'ప్రభుత్వ నిర్ణయం ఆశ్చర్యంగా ఉంది' | bjp mla vishnu kumar raju responds arogya mitra issue | Sakshi

'ప్రభుత్వ నిర్ణయం ఆశ్చర్యంగా ఉంది'

Jan 21 2016 2:12 PM | Updated on Aug 20 2018 4:17 PM

రాష్ట్ర వ్యాప్తంగా వైద్యమిత్ర ఉద్యోగులను తొలగించడం బాధాకరమని బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణు కుమార్ రాజు అన్నారు.

విశాఖ:  రాష్ట్ర వ్యాప్తంగా వైద్యమిత్ర ఉద్యోగులను తొలగించడం బాధాకరమని బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణు కుమార్ రాజు అన్నారు. ప్రభుత్వానికి ఇది ధర్మం కాదని తెలిపారు. ఎన్టీఆర్ వైద్యమిత్ర ఉద్యోగులు గురువారం ఆయనను కలిసారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి నోటీసులు లేకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఒక్క విశాఖపట్నంలోనే 215 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారని, ఇది కరెక్ట్ కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 40 శాతం జీతాలు పెంచి ఉద్యోగాలు ఇస్తుంటే.. ఏపీలో జీతం పెరుగుతున్న సందర్భంలో తొలగించడం సమర్ధనీయం కాదని తెలిపారు. వైద్య మిత్ర ఉద్యోగుల తొలగింపుపై ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్టు ఆయన చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై చర్చిస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement