
ఆ రోజు టీచర్స్ కంగారు పడ్డారు! - కాజల్
టీచర్స్ డే స్పెషల్
చదువంటే ఇష్టమే కానీ బాగా అల్లరిపిల్లని. ఓసారి స్కూల్‌లో అందరితో కలసి ఓ సైన్స్ ఎగ్జిబిషన్‌కి వెళ్లాను. బోర్ కొట్టడంతో మధ్యలోనే ఇంటికి వచ్చేశా. నేను తప్పిపోయాననుకుని టీచర్లు కంగారుపడ్డారు. అమ్మతో చెప్పాలని మా ఇంటికి వచ్చారు. నేను తీరిగ్గా టీవీ చూస్తున్నాను. దాంతో చిన్న చిన్నగా చివాట్లు పెట్టారు.
ఇప్పటికీ ఆ సంఘటన తలచుకుంటే బాగా నవ్వొస్తుంది. ఏదో చిన్నప్పుడు తెలియక అలా చేశా కానీ, టీచర్స్ అంటే గౌరవం లేక కాదు. ఆచార్య దేవోభవ అని ఊరికే అనరు. నిజమే.. మనకు విద్యా బుద్ధులు నేర్పించే టీచర్లు దేవుడితో సమానమే. చిన్నప్పుడు ఏవేవో చదవాలనుకున్నాను. చివరకు, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చేశాను. ఏంబీఏ చేయాలనేది నా లక్ష్యం. సినిమాల్లోకి రావడంతో ఫుల్‌స్టాప్ పడింది. కానీ, ఎప్పటికైనా ఎంబీఏ చేస్తా.