నల్లగొండ: అసెంబ్లీ సమావేశాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఆయనిక్కడ బుధవారం మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఐక్యత లేదన్నారు. తెలంగాణలో ప్రతి ఇంటికి తాగనీరు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తమ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ ఓర్వలేక పోతోందని తెలిపారు. వచ్చే రెండేళ్లలో మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.