హైదరాబాద్‌లో చెల్లని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వరంగల్‌లో ఎలా చెల్లుతాడని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు.వరంగల్‌లో ఏర్పాటుచేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న వరంగల్‌కు ఆయన హామీలు గుప్పించారు.
వరంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. వచ్చే మూడేళ్లలో వరంగల్ అభివృద్ధికి రూ.900 కోట్లుమంజూరు చేస్తామని తెలిపారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎం కె. చంద్రశేఖరరావు అని నీటి పారుదల శాఖ మంత్రి టీ. హరీష్‌రావు కొనియాడారు.ప్రజలను ఓటు అడిగే హక్కు కేవలం టీఆర్ఎస్కే ఉందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మనుగడ లేదని, కాంగ్రెస్ దయనీయ పరిస్థితిలో ఉందని తెలిపారు. వరంగల్ పట్టణ ప్రజలు ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పునిస్తారని ధీమా వ్యక్తం చేశారు.