రూ. 2 లక్షలకు కన్నకూతుర్ని అమ్మేశారు | father sold his Daughter for Rs 2 lacks | Sakshi
Sakshi News home page

రూ. 2 లక్షలకు కన్నకూతుర్ని అమ్మేశారు

Published Wed, Feb 17 2016 6:26 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

father sold his Daughter for Rs 2 lacks

డబ్బులకు ఆశపడి అభం శుభం తెలియని బాలికను తల్లిదండ్రులు రూ. 2 లక్షలకు విక్రయించారు. ఈ మేరకు మధ్యవర్తి నుంచి డబ్బులు స్వీకరించి బాలికను గుజరాత్ తరలిస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి రక్షించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

రంగారెడ్డి జిల్లా బషిరాబాద్ మండలం దామర్‌చేడ్ పంచాయతి పరిధిలోని వాల్యానాయక్ తండాకు చెందిన బాలిక(16)ని తల్లిదండ్రులు మనీబాయి అనే మధ్యవర్తికి విక్రయించారు. అతను ఆ అమ్మాయికి పెళ్లి చేస్తానని రైల్లో గుజరాత్‌కు తీసుకెళ్తుండగా.. విషయం తెలుసుకున్న పోలీసులు బాలికను రక్షించి విక్రయించిన తల్లిదండ్రులతో పాటు మధ్యవర్తిని అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement