ఘాట్రోడ్డులో ప్రమాదం: భక్తులకు గాయాలు | Four Pilgrims Injured On Tirumala Ghat Road | Sakshi
Sakshi News home page

ఘాట్రోడ్డులో ప్రమాదం: భక్తులకు గాయాలు

Published Thu, Dec 17 2015 8:47 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Four Pilgrims Injured On Tirumala Ghat Road

తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 16వ మలుపు వద్ద గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. భక్తులతో వేగంగా వెళ్తున్న వాహనం ఘాట్ రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఘాట్ రోడ్డులో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాన్ని పక్కకు తీసి... ట్రాఫిక్ని పునరుద్ధరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement