులు తెలిపారు.