2016-17 విద్యా సంవత్సరంలో పీజీ డిగ్రీ, డిప్లొమా (ఎండీ /ఎంఎస్) మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ నెల 28న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి అందుబాటులో ఉన్న సుమారు 2700 సీట్లలో 1840 సీట్లను కన్వీనర్ కోటా కింద ప్రవేశ పరీక్షల ఆధారంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ భర్తీ చేస్తుంది.
ప్రవేశ పరీక్ష కోసం రెండు రాష్ట్రాల్లో కలిపి 55 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏపీలో 27, తెలంగాణలో 28 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు ఈ నెల 21 నుంచే హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడు చేసుకుంటున్నారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుంది. 29న ఆన్సర్ ‘కీ’ విడుదల చేస్తారు. మార్చి 10న ఫైనల్ ‘కీ’తో పాటు ఫలితాలు విడుదల చేయనున్నారు.