
రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న రాజమౌళి
కర్నూలు: కర్నూలు జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్రస్వామిని శుక్రవారం ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శించుకున్నారు. ఆయనతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి కూడా స్వామిని దర్శించుకున్నారు. తెలుగు సినమా ఖ్యాతిని పెంచిన జక్కన్న మంత్రాలయం విచ్చేసారనే వార్త తెలియడంతో.. అభిమానులు రాజమౌళిని చూడడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.