science exhibition
-
సృజనకు పదును పెడితేనే ఆవిష్కరణలు
జడ్చర్ల/ జడ్చర్ల టౌన్: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహిస్తేనే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి ఇండస్ట్రియల్ గ్రీన్ పార్కులోని ఎస్‌వీకేఎంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలకు పదుపుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ప్రతి పాఠశాలలోనూ సైన్స్ ప్రయోగశాలలు ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ ప్రదర్శనలో 33 జిల్లాల నుంచి ఇన్స్పైర్ 2023– 24 విభాగంలో 301.. 2024– 25 రాష్ట్రీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శన కింద 563 ఎంట్రీలు వచ్చాయి. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు‡ పాల్గొన్నారు. సంజీవని హెలికాప్టర్సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల హైసూ్కల్ విద్యార్థి ప్రణీత్ కుమార్ తన గైడ్ శోభారాణితో కలిసి ‘సంజీవని హెలికాప్టర్’ప్రయోగాన్ని ప్రదర్శించాడు. హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు బుల్లెట్ ప్రూఫ్, ఫైర్ప్రూప్తో కూడిన బెలూన్ ఓపెన్ అయి సురక్షితంగా బయటపడేందుకు వీలుగా రూపొందించారు. బెలూన్‌లోనే ఆక్సిజన్ ఉండటం వల్ల అందులో ప్రయాణించే వారికి ఎలాంటి ప్రాణహాని ఉండదు. దీనికి జీపీఎస్ అనుసంధానం ఉండటం వల్ల హెలికాప్టర్ క్రాషెస్‌ను గుర్తించేందుకు సులువవుతుంది. మొక్కజొన్న వ్యర్థాల నుంచి బయో ఆయిల్మొక్కజొన్న వ్యర్థాలు, పేడ నుంచి బయో ఆయిల్ ఉత్పత్తి చేసే ఆవిష్కరణను నిజామాబాద్ విజయ హైస్కూల్ విద్యార్థులు విజిదేంద్రియ, శ్రీకర్ కలసి ప్రదర్శించారు. అ్రల్టాసోనిక్ హెల్మెట్వినికిడి లోపం ఉన్నవారితో పాటు వాహనదారులకు బైక్ నడిపే సమయంలో ప్రమాదాల నివారణకోసం అ్రల్టాసోనిక్ హెల్మెట్‌ను ఖమ్మం జిల్లా చెన్నారం జెడ్పీ హైసూ్కల్‌కు చెందిన విద్యార్థి ప్రియ రూపొందించింది. వాహనం నడిపేటప్పుడు సెన్సార్ల ఆధారంగా హెల్మెట్ గ్లాస్‌కు కంటికి కనిపించే విధంగా గ్రీన్, ఆరెంజ్, రెడ్ లైట్లను ఏర్పాటు చేశారు. దీని ఖర్చు కేవలం రూ.400 నుంచి రూ.1,000 వరకు అవుతుంది. -
సీసీఎంబీ మొబైల్ ఎగ్జిబిషన్ ప్రారంభం
-
ఏలూరు జిల్లాలో వెల్లివిరిసిన విద్యార్థుల ప్రతిభ
-
సృజనకు సాన.. వైజ్ఞానిక ప్రదర్శన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తిని పెంచి.. వారి ఆలోచనలకు సానపెట్టి నూతన ఆవిష్కరణలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విజ్ఞాన శాస్త్రం, గణితం, పర్యావరణాన్ని ముడి సరుకులుగా వినియోగించి సృ‘జన’హితమైన ఆవిష్కరణలు తీసుకువచ్చేలా విద్యార్థులను ఉపాధ్యాయులు సమాయత్తం చేస్తున్నారు. విజ్ఞాన ప్రదర్శనల ద్వారా చిన్నతనం నుంచే ఆవిష్కరణల ఆలోచనలు పెంచేలా మార్గదర్శకం చేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లావ్యాప్తంగా పాఠశాల స్థాయిలో సైన్స్ ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. తొలుత పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనల్లో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి వాటిని మండల స్థాయికి పంపుతారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనల్లో తమ నైపుణ్యాన్ని రంగరించి మండల స్థాయి అక్కడి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయికి తమ ఆవిష్కరణలు వెళ్లాలనే ఆసక్తి విద్యార్థుల్లో కనిపిస్తోంది. వారికి గైడ్ టీచర్లు సూచనలిస్తూ మరింత పదును పెడుతూ ప్రోత్సహిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచే ప్రదర్శనలు విద్యార్థుల్లో సహజంగా ఉండే బెరుకును పోగొట్టడానికి తొలుత వారి ఆవిష్కరణలను తమతో ఎప్పుడూ తిరిగే, తాము రోజూ చూసే సహ విద్యార్థుల మధ్యనే ఈ ప్రదర్శనలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దీంతో మొదటగా వారు చదివే పాఠశాలలోనే విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించే ఏర్పాటుచేసింది. దీని ద్వారా తోటి విద్యార్థుల నుంచి వెల్లడయ్యే అభిప్రాయాలు, వారి నుంచి అందుకునే అభినందనలు విద్యార్థులకు సగం బలాన్నిస్తాయనేది ప్రధాన ఉద్దేశం. ఈ మేరకు ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లాలో ఈనెల 22, 23 తేదీల్లో పాఠశాల స్థాయిలో విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించారు. ఆవిష్కరణలకు మార్గనిర్దేశనం విద్యార్థులు ఆవిష్కరణలు చేయడానికి తగిన అంశాలను వెతుక్కోవాల్సిన పనిలేకుండా ప్రభుత్వమే కొన్ని అంశాలను సూచించింది. ఈ మేరకు విద్యార్థు లు పర్యావరణ అనుకూల పదార్థాలపై, ఆరోగ్యం, పరిశుభ్రతపై, సాఫ్ట్వేర్–యాప్స్ అభివృద్ధి, పర్యావరణం–వాతావరణ మార్పులు, గణిత నమూనాలు అనే అంశాలపై తమ ప్రాజెక్టులను సిద్ధం చేశారు. ఆయా ప్రాజెక్టులను పాఠశాల స్థాయిలో మంగళ, బుధవారాల్లో ప్రదర్శించారు. మండల స్థాయికి ఐదు చొప్పున.. పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన వాటిలో ఉత్తమమైన ఐదు ప్రాజెక్టులను ఎంపిక చేసి మండల స్థాయి ప్రదర్శనలకు పంపనున్నారు. ఇలా ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు మండల స్థాయిలో ప్రదర్శనకు వెళ్లనున్న నేపథ్యంలో పోటీ తీవ్రంగా ఉంది. వచ్చేనెల 12, 13వ తేదీల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో మండల స్థాయి ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. సృజనాత్మకతకు పెంచేలా.. విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తికి పదును పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పటికే పాఠశాల స్థాయి ప్రదర్శనలు పూర్తయ్యాయి. కేవలం ప్రాజెక్టులు రూపొందించేలా ప్రోత్సహించడంతో పాటు ఆయా ప్రాజెక్టులను చూసి ఇతర విద్యార్థులు స్ఫూర్తి పొందడం ప్రదర్శనల ఉద్దేశం. అలాగే ప్రాజెక్టులను రూపొందించిన విద్యార్థులను ఆదర్శంగా తీసుకుని మిగిలిన పిల్లలు ఇటుగా ఆలోచించేలా కృషిచేస్తున్నాం. అందుకే పాఠశాల స్థాయిలో నిర్వహించిన ప్రదర్శనలకు సమీపంలోని ఇతర పాఠశాలల విద్యార్థులను కూడా తీసుకువెళ్లి వారికి ప్రాజెక్టులను పరిచయం చేయాలని సంబంధిత స్కూళ్ల ప్రధానోపాధ్యాయులను ఆదేశించాం. – ఆర్ఎస్ గంగాభవాని, జిల్లా విద్యాశాఖాధికారి, ఏలూరు -
మాస్టర్ మైండ్స్!
జూబ్లీహిల్స్: సైన్స్ ఎగ్జిబిషన్స్ ద్వారా చిన్నారుల్లో దాగివున్న ప్రతిభ వెల్లడవుతుందనడానికి నిదర్శనంగా నిలిచారు..యూసుఫ్‌గూడ సాయికృప పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తమీమ్ ఫాతిమా. ఆమె రూపొందించిన ‘సురక్షా బ్యాండ్ ’ పరికరం ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన రాష్ట్రస్ధాయి ఎగ్జిబిషన్లో ఉత్తమ బహుమతి సాధించింది. అలాగే ఈనెల 12న డిల్లీలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి సైన్స్ ప్రదర్శనకు కూడా ఎంపికై మన్ననలు అందుకుంటుంది. తమీమ్ తండ్రి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తల్లి గృహిణి. సురక్షా బ్యాండ్ తయారీ.. నానో మెటీరియల్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్, క్రిస్టల్ ఏసీ తదితర పరికరాలను తమీమా మార్కెట్లో సేకరించింది. ఇంటర్నెట్లో శోధించి బ్యాండ్ రూపకల్పనపై ఒక అవగాహనకు వచ్చింది. పాఠశాల సైన్స్ టీచర్ సంతోష్ సహకారంతో దాదాపు ఆరు నెలలపాటు శ్రమించి మణికట్టుకు కట్టుకునే బ్యాండ్‌ను రూపొందించింది. బ్యాండ్ పనితీరు ఇలా.... బ్యాండ్‌కు ఒక బటన్ అమర్చి ఉంటుంది. ఆపద సమయంలో బటన్ నొక్కితే చాలు వారు ఎంచుకున్న ఫోన్ నెంబర్లకు, పోలీసులకు సంక్షిప్త సందేశం వెళుతుంది. వారు అప్రమత్తమై వెతుక్కుంటూ వచ్చేలా జీపీఎస్ మ్యాపింగ్‌తో బ్యాండ్ అనుసంధానమై ఉంటుంది. జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటుతా.. కొన్నేళ్ల క్రితం మా చెల్లెలు ఆడుకుంటూ తప్పిపోయింది. మేము చాలా టెన్షన్ పడ్డాం. అదృష్టవశాత్తు తెలిసినవాళ్లు మా చెల్లిని చూసి అప్పగించారు. అప్పుడే నామదిలో ఈ ఆలోచన మెరిసింది. అప్పటినుండి బ్యాండ్ రూపకల్పన కోసం ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. పిల్లలు, బయటకు వెళ్లే మహిళలు, వృద్ధులకు ఈ బ్యాండ్ ఎంతో ఉపకరిస్తుంది. నా బ్యాండ్ జాతీయ పోటీల్లోనూ సత్తా చాటుతుంది. – తమీమ్ ఫాతిమా మా ప్రోత్సాహం ఉంటుంది.. ట్రాఫికింగ్‌కు గురయ్యేవారికి ఈ బ్యాండ్ ఎంతో మేలు చేస్తుంది. తమీమ్ పరిశోధనలకు మా ప్రోత్సాహం ఉంటుంది. డిల్లీలో జరగనున్న జాతీయస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో సురక్షాబ్యాండ్ ఎంపికైతే తమీమాకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది. మరిన్ని పరిశోధనలు చేయడానికి ప్రభుత్వం నిధులు కూడా అందిస్తుంది. – అంజనారావు, ప్రిన్సిపల్, సాయికృప పాఠశాల, యూసుఫ్‌గూడ -
సైన్స్ ఎగ్జిబిషన్ విజయవంతం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాల డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ విజయవంతమైందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ చెప్పారు. గురువారం కళాశాలలోని నూతన లెక్చరర్ గ్యాలరీలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ మాట్లాడుతూ 20 రోజుల పాటు కొనసాగిన ఎగ్జిబిషన్లో 35 విభాగాలు అద్భుత ప్రదర్శన కనబరిచాయన్నారు. జిల్లా నుంచి గాక రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సైతం సందర్శకులు ప్రదర్శన చూసేందుకు రావడం ఆనందదాయకమన్నారు. ప్రతి విభాగం ఎంతో ఉత్సాహంగా పనిచేయడం వల్లే ఇది విజయవంతం అయ్యిందన్నారు. అనంతరం రిటైర్డ్ డీఎంఈ డాక్టర్ ఎస్ఏ సత్తార్, డాక్టర్ వెంకటేష్ మాట్లాడారు. చివరగా వివిధ అంశాల్లో ప్రతిభ కనపరిచిన విభాగాధిపతులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు శ్రీదేవి, ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్లు కృష్ణానాయక్, పి. చంద్రశేఖర్, ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్రనాథ్‌రెడ్డి, ఎగ్జిబిషన్ ఇన్‌ఛార్జి జోజిరెడ్డి, పి. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
విజ్ఞాన ప్రదర్శనలతో నైపుణ్యాభివృద్ధి
- త్వరలో రాష్ట్ర క్యాన్సర్ యూనిట్ కర్నూలులో ఏర్పాటు – డీఎంఈ డాక్టర్ సుబ్బారావు కర్నూలు (హాస్పిటల్): విజ్ఞాన ప్రదర్శనలతో వైద్యవిద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి జరుగుతుందని వైద్య విద్య సంచాలకులు డాక్టర్ సుబ్బారావు అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజి 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం కళాశాలలో సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞాన ప్రదర్శనలతో వైద్య విద్యార్థుల్లో సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయన్నారు. ఇప్పటి విద్యార్థులకు ఈ రెండు విషయాల్లో నైపుణ్యాలు చాలా అవసరమని చెప్పారు. వారు వైద్య విద్య పూర్తి చేసుకుని బయటకు వచ్చాక ఎవరితో ఎలా మాట్లాడాలో, రోగులతో ఎలా వ్యవహరించాలో కూడా తెలియడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు అంశాల గురించి వారు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఇలాంటి ఎగ్జిబిషన్లతో ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కలుగుతుందన్నారు. శరీర నిర్మాణం, వ్యాధులు, దాని నివారణ, చికిత్స గురించి తెలుస్తాయన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో వార్షికోత్సవాలు, సైన్స్ ఎగ్జిబిషన్లకు ప్రత్యేక నిధులు కేటాయించే విషయం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలోని సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు లేవని, దీనివల్ల డీఎం, ఎంసీహెచ్ సీట్లకు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనన్నారు. ఈ విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి చోటా ఎంసీహెచ్ (మాతాశిశు భవనం)కు రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రుల్లో ఇటీవల ఓపీ బాగా పెరిగిందన్నారు. అనంతపురం మెడికల్ కళాశాలలో సూపర్‌స్పెషాలిటీ విభాగాలను ప్రారంభించామని, దీనివల్ల కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలపై భారం తగ్గుతుందని చెప్పారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో త్వరలో ఎమర్జెన్సీ మెడిసిన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పీడియాట్రిక్, గైనిక్ విభాగాల్లో ప్రస్తుతమున్న నాలుగు యూనిట్ల స్థానంలో ఆరు యూనిట్లు పెంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. రాష్ట్ర క్యాన్సర్ ఇన్సిట్యూట్‌ను కర్నూలులో త్వరలో ప్రారంభమవుతుందని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ శ్రీదేవి, ఏఆర్ఎంవో డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్, ప్రొఫెసర్లు జోజిరెడ్డి, పి.చంద్రశేఖర్, చంద్రశేఖర్, శంకరశర్మ, కైలాష్‌నాథ్‌రెడ్డి, కృష్ణనాయక్, శ్రీహరి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కేఎంసీలో మెడికల్ సైన్స్ ఎగ్జిబిషన్
- 21 నుంచి ఏప్రిల్ 4 వరకు - 36 విభాగాల్లో స్టాల్స్ కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజిలో ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వరకు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం కళాశాలలో విలేకరులకు వెల్లడించారు. గతంలో సిల్వర్‌జూబ్లీ, గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాల సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించామని, ప్రస్తుతం డైమండ్ ఉత్సవాలు(60 ఏళ్లు) సందర్భంగా ఆ అవకాశం వచ్చిందన్నారు. కళాశాల, ఆసుపత్రిలోని 36 విభాగాల వైద్య విద్యార్థులు ప్రదర్శనలో భాగంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారన్నారు. లెక్చరర్ గ్యాలరీలో ఆయా విభాగాల ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగిన అభివృద్ధి గురించి తెలిపే షార్ట్‌ఫిల్మ్‌లు సైతం ప్రదర్శిస్తామన్నారు. డైమండ్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా నామ మాత్రపు ఫీజుతో కొన్ని రకాల వైద్యపరీక్షలు చేస్తామన్నారు. శరీర ధర్మాలు మొదలు వాటిపనితీరు, వ్యాధులు- వైద్య చికిత్సలు, ఆధునిక వైద్యవిధానాలపై రూపొందించిన ప్రదర్శనలు విజ్ఞానదాయకంగా ఉంటాయని తెలిపారు. రూ.20 నామమాత్రపు ప్రవేశరు సుముతో ప్రదర్శనను తిలకించే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి, ఆసుపత్రి ఏఆర్ఎంఓ డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి ఇన్స్పైర్–2016 ప్రారంభం
పెడన టౌన్ (మచిలీపట్నం) : సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యార్థులు అత్యున్నత స్థానానికి ఎదగాలని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అన్నారు. పెడనలోని సెయింట్ విన్సెంట్ పల్లోటి ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాలలో గురువారం ఇన్స్పైర్ –2016 వైజ్ఞానిక ప్రదర్శనను ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణతో కలిసి ఆయన ప్రారంభించారు. పట్టుదల, కృషి, ధృడసంకల్పంతో చదివితే ఉన్నత స్థానానికి ఎదిగేందుకు పేదరికం అడ్డురాదన్నారు. 2010లో ప్రారంభమైన ఇన్స్పైర్ కార్యక్రమం విద్యార్థుల్లో నిబిడికృతమైన ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు వేదికగా మారిందన్నారు. ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ విద్య అంటే కేవలం మార్కుల సాధనే కాదని, జ్ఞానం, నూతన పరిశోధనల పట్ల జిజ్ఞాస పెంచుకోవటమన్నారు. విద్యార్థులు స్వేచ్ఛగా ఆలోచించే విధంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మార్గదర్శనం చేయాలని సూచించారు. డీఈవో ఎ.సుబ్బారెడ్డి మాట్లాడుతూ రెండు రోజులపాటు జరగనున్న ఇన్స్పైర్–2016 వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లావ్యాప్తంగా 250 ప్రదర్శనలు ఉన్నాయన్నారు. వీటిలో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు పంపనున్నట్లు చెప్పారు. తొలుత నిండుగా దీవెనలు ఇచ్చిన దేవునికి స్తోత్రం అంటూ సెయింట్ విన్సెంట్ పల్లోటి స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన స్వాగతగీతం ఆకట్టుకుంది. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈడ్పుగంటి వెంకట్రామయ్య, మునిసిపల్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, వైస్‌చైర్మన్ అబ్ధుల్ ఖయ్యూం, మునిసిపల్ కమిషనర్ ఎం గోపాలరావు, ఎస్ఈఆర్టీ ప్రొఫెసర్ వనజాక్షి, మచిలీపట్నం, గుడివాడ డీవైఈవోలు గిరికుమారి, జి వెంకటేశ్వరరావు, పల్లోటి స్కూల్ కరస్పాండెంట్ ఫాదర్ జోజప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఆ రోజు టీచర్స్ కంగారు పడ్డారు! - కాజల్
టీచర్స్ డే స్పెషల్ చదువంటే ఇష్టమే కానీ బాగా అల్లరిపిల్లని. ఓసారి స్కూల్లో అందరితో కలసి ఓ సైన్స్ ఎగ్జిబిషన్‌కి వెళ్లాను. బోర్ కొట్టడంతో మధ్యలోనే ఇంటికి వచ్చేశా. నేను తప్పిపోయాననుకుని టీచర్లు కంగారుపడ్డారు. అమ్మతో చెప్పాలని మా ఇంటికి వచ్చారు. నేను తీరిగ్గా టీవీ చూస్తున్నాను. దాంతో చిన్న చిన్నగా చివాట్లు పెట్టారు. ఇప్పటికీ ఆ సంఘటన తలచుకుంటే బాగా నవ్వొస్తుంది. ఏదో చిన్నప్పుడు తెలియక అలా చేశా కానీ, టీచర్స్ అంటే గౌరవం లేక కాదు. ఆచార్య దేవోభవ అని ఊరికే అనరు. నిజమే.. మనకు విద్యా బుద్ధులు నేర్పించే టీచర్లు దేవుడితో సమానమే. చిన్నప్పుడు ఏవేవో చదవాలనుకున్నాను. చివరకు, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చేశాను. ఏంబీఏ చేయాలనేది నా లక్ష్యం. సినిమాల్లోకి రావడంతో ఫుల్స్టాప్ పడింది. కానీ, ఎప్పటికైనా ఎంబీఏ చేస్తా. -
ఆదోనిలో సైన్స్ ఎక్స్‌ప్రెస్ ప్రదర్శన ప్రారంభం
కర్నూలు జిలా ఆదోని రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సైన్స్ ఎగ్జిబిషన్ రైలును డీఆర్ఎం గోపీనాథ్ మాల్యా బుధవారం ఉదయం ప్రారంభించారు. వాతావరణంలో వచ్చే మార్పులు, వాటి కారణంగా విపత్తులు, ఇతర పరిణామాల గురించి విద్యార్థులకు ఈ రైలు ద్వారా తెలియజేయనున్నారు. 13 ఏసీ బోగీలలో చిత్రాల రూపంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి ఈ సైన్స్ ఎక్స్‌ప్రెస్‌ను చూసేందుకు విద్యార్థులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యా శాఖాధికారి శ్రీరాములు కూడా పాల్గొన్నారు. -
అసక్తి రేపుతున్న సైన్స్ ఎగ్జిబిషన్
-
కనుల పండువగా వైజాగ్ ఫెస్ట్
-
వైజ్ఞానిక ప్రదర్శన అదుర్స్..
-
పిల్లలకు సంస్కృతీ సంప్రదాయాలు నేర్పాలి
తిరుపతి : ప్రాథమిక విద్యా స్థాయి నుంచే పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలు నేర్పాలని ఎస్వీయూ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.కృష్ణారెడ్డి అన్నారు. తిరుపతిలోని కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటైన క్లస్టర్ లెవెల్ సోషియల్ సైన్స్ ఎగ్జిబిషన్, జాతీయ సమైక్యతా శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యావ్యవస్థలో మార్పులు అవసరమన్నారు. మార్కులు, ర్యాంకులు లక్ష్యంగా సాగుతున్న విద్యార్థులకు దేశం గురించి ఆలోచించే తీరిక లేకుండా పోతోందన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని, సంస్కృతి సంప్రదాయాలను నేర్పడానికి కేంద్రీయ విద్యాలయాలు కృషి చేయడం అభినందనీయమన్నారు. సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎగ్జిబిషన్లో భాగంగా తెలుగు, హిందీ, ఇంగ్లిషు భాషల్లో వ్యాసరచన, వక్తృత్వ, సంప్రదాయ నృత్యం, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్లస్టర్ లెవెల్ పోటీల్లో విజేతలు డిసెంబర్ 28, 29 తేదీల్లో హైదరాబాద్ బేగంపేటలో జరిగే రీజనల్ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. తిరుపతి కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు 2014 సెంట్రల్ సీనియర్ సెకండరీ, సెంట్రల్ సెకండరీ సర్టిఫికెట్ పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించారన్నారు. అనంతరం తిరుపతి, వెంకటగిరి, ఒంగోలు, సూర్యలంక, గుంటూరు, నెల్లూరు కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులు తయారు చేసిన ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే నమూనాల ఎగ్జిబిషన్‌ను కృష్ణారెడ్డి ప్రారంభించారు. ప్రదర్శనలో స్వాతంత్య్ర సమరంలో పాలుపంచుకున్న ధీర వనితల చిత్రపటాలు, స్మార్ట్‌సిటీ నమూనాలు, ఈజిప్టు దేశానికి చెందిన పిరమిడ్లు, పగోడాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధిచిన నమూనాలు చోటు చేసుకున్నాయి. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో భాగం గా విద్యాలయం విద్యార్థినులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
ఏవీ..ఆ కాంతులు
ఆతిథ్యమిచ్చినా.. ఒక్కటే మిగిలింది! విజ్ఞాన ప్రదర్శనలో తుస్సుమన్న జిల్లా ఇన్స్పైర్ చేయలేని విద్యాశాఖ ఆ ఒక్క రోజు హడావుడే ముంచిందా? పథకం : విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంచాలి. వారిలో దాగివున్న సృజనాత్మకతను, విజ్ఞానాన్ని వెలికి తీయాలి. సైన్స్ పురోభివృద్ధి వైపు ముందడుగు వేసేలా పోత్సహించాలి. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ఇన్స్పైర్ అవార్డుల్ని ప్రవేశపెట్టింది. నిధులు : ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తోంది. ప్రతి పాఠశాలలో ఒకరిని, ఉన్నత పాఠశాలలయితే ఇద్దరిని ఎంపిక చేస్తారు. ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం వారెంట్(ప్రోత్సాహకం) అందిస్తుంది. ఫలితం : విద్యార్థుల్ని బాల శాస్త్రవేత్తలుగా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు వెచ్చిస్తున్నా ఫలితం మాత్రం అంతంతే. ఇటీవల విశాఖ ఎస్ఎఫ్ఎస్ వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనలో జిల్లా నమూనాలు తీవ్ర నిరాశ పరిచాయి. ఒకే ఒక నమూనా జాతీయ పోటీలకు ఎంపిక కావడ మే ఇందుకు నిదర్శనం. సాక్షి, విశాఖపట్నం : ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన జిల్లా స్థాయిలో 2011లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు ప్రదర్శనలు జరిగాయి. 2011లో నాలుగు నమూనాలు, 2012లో ఆరు నమూనాలు జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. 2012లో దక్షిణ భారత్ స్థాయిలో జతిన్వర్మ అనే విద్యార్థి రూపొందించిన రోబో ఎంపికయింది. 2013లో జిల్లాకు చెందిన 16 నమూనాలు అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు వెళ్లాయి. అందులో నాలుగు(గబ్బాడ-నర్సీపట్నం, బూరుగుపాలెం-మాకవరపాలెం, దిమిలి-రాంబిల్లి, చీడిగుమ్మల-గొలుగొండ జెడ్పీ హైస్కూళ్ల) ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. అయితే అదే సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఏ ఒక్క నమూనా కూడా జాతీయ స్థాయికి పంపలేకపోయారు. తాజాగా ఈ నెల 20, 21, 22 తేదీల్లో రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ ప్రదర్శనకు విశాఖ ఆతిథ్యమిచ్చింది. ఇందులో శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు 506 నమూనాలు ఎంపికగా అందులో 456 రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు వచ్చాయి. జిల్లా నుంచి కేవలం 12 నమూనాలు మాత్రమే ప్రదర్శనకు నోచుకోగా అందులో ఒక్కటే(తిమ్మరాజుపేట-మునగపాక) జాతీయ స్థాయికి ఎంపికయింది. ఎందుకిలా..! రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా తొలి విడత తిరుపతిలో ఏడు జిల్లాలకు చెందిన నమూనాలు, రెండో విడతగా విశాఖలో ఆరు జిల్లాలకు చెందిన నమూనాలు ప్రదర్శనకు ఉంచారు. ఇందులో జిల్లా నుంచి 12 నమూనాలు మాత్రమే ప్రదర్శనకు నోచుకోవడం వెనుక పాఠశాల స్థాయి నుంచి జిల్లా విద్యాశాఖ వరకు తిలాపాపం తలా పిడికెడు పంచుకున్నారన్న ఆక్షేపణలున్నాయి. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు 1300కు పైగా వారెంట్ల కోసం దరఖాస్తులు గతేడాది జిల్లా విద్యాశాఖకు వచ్చాయి. అయితే విద్యాశాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ జాబితాను ఎస్సీఈఆర్టీకి పంపడంలో జాప్యం చేశారు. దీంతో కేవలం 199 స్కూళ్లకు మాత్రమే వారెంట్లు వచ్చాయి. అందులో కూడా అత్యధిక భాగం గ్రామీణ ప్రాంతాలకు చెందిన స్కూళ్లే కావడం గమనార్హం. ఆ ‘ఒక్క రోజే’ ముంచిందా? మరోవైపు జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యాశాఖామాత్యుల వైఖరి కూడా ఈసారి ఇన్స్పైర్ ప్రదర్శనలో జిల్లా చతికిలపడటానికి కారణమన్న ఆక్షేపణలున్నాయి. ఈ ఏడాది జిల్లా స్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్‌ను జూలై 31న ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతకు ఒక్క రోజు ముందే మంత్రిగారి ఉత్తర్వులతో హడావుడిగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దీంతో ఎవరూ పూర్తి స్థాయిలో నమూనాలను తయారు చేసుకోలేకపోయారు. సులభంగా పూర్తయ్యే/రెడీమేడ్ నమూనాలనే ప్రదర్శనకు తీసుకొచ్చారు. 199 అంశాల్లో 163 మంది మాత్రమే ప్రదర్శనకు వచ్చారు. దీంతో వీటి నుంచే 12 నమూనాలను రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేయాల్సి వచ్చింది. నిబంధనల మేరకు వీటినే రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో ఉంచారు. దీంతో మిగిలిన జిల్లాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుల ముందు విశాఖ విద్యార్థుల నమూనాలు తేలిపోయాయి. -
నగరంలో విద్యార్థుల సందడి
-
వీఐటీలో ఎగ్జిబిషన్ ప్రారంభం
వేలూరు, న్యూస్‌లైన్: వీఐటీ యూనివర్సిటీలో సౌత్ రాష్ట్రాలకు చెందిన మూడవ సంవత్సరం సైన్స్ ఎగ్జిబిషన్‌ను వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు తయారు చేసిన వివిధ పరిశోధనలను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల నుంచే పరిశోధనలు తయారు చేయడానికి సిద్ధం కావాలన్నారు. పాఠశాల స్థాయిలో పరిశోధ నలకు అవసరమైన అన్ని వసతులున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం హైదరాబాద్ జన్సన్ ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థులు సూట్‌కేసులోనే బుల్లెట్ తయారు చేసి ఈ ఎగ్జిబిషన్లో ఉంచారు. ఈ పరిశోధన పలువురిని ఆకట్టుకుంది. అలాగే చెన్నై కీల్పాక్కంకు చెందిన పాఠశాల విద్యార్థులు బ్యాటరీతో నడిచే మినీవిమానం, రాణిపేట మహర్షి పాఠశాల విద్యార్థులు రైలు పట్టాలతో విద్యుత్ తయారు చేయడంపై ఎగ్జిబిషన్లో ఉంచారు. ఐదు రాష్ట్రాలకు చెందిన పాఠశాల విద్యార్థులు వివిధ పరిశోధనలు తయారు చేశారని వీటిని ప్రతినిధులచే పరిశీలించి వీటికి బహుమతులతో పాటు సర్టిఫికెట్లు అందజేస్తామని చాన్స్‌లర్ విశ్వనాథన్ తెలిపారు. ఆయనతోపాటు పరిశీలించిన వారు వీఐటీ వైస్ చాన్స్‌లర్ రాజు, ఉపాధ్యక్షులు శంకర్, శేఖర్, జీవీ సెల్వం, ప్రొఫెసర్ నారాయణన్, వీఐటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు -
విశాఖలో సాంఘీక సంక్షేమ శాఖ విద్యార్ధుల సైన్స్ ఫెయిర్
-
12కొత్త ప్రాజెక్టులును ప్రదర్శించిన విద్యార్ధులు
-
అబ్బురపరిచిన..సంబురం
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: సైన్స్ పండుగ అట్టహాసంగా ప్రారంభమైంది. కొండాపూర్ మండలం గిర్మాపూర్‌లోని ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల రాష్ట్ర స్థాయి ప్రేరణ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు వేదికైంది. శనివారం ప్రారంభమైన ఈ ప్రదర్శన మూడు రోజులపాటు జరగనుంది. ఇందుకోసం తెలంగాణలోని పది జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు 550 మంది విద్యార్థులు తమ నమూనాలను ప్రదర్శనకు ఉంచారు. ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి సైన్స్ పండుగను ప్రారంభించారు. కలెక్టర్ దినకర్‌బాబు, ఎమ్మెల్సీ సుధాకర్, ఎన్సీఆర్టీ డెరైక్టర్ గోపాల్‌రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థుల ఎగ్జిబిట్లు అతిథులను, సందర్శకులను అబ్బురపరిచాయి. ఎగ్జిబిషన్ ప్రాంగణం విద్యార్థులతో కోలాహలంగా మారింది. వినూత్న ప్రదర్శనలు అతిథులను, సందర్శకులను అబ్బురపరిచాయి. వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కొండాపూర్ మండలం తొగర్పల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థి మాధురి ఆంగ్లంలో ప్రసంగించి అందరి ప్రశంసలు పొందింది. సంగారెడ్డి మండలం చెర్యాలకు చెందిన విద్యార్థులు ఆహూతులకు స్వాగతం పలుకుతూ, గణపతిని ప్రార్థిస్తూ ప్రదర్శించిన నృత్యరూపకం.. పాఠశాలకు చెందిన విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ, చెట్ల పరిరక్షణను వివరిస్తూ ప్రదర్శించిన సందేశాత్మక నృత్యరూపకం ఆహుతులు, విద్యార్థులు, ఉపాధ్యాయులను విశేషంగా ఆకట్టుకుంది. వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాటలు, మిమిక్రీ విద్యార్థులను ఉత్సాహపరిచింది. కార్యక్రమం ఆలస్యంతో ఇబ్బందులు ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన సైన్స్‌ఫెయిర్ మధ్యాహ్నం12.30గంటలకు ప్రారంభమైంది. దీంతో విద్యార్థులు ఇబ్బం దు లు పడాల్సి వచ్చింది. ముఖ్యఅతిథులు ప్రసంగాలను ప్రారంభించే సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒక్కొక్కరుగా సభా స్థలం నుంచి భోజనానికి వెళ్లటం ఆరంభించారు. దీంతో ప్రసంగాలు సాగే సమయంలో విద్యార్థుల హాజరు పలుచగా కనిపించడంతో అతి థులు తమ ప్రసంగ సమయాన్ని కుదించుకోవాల్సి వచ్చింది. భోజన, బస సౌకర్యాలు సరిగ్గా లేవని కొంత మంది విద్యార్థులు తెలిపారు. -
వైజ్ఞానిక ప్రదర్శనకు 91 మంది దూరం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో ఇటీవల మూడు దశల్లో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన(ప్రేరణ)లు మొక్కుబడిగా సాగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ఉపాధ్యాయుల చేతివాటంతో అనుకున్న స్థాయిలో విద్యార్థులు పాల్గొనలేదు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి భావి శాస్త్రవేత్తలుగా తయారు చేసేందుకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం ప్రేరణ(ఇన్స్పైర్) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మూడేళ్లుగా అమలవుతున్న ఈ కార్యక్రమం ద్వారా జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని గత యేడాది జాతీయస్థాయిలో కూడా అవార్డు సాధించింది. ఓ వైపు విద్యార్థులు సృజనాత్మకత చాటుతున్నా, మరోవైపు ఉపాధ్యాయుల నిర్లిప్తత, చేతివాటం పథకం అమలుకు తీవ్ర అడ్డంకిగా మారాయి. ప్రేరణ కార్యక్రమంలో భాగంగా ఈ యేడాది జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే 1,276 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.5 వేలు విలువ చేసే వారెంట్లు(చెక్కులు) జారీ చేశారు. స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో వారెంట్లను నగదుగా మార్చుకునే వీలు కల్పిస్తూ వారెంట్లు అందజేశారు. అయితే విద్యార్థుల పేరిట జారీ అయిన వారెంట్లను ప్రధానోపాధ్యాయులే వెళ్లి నగదుగా మార్చారు. జిల్లాలో విద్యార్థులకు జారీ చేసిన వారెంట్ల విలువ రూ.63.80 లక్షలు. ఇటీవల మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట డివిజన్ కేంద్రాల్లో జిల్లా వైజ్ఞానిక సదస్సులు నిర్వహించారు. మొత్తం 1,276 మంది విద్యార్థులు తమ నమూనాలతో హాజరు కావాల్సి వుండగా, 1,181 మంది మాత్రమే వైజ్ఞానిక ప్రదర్శనకు హాజరయ్యారు. 91 మంది గైర్హాజరయ్యారు. దీంతో రూ.4.55 లక్షలు విలువ చేసే వారెంట్లను నగదుగా మార్చుకున్నా, నమూనాలు మాత్రం ప్రదర్శించలేదు. ఒక్కో విద్యార్థికి ఇచ్చే నగదులో రూ.2,500 నమూనా తయారీకి, మరో రూ.2,500 ప్రయాణ భత్యాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రదర్శనలో పెట్టిన నమూనాల్లో 10 శాతం రెడీమేడ్ నమూనాలు వున్నట్లు అధికారులు చెప్తున్నారు. మరో 30 నుంచి 40 శాతం మేర మొక్కుబడి నమూనాలు ఉన్నట్లు సమాచారం. గత యేడాది కూడా ఇన్స్పైర్ ఎగ్జిబిషన్‌కు దూరం గా ఉన్న 56 పాఠశాలల నుంచి నేటికీ నిధులు రికవరీ చేయలేదు. నోటీసులు జారీ చేస్తాం: డీఈఓ రమేశ్ ఇన్స్పైర్ ప్రదర్శనకు గైర్హాజరైన పాఠశాలలు, ఉపాధ్యాయుల నుంచి వివరణ కోరుతూ ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు డీఈఓ రమేశ్ ‘సాక్షి’కి వెల్లడించారు. త్వరలో తుది నోటీసు పంపి నిధులు రికవరీ చేస్తామని తెలిపారు. సంజాయిషీ ఇవ్వని ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు చేపడతామన్నారు. ఈ యేడాది జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు 89 నమూనాలు ఎంపిక కాగా, ఇందులో 75 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రూపొందించినవే ఉన్నట్లు రమేశ్ వెల్లడించారు. -
సైన్సపై ఆసక్తి పెంచుకోవాలి
హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : విద్యార్థులు సైన్సపై అవగాహన పెంచుకోవాలని కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ అన్నారు. హంటర్‌రోడ్‌లోని త్రివి హైస్కూల్లో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను శనివారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. మూడువందల మంది విద్యార్థులు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శన లో ఉంచారు. కార్యక్రమంలో అతిథులు తొలుత సీవీరామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం విద్యార్థులు వందేమాతర గీతం ఆలపించారు. విద్యార్థులు మృదుల, సౌమ్య నృత్యంతో అతిథులకు స్వాగతం పలికారు. అనంతరం అబ్దుల్ కలాం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి కేంద్రమంత్రి బలరాం నాయక్ ముఖ్య అతిథిగా, కలెక్టర్ కిషన్ విశిష్ట అతిథిగా, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ సభాధ్యక్షుడిగా వ్యవహరించారు. డిప్యూటీ డీఈఓ వాసంతి స్వాగత ఉపన్యాసం చేశారు. కేంద్రమంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ.. గురువులపైనే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల్లో భారత మేధావులే శాస్త్రవేత్తలుగా సేవలందిస్తారని అంబేద్కర్ ఆనాడే బ్రిటిష్ పాలకులతో అన్నారని గుర్తుచేశారు. విద్యార్థులకు క్రమశిక్షణతోపాటు సైన్స్‌పై ఆసక్తి కలిగేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆ ఘనత మనదే : కలెక్టర్ శశిరథుడు అనే మహర్షి నాలుగో శతాబ్దంలోనే కంటి ఆపరేషన్ చేశాడని, ఆ ఘనత మనదేనని కలెక్టర్ జి.కిషన్ అన్నారు. అంకెల్లో సున్న కనుగొన్న ఆర్యభట్ట మన భారతీయుడేనన్నారు. మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలలో జరిగే మార్పులను గమనించడమే సైన్స్ అన్నారు. హేతువాదంతో ఆలోచిస్తే ప్రతీదీ సైన్సేన న్నారు. ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. దేశప్రగతి సైన్స్‌పైనే ఆధారపడి ఉందన్నారు. రూ.మూడు కోట్లతో రీజినల్ సైన్స్ సెంటర్ : డీఈఓ రీజనల్ సైన్స్ సెంటర్ ఏర్పాటుకు రూ.మూడుకోట్లు విడుదలయ్యాయని డీఈఓ విజయ్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే మొబైల్ సైన్స్ సెంటర్‌తో విద్యార్థులకు వివిధ విషయాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ఇన్స్పైర్ కార్యక్రమాలు చేపట్టడం ఇది మూడోసారన్నారు. ఎగ్జిబిట్లను ప్రదర్శించే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం రూ.ఐదువేలు అందిస్తోందని, అందులో రూ.2500 ఎగ్జిబిట్ తయారీకి కాగా, మిగతాది విద్యార్థి ప్రయాణ, ఇతర ఖర్చులకు వెచ్చిస్తున్నామని వివరించారు. గతంలో ఢిల్లీలో నిర్వహించిన ఇన్స్పైర్ కార్యక్రమానికి జిల్లా విద్యార్థులను పంపించామని తెలిపారు. కార్యక్రమంలో చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. నిట్ ప్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి, వడుప్సా జిల్లా అధ్యక్షుడు భూపాల్‌రావు, జిల్లా సైన్స్ అధికారి సీహెచ్ కేశవరావు, త్రివి స్కూల్ కరస్పాండెంట్ లింగారెడ్డి, డీసీబీ కార్యదర్శి దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.