కర్నూలు జిలా ఆదోని రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సైన్స్ ఎగ్జిబిషన్ రైలును డీఆర్‌ఎం గోపీనాథ్ మాల్యా బుధవారం ఉదయం ప్రారంభించారు. వాతావరణంలో వచ్చే మార్పులు, వాటి కారణంగా విపత్తులు, ఇతర పరిణామాల గురించి విద్యార్థులకు ఈ రైలు ద్వారా తెలియజేయనున్నారు. 13 ఏసీ బోగీలలో చిత్రాల రూపంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి ఈ సైన్స్ ఎక్స్‌ప్రెస్‌ను చూసేందుకు విద్యార్థులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యా శాఖాధికారి శ్రీరాములు కూడా పాల్గొన్నారు.
ఆదోనిలో సైన్స్ ఎక్స్‌ప్రెస్ ప్రదర్శన ప్రారంభం
Published Wed, Feb 24 2016 11:07 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM
Advertisement
Advertisement