teachers day special
-
పేదరికపు కష్టాల మధ్య.. విద్యార్థి నుంచి రాష్ట్రపతిగా.. సర్వేపల్లి ప్రస్థానం
పేదరికపు కష్టాల మధ్య,అవమానాల సుడిగుండాల నడుమ చదువుకోడానికి ఆయన ఎంత కష్టపడ్డారో ఆయనకే తెలుసు.ఉత్తమ విద్యార్థి దశ నుంచి ఉన్నత విద్యావంతుడుగా ఎదిగాడు,ఉన్నత విద్యావంతుడి స్థాయి నుంచి ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచారు.ఆ అజేయప్రస్థానం అంతటితో ఆగలేదు.అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి చేర్చింది. మహోన్నతమైన 'భారతరత్న' పురస్కారాన్ని అందించింది. సర్వోత్తమమైన 'భారతరత్న' సత్కారాన్ని ప్రకటించిన తొలినాళ్ళల్లోనే (1954) సాధించేలా చేసింది.సర్వేపల్లి రాధాకృష్ణ మన తెలుగువాడు,మన భారతీయుడు.ఆయన జన్మదినం 'జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం'. దేశంలో ఎందరో ఉన్నత విద్యావంతులు,ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు. వారెవ్వరికీ దక్కని విశిష్ట గౌరవాన్ని పొందిన భాగ్యశాలి. జ్ఞానమే తన ఐశ్వర్యం, ధైర్యమే తన దీపం, క్రమశిక్షణే తన మార్గం,పట్టుదలే తన సోపానం.రాధాకృష్ణ విజయగాథ సర్వ మానవాళికి సర్వజ్ఞాన ప్రబోధ.ప్రపంచంలోని అగ్రశ్రేణి తత్త్వశాస్త్ర ఆచార్యులలో ఆయన తొలివరుసలోని వారు. చదువు,అనుభవం రెండూ తన తోడునీడలు.జీవిత తత్త్వాన్ని, జీవన సారాన్ని,సారాంశాన్ని మధించుకుంటూ వెళ్లారు. పసిడికి తావి అబ్బినట్లు, తనను వరించి వచ్చిన ప్రతి పదవిలో,తనను తాను మరింతగా తీర్చిదిద్దుకున్నారు. జీవన సమరం బాగా ఎరిగినవాడు కనుక,తను గడించిన అనుభవాన్ని,పొందిన తాత్త్విక సారాన్ని దేశానికి అన్వయం చేసుకుంటూ అంకితమయ్యారు.అందుకే,ప్రతి క్లిష్ట సమయంలో దేశానికి అండగా నిలిచారు. క్లిష్ట సమయంలో దేశానికి అండగా.. చైనా,పాకిస్తాన్ తో భారత్ యుద్ధం చేయాల్సిన అత్యంత క్లిష్టమైన సమయాల్లో,ప్రధాన మంత్రులకు అత్యద్భుతంగా మార్గనిర్దేశం చేశారు.ప్రపంచ తత్వశాస్త్ర సిద్ధాంతాలన్నింటినీ ఆపోసన పట్టారు.భారతీయతను ఆణువణువునా నిలుపుకొన్నారు.బోధనలో,పరిపాలనలో ఆ అమృతకలశాలను పంచిపెట్టారు.ఎంత గొప్పగా మాట్లాడుతారో,అంత శ్రద్ధగా వింటారు. ఎంత బాగా రాస్తారో, అంత బాగా చదువుతారు.అందుకే ఆయనకు పాఠకుడి హృదయం,ప్రేక్షకుడి నాడి రెండూ తెలుసు. సర్వేపల్లివారి రచనలు,ఉపన్యాసాలు పరమ ఆకర్షణా శోభితాలు. యూనివర్సిటీలో క్లాస్‌లో 24నిముషాలసేపు మాత్రమే గంభీరంగా పాఠం చెప్పేవారు. అది ముగిసిన వెంటనే,సరదా కబుర్లు,ఛలోక్తులు విసిరి, విద్యార్థులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేవారు.24 నిముషాలకు మించి,ఏ విషయాన్నీమెదడు ఆసక్తిగా లోపలికి తీసుకోలేదని ఆయన సిద్ధాంతం. కేవలం 21 ఏళ్లకే... మానవ జీవ రసాయన చర్యలు,విద్యా మనస్తత్వశాస్త్రం (ఎడ్యుకేషనల్ సైకాలజీ) కూడా మధించినవాడు కాబట్టే,సర్వోన్నత ఉపాధ్యాయుడుగా ఖ్యాతి గడించారు.సర్వజన రంజిక ఉపన్యాసకుడిగా గొప్ప కీర్తినిఐశ్వర్యంగా పొందారు.ఆయన రాసిన'భారతీయ తత్త్వశాస్త్రం'ప్రపంచ పండితులకునిత్య పఠనీయ గ్రంథమైంది. ఈ సహజ ప్రతిభా భాస్వంతుడికి సాధన మరింత ప్రభను, ప్రభుత్వాన్ని చేకూర్చింది. కేవలం 21సంవత్సరాల వయస్సులోనే ఆచార్య పదవిని దక్కించుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్,అశుతోష్ ముఖర్జీ వంటి దిగ్దంతులు కలకత్తా విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పమని స్వాగతించారు. మన ఆంధ్రవిశ్వవిద్యాలయానికి ద్వితీయ వైస్ ఛాన్సలర్‌గా అలంకరించిన అద్వితీయుడు సర్వేపల్లి .హిరేన్ ముఖర్జీ,హుమయూన్ కబీర్ వంటి మేధాగ్రణులను ఆహ్వానించి, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పించారు. Rare Footage of our former President of India and World's renowned #philosopher Sarvepalli Radhakrishnan, when he visited Britain in 1963 ! A must watch ! Courtesy BFI & via Social Media #SarvepalliRadhakrishnan #TeachersDay pic.twitter.com/ZdB6GvZmjr — Sonmoni Borah IAS (@sonmonib5) September 6, 2020 ఆయన చదువంతా స్కాలర్ షిప్స్ మీదే.. మేధావుల విలువ తెలిసిన మేధాగ్రణి.దేశ,విదేశాలలోని అన్ని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో ఆయన అసంఖ్యాకంగా ప్రసంగాలు చేసి అందరినీ అలరించారు. భారతీయ విద్యా విధానంలో ఉన్నతమైన సంస్కరణలు జరగాలని కలలుకన్న తొలితరం మేధావి.జవహర్ లాల్ నెహ్రు ప్రభుత్వం నియమించిన ఆ కమిటీకి తొలి అధ్యక్షుడు కూడా ఆయనే. ఆయన చదువంతా స్కాలర్ షిప్స్ మీదే సాగింది. విద్యార్థి దశలో కటిక పేదరికాన్ని అనుభవించారు. భోజనం చేయడానికి అరిటాకు కూడా కొనలేక,నేలను శుభ్రం చేసుకొని,భోజనం చేసిన సందర్భాలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఈ ఉదంతం వింటే?హృదయం ద్రవించినా,జీవితాన్ని ఆయన పండించుకున్న తీరు ఆనందభాష్పాలు కురిపిస్తుంది,మెదడును కదిలిస్తుంది,గుండెను మరింత దృఢంగా మారుస్తుంది,కర్తవ్యం వైపు నడిపిస్తుంది.పేదవాడికికొండంత స్ఫూర్తిని అందిస్తుంది.డబ్బు విలువ,దేశం విలువ తెలిసినవాడు కనుక,రాష్ట్రపతి హోదాలో తనకు వచ్చే వేతనంలో కేవలం 25శాతం మాత్రమే తీసుకొని,మిగిలినది ప్రధానమంత్రి సహాయనిధికి తిరిగి ఇచ్చేవారు. "చదువది ఎంత కలిగిన..రసజ్ఞత ఇంచుక చాలకున్న..ఆ చదువు నిరర్ధకంబు...'' అన్నట్లు,జీవితాన్ని తెలుసుకోడానికి ఉపయోగపడని ఏ శాస్త్రమైనా నిరర్ధకమని ఆయన అభిప్రాయం.జీవితాన్ని అర్ధం చేసుకోడానికి తత్త్వం ఒక మార్గమన్నది ఆయన బోధన.వివేకం,తర్కం ఇమిడివున్న భారతీయ తాత్త్విక చింతనప్రపంచ తత్త్వశాస్త్రాలకే తలమానికమని చాటిచెప్పిన సర్వోన్నత ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణ. -మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఓ పండుగ : మంచు విష్ణు
‘‘ఉపాధ్యాయ దినోత్సవం అనేది ముఖ్యమైన పండుగ. ‘శ్రీ’ విద్యానికేతన్ కుటుంబంలో ఉపాధ్యాయ దినోత్సవం అంతర్భాగం’’ అని హీరో మంచు విష్ణు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో పలువురు గురువులను, కోవిడ్ సమయంలో సాయమందించిన సినీ కళాకారులను మంచు విష్ణు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఉపాధ్యాయులకు శాశ్వత గౌరవ సూచకంగా, విద్యారంగంలోని వారి సేవలకు గుర్తింపుగా శ్రీ విద్యానికేతన్ ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో వారిని సత్కరించే గొప్ప సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. కోవిడ్ మహమ్మారి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అనేక మంది జీవితాలను కుదిపేసింది. మంచి హృదయం కలిగిన సినీ ప్రముఖులు, కళాకారులు చాలామందికి నగదు, నిత్యావసర వస్తువుల రూపంలో సహాయం అందించారు. పవిత్రమైన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రామ సత్యనారాయణ, నటులు నరేశ్, పృథ్వీ, శివ బాలాజీ, గౌతమ్ రాజు, నటి మధుమిత తదితరులు పాల్గొన్నారు. చదవండి : హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ శంకర్ కూతురు Bigg Boss 5 Telugu: బుల్లితెర హంగామా మొదలైంది -
సూపర్ స్టార్ కృష్ణతో చిన్ననాటి ఫోటో షేర్ చేసిన మహేశ్
Mahesh Babu Childhood Image With Krishna: సెప్టెంబర్5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు తమ జీవితంలో కీలక పాత్ర పోషించిన గురువులను గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు తన మొదటి గురువు, తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి దిగిన చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ.. 'ప్రేమ, ఆప్యాయతలు దయాగుణం, క్రమశిక్షణ, వినయం, పరిస్థితుల్లో బలంగా ఉండటం వంటి ఎన్నో మంచి విషయాలు నేర్పించిన నాన్నకి ధన్యవాదాలు. ఆయనతో పాటు ఈ ప్రయాణంలో నా అభివృద్ధికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. హ్యాపీ టీచర్స్ డే' అంటూ మహేశ్ ట్వీట్ చేశారు. Here's to the love of learning and growing each day! Thanking my father who taught me to love, to be strong, to have discipline, compassion and humility. Will always be indebted to him and to everyone who's helped me learn and evolve in my journey. #TeachersDay pic.twitter.com/xZTSiGpsYk — Mahesh Babu (@urstrulyMahesh) September 5, 2021 ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేశ్ పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తొలిసారి కీర్తి సురేశ్ మహేశ్‌తో జత కట్టనుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకాల రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. చదవండి : 'గీతాంజలి' హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఆ నమ్మకంతోనే బతికేస్తున్నా..సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్ -
టీచర్స్ డే స్పెషల్ : 'రామాచార్య' గురించి శిష్యుల సరదా ముచ్చట్లు
గాయకుడిగా, మ్యూజిక్ కంపోజర్‌గా ఎందరో ఎందరో గాయనీగాయకులను తీర్చిదిద్దారు రామాచారి. టీచర్స్ డే సందర్భంగా శిష్యుల గురించి ఆయన చెప్పిన విశేషాలు, గురువుతో అనుబంధం గురించి శిష్యులు చెప్పిన సరదా ముచ్చట్లు 'రామాచార్య' ఇంటర్వ్యూలో చూసేయండి.. -
సాక్షితో సిరివెన్నెల చివరి ఇంటర్వ్యూ: ‘ఆ సమయంలో క్రిష్ మీద అలిగాను’
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సిరివెన్నల సీతారామశాస్త్రి, క్రిష్‌లను సాక్షి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది.. ఆ వివరాలు.. క్రిష్: ‘వీడు పెద్ద దర్శకుడు కాబోతున్నాడు’ అని నా మొదటి సినిమా రిలీజ్ కాకముందే సిరివెన్నెలగారు చెప్పినప్పుడు అందరూ అతిశయోక్తి అనుకున్నారు. నేను ఎవరో తెలియనప్పుడు, నేను ‘గమ్యం’ కథ రాసుకుని వెళ్లినప్పుడు ఆయన విని, కొన్ని సలహాలు ఇచ్చారు.. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఆయనతో పని చేసిన ప్రతిరోజూ ఓ అందమైన జ్ఞాపకం. సిరివెన్నెల: ఒక్క ముక్కలో చెప్పాలంటే అది అతని (క్రిష్) సంస్కారం. రెండో ముక్కలో చెప్పాలంటే మన సంప్రదాయంలో గురు శిష్యుల బంధం గురించి శాంతి మంత్రం ఉంది. గురుశిష్యుల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. నా సిద్ధాంతం ప్రకారం శిష్యుణ్ణి గురువు తయారు చేయడు.. గురువును శిష్యుడు తయారు చేస్తాడు. వయసును బట్టి పుత్ర వాత్సల్యం ఉంటుంది.. బాధ్యతను బట్టి గురుపీఠం ఉంటుంది. తల్లీతండ్రి, ఉపాధ్యాయులతో ఉండే అనుబంధం రుణబంధం. దాన్ని గుర్తుంచుకోవడం శిష్యుడి సంస్కారం. అలాంటి ప్రతి శిష్యుడు గురువు అవుతాడు. సిరివెన్నెల: క్రిష్ నా వద్దకు వచ్చి ‘గమ్యం’ కథ చెప్పినప్పుడు ‘ఈ సినిమాకి పాటలు రాసేంత అవకాశం.. వ్యవదానం నాకు కనిపించడం లేదబ్బాయ్’ అన్నాను. ‘ప్రవచనాలకు సినిమా అనేది వేదిక కాదు.. నా అభిప్రాయాన్ని నువ్వు అంగీకరిస్తే నేను ఓ విషయం చెబుతాను అన్నాను. తను చెప్పమనగానే.. ఇంత లోతైనటువంటి ప్రవచనాన్ని ప్రేక్షకులు తీసుకోలేరు.. ఒక వినోదంతో కలిగిన సందేశం ఉంటే బాగుంటుంది.. హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అంటున్నావు.. మిత్ర సమేతం కూడా ఉంటే బాగుంటుంది. లాజిక్కులు అడక్కు.. నువ్వు చేస్తే చెయ్.. లేకుంటే లేదు’ అన్నాను. ‘మీరు ఒక్కరు కన్విన్స్ అయితే చాలు.. అందుకు నేను ఏం చేయాలో చెప్పండి’ అన్నారు క్రిష్. నా ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పుమన్నాను.. నేను పూర్తిగా కన్విన్స్ అవడానికి చాలా సమయం పడుతుంది.. అప్పటి వరకూ నువ్వు సినిమా వాయిదా వేయాలన్నాను. వేరే ఎవరైనా అయితే ఒప్పుకునేవారు కాదు. కానీ తను ఎనిమిది నెలలు నా కోసం సినిమా వాయిదా వేశాడు. క్రిష్: ‘కృష్ణం వందే జగద్గురమ్’ సినిమాలో గురువుగారు ఓ 14 నిమిషాల పాట రాశారు. ఇప్పుడైతే ఒప్పుకునేవాడినేమో! అప్పుడు నాకు దర్శకుడిగా తెలుగులో మూడో సినిమాయే. ఏదో అపనమ్మకం. నేను సినిమాగా చూస్తూ ఎడిటింగ్ గురించి ఆలోచిస్తున్నాను. గురువుగారేమో పాటగా చూస్తున్నారు. ఓ రెండు మూడు చరణాలు నేను వాడలేదు. అప్పుడు నేను గురువుగారి మాట వినలేదు. అందుకు ఆయన అలిగారు. సిరివెన్నెల: సినిమా అనేది మహాద్భుతమైన వేదిక అని తెలుసుకుని, దానిని వాడుకుంటున్నవారు చాలా తక్కువమంది ఉన్నారు. అలాంటి తక్కువవారిలో క్రిష్ ఒకరు. ఇప్పటివరకు దర్శకులు కె. విశ్వనాథ్‌గారికి, క్రిష్‌కు, మరికొంతమందికి (పేర్లు చెప్పకూడదు) రెండో వెర్షన్ ఇవ్వలేదు... ఇవ్వాల్సిన అవసరం రాలేదు. అంటే వారి ఒప్పుదల, నా శ్రమ ఎక్కడైతే ఏకీభవిస్తాయో అక్కడ ఓకే అన్నమాట. క్రిష్: ‘సిరివెన్నెల’గారు నాకు మొదట గురువుగారే. ఆ తర్వాత తండ్రి అయ్యారు. సిరివెన్నెల: సినిమా నన్ను ఎంటర్టైన్ చేయాలి.. అదే సమయంలో నన్ను నిద్రపుచ్చకుండా కూడా చూడాలి. అలాంటి సినిమాలను తీసే పని క్రిష్ చేస్తాడు. క్రిష్ కథల్లో కొందరు కమర్షియాలిటీ లేదంటుంటారు. ఎక్కువమంది ఒప్పుకుంటే అది కమర్షియాలిటీ అవుతుంది. రామాయణ, మహాభారతాలను మించిన కమర్షియాలిటీ కథలు ఇంకేమీ ఉండవు. క్రిష్: ‘కంచె’ అప్పుడు చాలామంది అభ్యంతరం తెలుపుతూ మాట్లాడారు. రెండో ప్రపంచయుద్ధం కాలం నాటి కథను ఎవరు చూస్తారు? అసలు హిట్లర్‌కు మనకూ సంబంధం ఏంటీ? అన్నది వారి అభిప్రాయం. కానీ మన తెలుగు సైనికులు గ్రామాల నుంచి వేల సంఖ్యలో యుద్ధాలకు వెళ్లిన కథలను ఎవరూ చెప్పలేదు. ‘వేదం’ సినిమాలో రాముల కథ కావొచ్చు.. సరోజ కథ కావొచ్చు. నాదైన శైలి కథలను ప్రేక్షకులకు చూపిస్తూ సంతృప్తి చెందుతాను. సిరివెన్నెల: మనిషి అనే మూడు అక్షరాల పదాన్ని పట్టుకుని నిరంతరం పాకులాడటం అనేది మా ఇద్దరికీ ఉన్న కామన్ పాయింట్. ఒక మనిషిని 360 కోణాల్లో ఏ విధంగానైనా చూడొచ్చు. అలా క్రిష్ ఏ కథ చెప్పినా మనిషి గురించే చెప్పాడు. ఆ విధంగా క్రిష్ వివిధ విధాలుగా ఒకటే సినిమా తీశాడు. నేనూ ఒకటే పాట రాశాను. కాకపోతే వివిధ రకాలుగా... మనిషి గురించి. ఒక సినిమా చూస్తూ వందమంది చప్పట్లు కొడతారు. ఒక్క మనిషి చప్పట్లు కొట్టకుండా ఉంటాడు. చప్పట్లు కొట్టడం కూడా మరిచిపోయేంతలా సినిమాలో లీనం అయితే అది సార్థకి. అలాంటివాడు ఒక్కడైనా చాలు.. అయితే ఆశయంతో.. కాదు పొగరుబోతుతనంతో పని చేస్తున్నాడు. క్రిష్ డైరెక్షన్లో వచ్చిన ప్రతి సినిమా నాకు ఇష్టమే. ‘గమ్యం’ సినిమా ట్రెండ్ సెట్టర్. కానీ ‘కంచె’ ఓ అద్భుతం... మాస్టర్‌పీస్. మా ఇద్దరికీ ప్రపంచమే గురువు. క్రిష్: జీవితంలో మనం పరిపక్వత చెందుతూ ఉంటాం. అలాంటి జీవితంలో ఇలాంటి ఓ గురువు చేయి పట్టుకుని ఉంటే... జీవితం నేర్పించబోయే క్లిష్టతరమైన పాఠాలకు సంసిద్ధులుగా ఉంటాం. -
టీచర్ యామీ
టీచర్స్ డే సందర్భంగా తన తాజా చిత్రాన్ని ప్రకటించారు బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్. తన తదుపరి సినిమాలో టీచర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారామె. బెహ్జాద్ కంబాత్ దర్శకత్వం వహించనున్న ‘ఏ థర్స్డే’ చిత్రంలో యామీ గౌతమ్ లీడ్ రోల్ చేయనున్నారు. ఈ సినిమాలో ప్లే స్కూల్ టీచర్‌గా యామీ కనిపిస్తారట. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ ప్లే స్కూల్లోని 16 మంది చిన్నారులను బంధీగా తన ఆధీనంలో ఉంచుకోవాల్సి వస్తుందట. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది చిత్రకథాంశం. రోనీ స్క్రూవాలా నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. ‘‘ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. అందుకే కథ విన్న వెంటనే ఒప్పేసుకున్నా’’ అన్నారు యామీ. ఇది కాకుండా ‘గిన్నీ వెడ్స్ సన్నీ, భూత్ పోలీస్’ సినిమాల్లో నటిస్తున్నారామె. -
రియల్ హీరోల పాత్రల్లొ రీల్ 'స్టార్స్'
ఈ ప్రపంచంలో గురు శిష్యుల బంధానికి ఎంతో గొప్ప స్థానం ఉంది. కృషి ఉంటే ఏదైనా సాధ్యమనే ధైర్యాన్ని అందించే ఉపాధ్యాయుల పాత్ర ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కీలకం. ఎప్పటికప్పడు మనల్ని మార్గనిర్దేశం చేస్తూ కూలిపోయిన ఆశల సౌదాన్ని సైతం తిరిగి నిర్మించుకోవచన్న భరోసా కల్పిస్తారు. మనలోని శక్తి సామర్థ్యాలను మొదటగా గుర్తించేది కూడా ఉపాధ్యాయులే. సెప్టెంబరు 5 టీచర్స్ డే సందర్భంగా గురువుల పాత్రపై హిందీ చలనచిత్ర పరిశ్రమలో వచ్చిన సినిమాలను ఓసారి గుర్తుచేసుకుందాం. హిన్చి(2018) హిచ్కి పేరుతో తెరకెక్కిన సినిమాలో టీచర్ పాత్రలో రాణి ముఖర్జీ నటన ఆకట్టుకుంటుంది. బలహీనతలనే శక్తిగా ఎలా మార్చుకోవచ్చన్న దానిపై కృషిచేస్తుంది. టోరెట్ సిండ్రోమ్ అనే వ్యాధి(నత్తిలాంటి ఒకరకం లోపం. ఎక్కిళ్లు వచ్చినట్టుగా ఉంటూ, మాటలు మధ్యలోనే ఆగిపోతాయి)తో బాధపడే టీచర్ తమకు పాఠాలు బోధించడాన్ని విద్యార్థులు ఒప్పుకోరు. ఆమెకున్న వ్యాధి కారణంగా అవహేళన చేస్తూ మాట్లాడేవారు. పట్టువదలని ఆమె కేవలం పాఠ్యాంశాలే కాకుండా జీవితానికి ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలతో విద్యార్థులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో రాణి ముఖర్జీ నటన అందరినీ ఆకట్టుకుంది. పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది. తారే జమీన్ పర్ (2007) ఆమీర్‌ఖాన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అద్భుత చిత్రం తారే జమీన్ పర్. ఇషాన్ అవస్తీ అనే స్టూడెంట్ పడుతున్న బాధ, తను చెప్పాలనుకున్న విషయాలను కథలో చక్కగా చూపించారు. ఈ చిత్రంలో ఆర్ట్ టీచర్‌గా నటించిన అమీర్.. ఇషాన్‌లోని టాలెంట్‌ను బయటి ప్రపంచానికి పరిచయం చేసి అతడి జీవితాన్ని మలుపు తిప్పాడు. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులున్నారు. సూపర్ 30 (2019) ఆనంద్ కుమార్ బయోపిక్. టైటిల్ రోల్లో హృతిక్ రోషన్ నటించాడు. పేద విద్యార్థులకు సూపర్ 30 పేరుతో ఐఐటీ కోచింగ్ ఇచ్చే ఆనంద్ కుమార్ ఎందరో విద్యార్థులను తీర్చి దిద్దాడు. డబ్బులేక చదువుకు దూరం కాకూడదనే మంచి దృక్పదంతో ప్రతీ ఏటా ఎంతోమందిని ఐఐటీయన్లుగా మలచి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశాడు. 2019లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. బ్లాక్ (2005) హెలెన్ కెల్లర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం బ్లాక్. అమితాబ్ బచ్చన్, రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను సైతం బద్దలు కొట్టింది. చెవిటి, మూగ అమ్మాయికి తన కలలను నిజం చేస్తూ ఆ అమ్మాయిని ఓ గ్రాడ్యుయేట్ అయ్యేలా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుని పాత్రలో అమితాబ్ ఆకట్టుకుంటాడు. చీకటితో అలుముకున్న ఆ విద్యార్థి జీవితంలో మళ్లీ వెలుగులు నింపి ఆమెకు ఉజ్వల భవిష్యత్తును అందించిన గురువు పాత్రకు అమితాబ్ ప్రాణం పోశారు. -
థ్యాంక్యూ టీచర్
‘నువ్వు బాగా చదువుతున్నావు’ అని వారు చెప్పిన మాట మనల్ని మరింత బాగా చదివేలా చేసి ఉంటుంది. ‘దెబ్బలు పడతాయి... గాడిద’ అని చేసిన మందలింపు దారి తప్పకుండా గాడిలో పెట్టి ఉంటుంది. ఒక టీచర్ చిత్రలేఖనంలోకి పంపి ఉంటాడు. ఒక టీచర్ భుజాన తుపాకీ వేసుకొని సరిహద్దులో రక్షణకు నిలబడేలా చేసి ఉంటాడు. ఒక టీచర్ అంతరిక్షంలో చూపు సారించడానికి అవసరమైన దృష్టి అందించి ఉంటాడు. తల్లిదండ్రులకు మనం మాత్రమే పిల్లలం. టీచర్లకు ప్రతి విద్యార్థి పిల్లవాడే. మనం ఎక్కడికో చేరుకుని ఉంటాం. తదుపరి విద్యార్థి కోసం వారు అక్కడే ఆగిపోయి ఉంటారు. వారికి కావాల్సింది మణులా మాణిక్యాలా? ‘థ్యాంక్యూ టీచర్’ అనే చిన్న మాట. ఒక చేత చాక్‌పీస్, ఒక చేత డస్టర్, మాటిమాటికి సవరించుకునే కళ్లద్దాలు, ఆర్భాటం లేని ఆహార్యం, బల్ల మీద ఊరికే పడేసి ఉంచే బెత్తం, నలభై అయిదు నిమిషాల వాక్ప్రవాహం, ఇల్లు దాటి మొదలెట్టే పసిపాదాల నడకలో మొదట తారసపడే రూపం... పేర్లు వేరు...టీచర్, సార్, మిస్, మేడమ్, ఐవోరు, మేష్టారు... కాని పాఠం ఒకటే. ఆ ప్రబోధం ఒకటే. దర్శనం ఒకటే. ఆ మార్గదర్శనం ఒకటే. ‘మాతృ దేవోభవ పితృ దేవోభవ’ అనడంలో విశేషం లేదు. కన్నందుకు ఎలాగూ ప్రేమ పంచుతారు. కాని ఏ పేగుబంధం లేకుండా వాత్సల్యం పంచుతాడు గురువు. అందుకే అతడు ఆచార్య దేవోభవుడు. ఎంపిక చేసుకుంటారు కొందరు ఇంజనీర్లవుదామనుకుంటారు. కొందరు డాక్టర్లు కావడానికి కష్టపడతారు. కొందరు మాత్రం ‘టీచర్ అవుతాను’ అని పట్టుబడతారు. ఎందుకు అలా పట్టుబడతారు? బహుశా వీళ్లకు పిల్లలు ఇష్టం. అక్షరాలు పంచడం ఇష్టం. ఒక మొక్కకు ఎరువు వేసి, కుదురు బలిష్టంగా అయ్యేలా చూసి, అది మహా వృక్షంగా ఛాయనూ కాయనూ ఇవ్వడాన్ని చూడటం ఇష్టం. ఇంకా చెప్పాలంటే పిల్లల మధ్య పిల్లలుగా ఉండటం ఇష్టం. ‘టీచరుగా ఉండాలి’ అని అనుకోవడం వల్ల వీరు ఈ దేశ భవిష్యత్ నిర్మాణం పట్ల, విలువలున్న సమాజ స్థాపన పట్ల సగం బాధ్యత వహిస్తారు. ఆ బాధ్యత వీరికి ఇష్టం. టీచర్ ఉద్యోగం ఏ బిందువు నుంచి మొదలయ్యి ఏ బిందువున ముగుస్తుందో వీరికి తెలుసు. ఆ ఉద్యోగంలో శ్రీమంతులు అయిపోలేరు. ఆ ఉద్యోగంలో గొప్ప గొప్ప హోదాలు ఊడిపడవు. ఆ ఉద్యోగంలో అడుగులకు మడుగులొత్తే సిబ్బంది ఉండరు. ఆ ఉద్యోగంలో పెద్ద పెద్ద ఆఫీసులు గొప్పగొప్ప నగర జీవనాలు ఉండవు. అయినా సరే వీరు ‘టీచర్ అవుతాను’ అని అనుకుంటారు. వీరు ‘వినేవారు’ కాదు. ‘చెప్పేవారు’. ‘చెప్పేవారి స్థానం’ గొప్పది అని వారికి తెలుసు. తల్లిదండ్రులు సమాజానికి వ్యక్తులను ఇస్తారు. గురువులు పౌరులను ఇస్తారు. ఢిల్లీకి రాజైనా ఢిల్లీకి రాజైనా గురువుకు శిష్యుడే. ప్రధాన మంత్రి అయినా రాష్ట్రపతి అయినా తనకు పాఠాలు చెప్పిన టీచర్ ఎదురు పడితే తల వొంచి నమస్కరించాల్సిందే. ‘ఏవోయ్’ అని ఆ టీచర్ మెచ్చుకోలుగా భుజం చరిస్తే ఉబ్బితబ్బిబ్బవాల్సిందే. ఈ గౌరవం నిలబెట్టుకోవడానికి టీచర్లు ఎప్పుడూ తమ సాంఘిక జీవనాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. పిల్లలకు ఆదర్శప్రాయులుగా ఉండేందుకు తాము ఆదర్శప్రాయమైన జీవితాన్ని సాధన చేస్తారు. సగటు మనిషిలా వీరు బజారులో తిరగలేరు. టీచరు స్కూల్లో కాకుండా వేరే ఎక్కడ కనిపించినా స్టూడెంట్‌కి వింతే. కనుక వీరు అనేక సరదాలను, సంతోషాలను పరిమితం చేసుకుంటారు. తమ సంతానాన్ని మరింత క్రమశిక్షణతో పెంచుతారు. ‘ఫలానా టీచరు కొడుకు ఇలా చేశాడట’ అనే మాట వస్తే ఆ టీచరు ఇక బోధన చేయడానికి నైతిక అర్హత కోల్పోతాడు. ఈ మెడమీద వేళ్లాడే కత్తులన్నింటినీ వారు కంఠం తెగి పడకుండా కాచుకుంటారు. చుక్కాని ఇస్తారు టీచర్లు ఏం చేస్తారు? విద్యార్థుల చేతికి చుక్కాని ఇస్తారు. కొందరిని అన్ని దిక్కులకూ వెళ్లమని చెబుతారు. మరికొందరిని పని గట్టుకుని ఉత్తర దిక్కుకే వెళ్లు అని ఆజ్ఞాపిస్తారు. ‘ప్రశ్న’ అవసరాన్ని చెబుతారు. నిలదీయకపోతే వంకరలు పోవు అని నేర్పిస్తారు. న్యాయం వైపు నిలబడటం సింహాన్ని లొంగదీయడానికి మించిన సాహసం అని నూరిపోస్తారు. నాయకత్వం నేర్పుతారు. నడవడంతో పాటు నడిపించడమూ తెలుపుతారు. పొగడటం ద్వారా ముందుకు నడిచేలా చేస్తారు. తిట్టడం ద్వారా కూడా ముందుకు నడిచేలా చేస్తారు. చేయి దాటిపోయిన పిల్లల మీద తల్లిదండ్రులైనా ఆశ వదులుకుంటారేమో కాని గురువులు వదలుకోరు. తెగిన గాలిపటం ఏదో ఒక స్తంభానికి చిక్కి ఎగిరినా చాలనుకుంటారు. నిత్య విద్యార్థులు పరీక్షలు పూర్తి చేయడంతో, పట్టా పుచ్చుకోవడం తో అందరికీ ‘విద్యార్థి దశ’ ముగుస్తుంది. కాని టీచర్లు నిత్య విద్యార్థులుగా ఉంటారు. అదే స్కూల్లో రిటైర్ అయ్యేంత వరకు చదువుతారు. ఎప్పటి పాఠాలు అప్పుడు చెప్పడానికి చదువుతారు. హోమ్‌వర్క్‌లు ఇవ్వడానికి చదువుతారు. కొత్త సిలబస్ తెలుసుకోవడానికి చదువుతారు. క్లాస్‌లో ఒక తెలివైన కుర్రాడు తయారయ్యి తెలివైన ప్రశ్నలు అడుగుతుంటే గనుక తమ సబ్జెక్ట్‌ను పెంచుకోవడానికి మళ్లీ కొత్తగా చదువుతారు. వీరు చదివే కొద్దీ పిల్లలకు చదువు వస్తుంది. పిల్లలకు చదువు వస్తే దేశానికి చదువు వస్తుంది. దేశాన్ని గౌరవిస్తున్నామంటే ఆ దేశంలో తయారైన క్లాస్‌రూమ్‌ని ఆ క్లాస్‌రూమ్‌కు బాధ్యడైన టీచర్ని గౌరవిస్తున్నట్టు. ఆ టీచర్ నిబద్ధతను గౌరవించినట్టు. ఆ టీచర్ శ్రమను గౌరవించినట్టు. కాని ఆ గౌరవాన్ని ప్రదర్శించడం తక్కువ చేస్తుంటారు. మనకు పాఠాలు చెప్పిన టీచర్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అని నిజంగా ఆలోచించిన సందర్భాలు, వారి కోసం వెతికిన సందర్భాలు ఎన్ని ఉంటాయి? థ్యాంకూ టీచర్ చిన్న గుమాస్తాగా ఉండవచ్చు. పెద్ద ఐ.ఏ.ఎస్ ఆఫీసర్‌గా ఉండొచ్చు. సమాజానికి గొప్ప మేలు చేస్తుండొచ్చు. అసలేమీ చేయకాపోవచ్చు. కాని ఒకరికి హాని చేయకుండా, నష్టపరచకుండా మన కుటుంబాన్ని మనం పోషించుకునే యోగ్యతలో ఉన్నామంటే అందుకు గురువు కదా కారణం. స్కూల్లో ఇరవై మంది టీచర్లు ఉంటే ఒకరు తప్పకుండా మనకు ఇన్స్పిరేషన్గా నిలిచి ఉంటారు. వారిని తలుచుకుందాం ఈ రోజు. వారిని పలకరిద్దాం ఈరోజు. థ్యాంక్యూ టీచర్... థ్యాంక్యూ సార్– అని చెబుదాం ఈ రోజు. థ్యాంక్యూ సార్. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి టీచర్లు బహువిధాలు ► రూపం. ఆహార్యం, కంఠం... ఈ మూడింటితో ఆకట్టుకునేవాళ్లు. ► నవ్విస్తూ పాఠం చెప్పేవాళ్లు. ► తాము నవ్వకుండా పిల్లలు నవ్వేలా చేస్తూ పాఠం చెప్పేవాళ్లు ► ఎక్కువ కబుర్ల మధ్య తక్కువ పాఠం చెప్పేవారు ► జ్ఞానం, పాండిత్యంతో గౌరవం పొందేవారు ► ఆటపాటలతో ఆకట్టుకునేవారు ► సిలబస్ ముందే ముగించేవారు ► సిలబస్ ఎప్పటికీ ముగించని వారు -
మాస్టార్లు వాళ్లే!
తప్పొప్పులు తెలియాలంటే ముందు తప్పేదో ఒప్పేదో తెలియాలి. వెళ్లే దారి సరైందో లేదో తెలియాలంటే గమ్యం మీద అవగాహన ఉండాలి. ఒక సబ్టెక్ట్ను ఇష్టంగా చదువుతున్నామంటే అందులో ఆసక్తి కలిగించే విషయాలుండాలి. లేదా ఆసక్తికరంగా బోధించే గురువు ఉండాలి. మనం సక్రమంగా ఉన్నామంటే దాని వెనక కచ్చితంగా ఓ గురువు ఉంటాడు. సమాజానికి ఉపయోగపడుతున్నాం అంటే దాని వెనక ఓ గొప్ప ఉపాధ్యాయుడుంటాడు. నేడు ఉపాధ్యాయుల దినోత్సవం. మనందర్నీ తీర్చిదిద్దిన గురువులందర్నీ గుర్తు చేసుకుందాం. మేం స్టార్స్ కావచ్చు. కానీ మా–స్టార్లు వాళ్లే అని తమ అభిమాన టీచర్స్ గురించి కొందరు స్టార్స్ చెప్పారు. ఆ విశేషాలు. నా గురువు సుహాస్ లిమయే ఇటీవలే మరణించారు. సార్.. మీరు నా అభిమాన గురువు. మీతో గడిపిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. నాకు అన్నీ తెలుసు అనుకోకుండా ఎప్పుడూ విద్యార్థిలాంటి ఉత్సాహం, నేర్చుకున్న ప్రతీది నేర్పించాలి అనే మీ ఆలోచనా నాకు ఎంతో నచ్చేవి. అందుకే అంత గొప్ప మాస్టారు మీరు. మీతో గడిపిన నాలుగేళ్లు నా మదిలో ఎప్పటికీ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతాయి. మీరు నాకు మరాఠీ మాత్రమే కాదు. దానికి మించి ఎన్నో విషయాలను బోధించారు. – ఆమిర్ ఖాన్ నేను ఈరోజు ఇలా ఉన్నానంటే ముఖ్య కారణం మా టీచర్సే. స్కూల్లో నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లిష్. దానికి కారణం మా ఇంగ్లిష్ టీచరే. నన్ను చాలా సపోర్ట్ చేశారామె. ఆమె ప్రోత్సాహంతోనే ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడం అలవాటయింది. అలాగే పబ్లిక్‌లోనూ చురుకుగా మాట్లాడగలిగే టెక్నిక్స్ చాలా నేర్పారామె. మా స్కూల్లో (భారతీ పబ్లిక్ స్కూల్) టీచర్ నుంచి స్కూల్ ప్రిన్సిపాల్‌గా ఆమెకు ప్రమోషన్ వచ్చిందని తెలిసి చాలా సంతోషించాను. ఆమె ప్రిన్సిపాల్‌గా ఇన్చార్జ్ తీసుకునే రోజు ఆమెను స్కూల్‌కి వెళ్లి కలవడం నాకో మంచి జ్ఞాపకం. – తాప్సీ సాధారణ టీచర్లు కేవలం పాఠం వరకూ చెప్పి వెళ్లిపోతారు. కానీ గొప్ప టీచర్లు మనకు అర్థమయిందా లేదా? అని చూస్తారు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం నేర్పిస్తారు. మన జీవితంలో టీచర్స్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. కానీ వాళ్ల పాత్రకు చాలా తక్కువ అభినందన వస్తుంటుంది. వాళ్ల ప్రభావం మన మీద ఎంత ఉంటుందో ఆ ఉపాధ్యాయులు కూడా ఉహించలేరు. నిస్వార్థంగా మనల్ని తీర్చిదిద్దుతారు. ఆ ఘనత గురించి చెప్పుకోరు. అది వాళ్ల గొప్పతనం. – లావణ్యా త్రిపాఠి -
గురువులకే గురువు ఆయన!
-
గురువులకే గురువు ఆయన!
విద్యార్ధి ఎగిరే గాలిపటం అయితే దానికి ఆధారమైన దారం గురువు. అందుకే భారత సంస్కృతిలో తల్లి దండ్రుల తరువాత స్థానం గురువుకు ఇచ్చారు. అలాంటి గురువులను సత్కరించడానికి ప్రతి యేడాది మన దేశంలో సెప్టెంబర్ 5వ తేదీన గురుపూజోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి ఈ రోజు జరుపుకొవడానికి ప్రధాన కారకులైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి. -
వెండితెర గురువులు
గురు బ్రహ్మ.. గురు విష్ణు.. అని శ్లోకం ఉంది నిజమేగానీ సినిమా వాళ్లు దానికి కాస్త ఎక్స్టెన్షన్ కొట్టి లెంగ్త్ పెంచి గురు హీరో గురు హీరోయిన్ గురు క్యారెక్టర్ ఆర్టిస్ట్ నమః అని కూడా అనుకున్నారు. స్కూళ్లు, కాలేజీలు లేని సమాజం ఎలా లేదో టీచర్ల, లెక్చరర్ల పాత్రలు లేని సినిమాలు కూడా లేవు. ఆ మిస్సమ్మల, పంతులమ్మల, మాస్టారుల రీ విజిట్.. నేడు టీచర్స్ డే సందర్భంగా. ‘మిస్సమ్మ’లో సావిత్రి కేవలం స్కూల్లో పిల్లలకే టీచర్ కాదు. ఆ సినిమాలోని ప్రతి పాత్రకూ టీచరే. కొంచెం నాన్ సీరియస్‌గా ఉన్న ఎన్.టి.ఆర్కు లక్ష్యం ఏర్పరిచిన ఆమే టీచర్. దొంగ బిచ్చగాడు రేలంగిని ఆ దారి వదిలించిన ఆమే టీచర్. తెలిసీ తెలియని వయసులో ఉన్న జమునకు మంచి చెడు తెలియజేసిన ఆమే టీచర్. కంత్రీ విలన్ రమణా రెడ్డికి బడితె పూజ చేయడం తెలిసిన ఆమే టీచర్. ‘మిస్సమ్మ’లో సావిత్రిని చూసి చిన్నపిల్లల్లా ప్రతి ఒక్కరూ భయపడేవారే. ఆఖరుకు ఎస్.వి. రంగారావు, బుష్యేంద్రమణిలతో సహా. సినిమాల్లో టీచర్ పాత్రకు గట్టిగా ఫౌండేషన్ వేసిన పాత్ర అది. కానీ ఆశ్చర్యంగా ‘బడి పంతులు’లో ఎన్.టి.ఆర్ పాత్ర అమిత మెత్తన. నెమ్మది, కరుణ, దయ తప్ప ఆ పాత్రకు ఏమీ తెలియదు. పిల్లలు దేవుళ్లు కాబట్టి ఆ పాత్రలోని దైవత్వాన్ని గ్రహించి ఆదరించారు. కానీ కడుపున పుట్టిన సంతానం అవమానం చేసి వేదన మిగిల్చింది. ఆ పంతులును బడి ఎక్కించి నిలబెట్టింది. అయితే మంచితనమే చివరికి గెలుస్తుంది. శిష్యుడు ఫెయిల్ కావచ్చు గాని విలువలకు నిలబడ్డ గురువు ఓడిపోయినట్టు చరిత్రలో లేదు. అయితే ఇంట్లో తల్లిదండ్రుల మాట వినని మొండి ఘటాలు కూడా స్కూల్లో ఒక మాస్టారు ముందు మోళీ వేసినట్టుగా తలాడిస్తారనడానికి తార్కాణంగా ‘కోడె నాగు’ సినిమా వచ్చింది. ఆ సినిమాలో పరమ మొండి ఘటమైన శోభన్ బాబు తన టీచర్ అయిన ఆత్రేయ మాట మాత్రమే వింటాడు. కానీ ఈ శిష్యుడి సంస్కరణలో ఆ గురువు ప్రాణ త్యాగం చేస్తాడు. ఆ గురువుకు నివాళిగా శిష్యుడూ ఆత్మార్పణం చేస్తాడు. గుండెలు పిండే ఈ కథ గురుశిష్యుల అనుబంధాన్ని అజరామరం చేసింది. ‘స్కూలు’, ‘కాన్వెంటు’ అనే మాటలు వాడుకలో పెరుగుతున్న వేళ ఆడవాళ్లు టీచింగ్ ప్రొఫెషన్లోకి ఎక్కువగా వస్తున్న వేళ ‘పంతులమ్మ’ అనే సినిమా రావడం విడ్డూరం కాదు. భార్య చనిపోగా, చిన్న పిల్లాడితో అవస్థలు పడుతున్న రంగనాథ్ దగ్గర పంతులమ్మ ఉద్యోగానికి వచ్చిన లక్ష్మి ఆ పిల్లాడికి తల్లిలా మారి గాడి తప్పిన ఆ ఇంటికి ఇల్లాలిగా కూడా మారే ఆ కథ పెద్ద హిట్ అయ్యింది. అయితే ‘పూజ’లో మేనమామ కూతురైన కన్నడ మంజులను పెళ్లి చేసుకుందామనుకున్న లెక్చరర్ రామకృష్ణ ఇష్టం లేని వాణిశ్రీని చేసుకుని ఆమెను భార్యగా స్వీకరించలేక క్షోభ పడటం, చివరకు ఆ జంట ఏకం కావడం ఆ వృత్తిలో ఉండేవారికి ఎదురయ్యే ‘పరీక్షాకాలం’గా జనం చూశారు. ఇదే సమయంలో వచ్చిన మరో ముఖ్యమైన సినిమా ‘బలిపీఠం’. ఇందులో కులమతాల వివక్ష దూరం కావాలని భావించే స్కూల్ టీచర్ శోభన్‌బాబు తనకంటే పైకులం స్త్రీ శారదను వివాహం ఆడి సంఘంలో ఎంతటి హెచ్చుతగ్గుల వ్యవస్థ ఉన్నదో తెలుసుకుంటాడు. యూనిఫామ్ వేసి పిల్లలందరినీ సమానం చేసే క్లాస్రూమ్ ఇంట్లో.. బజారులో ఎంత అసమానంగా ఉంటుందో ఈ సినిమాలో తెలుస్తుంది. అటు పిమ్మట వచ్చిన ‘విశ్వరూపం’ విద్యార్థి శక్తి తలుచుకుంటే సంఘ నిర్మాణం, దేశ నిర్మాణంలో ఎంత చురుకైన పాత్ర పోషించగలదో చూపించింది. అయితే అందుకు వారిని ఉత్తేజపరచగల గురువు అవసరం. అలాంటి గురువుగా ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో గొప్పగా కనిపిస్తారు. కానీ అన్ని సినిమాల్లోనూ ఎన్.టి.ఆర్లు ఉండరు. కొన్నింటిలో చంద్రమోహన్లు ఉంటారు. ‘మూడుముళ్లు’ సినిమాలో చంటిబిడ్డతో పల్లెటూళ్లో పాఠాలు చెప్పడానికి వచ్చిన టీచర్ చంద్రమోహన్ అదే ఊళ్లో ఆకతాయిగా తిరుగుతున్న రాధిక మనసు దోచుకుంటాడు. చంద్రమోహన్ సంస్కారాన్ని చూసిన రాధిక ఎలాగైనా సరే అతణ్ణి పెళ్లి చేసుకొని అతని బిడ్డకు తల్లిలా మారాలనుకుంటుంది. ఆమెను అనేకసార్లు ఫెయిల్ చేసిన చంద్రమోహన్ చివరకు పాస్ చేసి అక్కున చేర్చుకుంటాడు. టి.కృష్ణ వచ్చాక సినిమాల్లో బాధ్యతతో ఉండాల్సిన టీచర్ల పాత్రలు ఎక్కువగా చూపించారు. ‘వందేమాతరం’లో స్కూల్ టీచర్‌గా రాజశేఖర్, ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ సినిమాల్లో టీచర్‌గా, లెక్చరర్‌గా విజయశాంతి ప్రేక్షకులను క్లాస్‌రూమ్‌లో కూర్చోబెట్టారు. ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో’... ప్రతి ప్రేక్షకుడు బాధ్యత ఉన్న టీచర్‌గా సంస్కరణకు దిగకపోతే భవిష్యత్తు అంధకార బంధురం అని చెప్పారు. ‘శుభలేఖ’లో సుమలత లెక్చరర్. సంతలో పశువును అమ్మినట్టు వరుణ్ణి అతడి తల్లిదండ్రులు అమ్మే వరకట్న దురాచారాన్ని నిర్మూలించడానికి ఆమె గళం ఎత్తుతుంది. కైకాల సత్యనారాయణను ఎదిరిస్తుంది. ఫలితంగా ఉద్యోగం పోగొట్టుకుంటుంది. అయితే ఏం... ఆఖరుకు చిరంజీవిలాంటి ఉత్తముణ్ణి భర్తగా పొందుతుంది. ఈ సినిమాలో కె.విశ్వనాథ్ మూడు విషయాలు చెప్పారు. స్త్రీలు బాగా చదువుకోవాలి. ఉద్యోగం చేయాలి. అమ్మకానికి అబ్బాయిని తెచ్చుకోకుండా ఆత్మగౌరవంతో పెళ్లి బంధంలోకి వెళ్లాలి. లెక్చరర్ పాత్రలు మాస్ హీరోలను కూడా ఆకట్టుకున్నాయి. అందుకే వెంకటేశ్ ‘సుందరకాండ’, చిరంజీవి ‘మాస్టర్’, బాలకృష్ణ ‘సింçహా’ చేశారు. స్టూడెంట్స్‌ను ‘యాంటీ కరెప్షన్ ఫోర్స్’గా మార్చి, అవినీతి అధికారులకు ఏకంగా మరణశిక్ష విధిస్తూ సంచలనం సృష్టించింది కేవలం ఒక ప్రొఫెసర్ అంటే అది ఆ వృత్తి గొప్పతనం అనుకోవాలి. ‘ఠాగూర్’ సినిమాలో చిరంజీవి ఈ పని చేస్తారు. అయితే ఉపాధ్యాయుడంటే విద్యార్థి బాగు మాత్రమే కోరేవాడు కాదు ఊరు బాగు కూడా కోరేవాడు అని రాజేంద్రప్రసాద్ ‘ఓనమాలు’ చెప్పింది. ఇందులో టీచరైన రాజేంద్రప్రసాద్ సొంత ఊరు వదిలిపెట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఊరికి రావాలని మాతృభూమికి సేవ చేయాలని పిలుపు ఇస్తారు. మార్గదర్శి లేని ఊరు దివిటీ లేని చీకటి దారి అని సందేశం ఇస్తారు. కొత్తతరం హీరోలు కూడా లెక్చరర్లుగా, ట్యూటర్లుగా కనపడటానికి వెనకాడటం లేదు. ‘గీత గోవిందం’లో విజయ్ దేవరకొండ ఒక మంచి లెక్చరర్‌గా కనపడతాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి అబ్దుల్ కలామ్ నుంచి స్ఫూర్తి పొందేవారు ఎందరో ఉంటారు. వారు చెప్పిన మంచే ఒక హీరోనో హీరోయినో చెప్తే వెంటనే తాకే యువతరం శాతం ఎక్కువగా ఉంటుంది. స్టూడియోనే క్లాస్‌రూమ్‌గా కెమెరానే బ్లాక్‌బోర్డుగా సాగే ఈ స్ఫూర్తివంతమైన పాఠాలు కొనసాగాలని కోరుకుందాం. – కె. ‘మిస్సమ్మ’లో సావిత్రి ‘బడిపంతులు’లో ఎన్టీఆర్, అంజలి ‘సుందరకాండ’లో వెంకటేశ్, ‘ఓనమాలు’లో రాజేంద్రప్రసాద్, ‘విశ్వరూపం’లో ఎన్టీఆర్ విజయశాంతి శ్రీవిద్య, శోభన్‌బాబు ‘మూడు ముళ్లు’లో రాధిక, చంద్రమోహన్ ∙చంద్రమోహన్, విజయశాంతి, చరణ్‌రాజ్ ‘ఠాగూర్’లో చిరంజీవి, ‘గీత గోవిందం’లో విజయ్ దేవరకొండ -
వృత్తిని గౌరవించే మహోపాధ్యాయుడు
భారతీయ దార్శినిక చింతనాధోరణులను, సంస్కృతిని పాశ్యాత్య దేశాలకు తనదైన శైలిలో రచనలద్వారా తెలియజేసిన గొప్పరచయిత, విద్యావేత్త, వేదాంతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు. సంస్కృత భాషలోని భవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులకు (ప్రస్థానత్రయ) ఆంగ్లంలో గొప్ప వ్యాఖ్యానాలు రాసి భారతీయ దర్శనానికి గల విశిష్టతను తాత్విక మూలాలను ఆవిష్కరించి భావవాద కోణంలో భారతీయదర్శనాన్ని రచించి పాశ్చాత్యులు ఆ దర్శనాన్ని ఆసక్తితో అధ్యాయనం చేసేలా కృషిచేసిన వేదాంతి రాధాకృష్ణన్. ఆయన వల్లనే భారతీయ దర్శనం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందనడంలో అతిశయోక్తిలేదు. వారి మేధోసంపత్తిని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా వున్న వివిధ దేశాల్లోని విశ్వవిద్యాలయాలు 110 డాక్టరేట్ పురస్కారాలు అందజేశాయి. ఆయన సుమారు 150 గ్రంథాలు రచించారు. వీటిలో ముఖ్యమైనవి ‘ఇండియన్ ఫిలాసఫీ’, ‘ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్’, ‘ద ఐడియల్ వ్యూ ఆఫ్ లైఫ్’, ‘ఫ్రీడమ్ అండ్ కల్చర్’, ‘మహాత్మాగాంధీ’, ‘గ్రేట్ ఇండియన్’, ‘ది దమ్మపద గౌతమబుద్ద’, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. రాధాకృష్ణన్‌గారు మనదేశానికి 1952 నుండి 1962 వరకు ఉపరాష్ట్రపతిగా రెండు పర్యాయాలు పనిచేశారు. 1962లో దేశంలోనే అత్యున్నతమైన పదవి అయినటువంటి రాష్ట్రపతి పదవిని అలంకరించారు. ఆ సందర్భంలో దేశవిదేశాల్లో వున్న తనశిష్యులు శ్రేయోభిలాషులు ఆయనను కలిసి మనసారా అభినందించి తన జన్మదినమైన సెప్టెంబర్ 5ను ఆ సంవత్సరం ఘనంగా జరిపేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కానీ తన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే తాను ఆనందిస్తానని రాధాకృష్ణన్ అన్నారు. దాంతో నాటినుండి సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయదినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకోవటం ప్రారంభమైంది. రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుత్తణి పట్టణంలో జన్మించారు. ప్రాథమిక విద్యను తిరువళ్లూరులో, పాఠశాల, ఉన్నత విద్యను రేణిగుంటలో.. మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసుకొని మద్రాసు యూనివర్సిటీలో తన అభిమాన విషయమైన తత్వ శాస్త్రంలో ఎమ్మే పట్టా పొందారు. 1921లో ప్రతిష్ఠాత్మకమైన 5వ కింగ్‌జార్జ్ ఆచార్యపీఠాన్ని కలకత్తా విశ్వవిద్యాలయంలో అధిష్టించారు. 1929లో ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ కాలేజి ప్రిన్సిపల్‌గా, ఆ పిదప ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆచార్యుడుగా పనిచేశారు. 1931లో సర్వేపల్లికి ‘సర్’ బిరుదు లభించింది. ఆయన మైసూరు, కలకత్తా, మద్రాసు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో ఆచార్యుడుగా పనిచేసి 1931లో ఆంధ్రాయూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1954లోనే దేశంలో అత్యున్నత ప్రభుత్వ పురస్కారమైనటువంటి భారతరత్నను అందుకొని 1962లో రాష్ట్రపతిగా ఎన్నికయినప్పుడు.. ‘ప్లేటో కలలుగన్న ఫిలాసఫర్ కింగ్’ అనే ఊహ సాకారమైనట్లుగా పలువురు విద్యావేత్తలు అమితానందం పొందారు. ఉపాధ్యాయునికి ఉండాల్సిన లక్షణాలు, ఆశయాలు, విధులకు సంబంధించిన అంశాలన్నింటిని రాధాకృష్ణన్ తాను సమర్పించిన ‘విశ్వవిద్యాలయాలు విద్యావిధానం’ అనే నివేదికలో స్పష్టంగా వివరించారు. విద్యాబోధనలో మాతృభాషకు ప్రాధాన్యతనిచ్చి స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం, సహజన్యాయం వంటి ప్రజాస్వామ్య విలువలను వర్సిటీలు సంరక్షించాలి. తద్భిన్నంగా నేడు పలువురు ఉపాధ్యాయులు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ ప్రభావాలతో స్వప్రయోజనాలకు అధిక ప్రాధాన్యతనివ్వడంతో ఉపాధ్యాయవృత్తి మసకబారుతుంది. బోధన ప్రమాణాలు, విద్యాప్రమాణాలతోపాటు సామాజిక, నైతిక విలువలు క్షీణించిపోతున్న ఈ తరుణంలో ఉపాధ్యాయదినోత్సవం ఉపాధ్యాయులకు తమ విధులను, బాధ్యతలను గుర్తు చేయడంలో స్ఫూర్తిదాయకంగా నిలవాలి. (నేడు ఉపాధ్యాయ దినోత్సవం) వ్యాసకర్త: ప్రొఫెసర్ జి. లక్ష్మణ్, తత్వశాస్త్ర విభాగాచార్యులు, ఓయూ మొబైల్ : 98491 36104 -
భావి భారత నిర్మాతలు ఉపాధ్యాయులు
మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్య దేవోభవ.. భారతీయ సమాజం జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత అక్షరాలుదిద్దించిన గురువుకే పెద్దపీట వేసింది. గురువును సాక్షాత్తూ దేవుడితో సమానంగా పూజించింది.. పూజిస్తోంది. నేటి బాలలే.. రేపటి పౌరులు.ఆ పౌరులను బాధ్యతాయుత వ్యక్తులుగా.. బంగారు భవిష్యత్తుకు మార్గనిర్దేశకులుగా.. ప్రగతి రథ సారధులుగా నిలిపేవారే.. ఉపాధ్యాయులు.అందుకే శతాబ్దాల నాటి గురుకులాలైనా.. ఆన్లైన్ పాఠాల సంస్కృతి పెరుగుతున్న నేటి ఆధునిక యుగంలోనైనా.. బోధన ఒక పవిత్రమైన వృత్తిగా భాసిల్లుతోంది.టీచర్స్ అంటే సమాజంలో గౌరవం ఇనుమడిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రపై విశ్లేషణ.. దేర్ ఈజ్ నో నాలెడ్జ్ విత్ అవుట్ టీచర్స్.. టీచర్స్ ఆర్ ప్రొవైడర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.. జ్ఞాన సముపార్జనలో.. భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయులకున్న ప్రాధాన్యతను తెలిపేందుకు ఇంతకు మించిన పదాలు అక్కర్లేదు. అందుకే.. మన సమాజంలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకే స్థానం దక్కింది. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే.. వారికి బంగారు భవిష్యత్‌ను ఇచ్చే క్రమంలో కీలకపాత్ర టీచర్లదే. భవిష్యత్‌కు మార్గదర్శకులు ప్రొఫెసర్‌గా, శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం చెప్పిన మాటలే ఉపాధ్యాయ వృత్తికున్న గొప్పతనానికి నిదర్శనం. ‘ఒక విద్యార్థి వ్యక్తిత్వాన్ని, సామర్థ్యాన్ని, భవిష్యత్తును రూపుదిద్దే సర్వోన్నత వ్యక్తి ఉపాధ్యాయుడే’ అని ఆయన తరచుగా చెప్పేవారు. ఆయన వివిధ హోదాల్లో బిజీగా ఉన్నా మనసంతా బోధనపైనే ఉండేది. వీలు దొరికినప్పుడల్లా ఏవైనా పాఠశాలలు/యూనివర్సిటీలు/కళాశాలలను సందర్శించి వివిధ అంశాలపై ఉపన్యసించేవారు. ఎంతో ఉత్సాహంగా విద్యార్థులతో తన అనుభవాలను పంచుకునేవారు. వారిని ఉత్సాహపరిచేవారు.. కార్మోన్ముఖులను చేసేవారు. తాను ఎక్కడో దేశానికి దక్షిణం దిక్కులో సముద్రంలో విసిరేసినట్లుండే ఒక చిన్న ఊరు రామేశ్వరంలో పుట్టినా.. ఈ స్థాయికి రావడానికి తన గురువులే కారణమని కలాం ఎప్పుడూ గుర్తు చేసుకునేవారు. నైపుణ్యాలకు నగిషీలు.. వజ్రం ఎంత గొప్పదైనా.. దానికి సానపెడితేనే మరింత వెలుగులీనుతుంది. అదేవిధంగా చిన్నారుల్లో సహజసిద్ధమైన సామర్థ్యాలున్నా.. వారిని సానపెట్టి వజ్రాల్లా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. చిన్నారుల్లోని నైపుణ్యాలను గుర్తించి.. వాటికి నగిషీలు అద్ది, మట్టిలోని మాణిక్యాలను కూడా వెలుగులోకి తీసుకువచ్చేది మాత్రం టీచర్లే. ఆర్ట్ ఆఫ్ టీచింగ్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ అసిస్టింగ్ డిస్కవరీ అనే మాటే.. పిల్లల్లో నైపుణ్యాలను వెలికితీయడంలో ఉపాధ్యాయుల పాత్రను తెలియజేస్తోంది. అత్యున్నత నోబెల్ బహుమతి గ్రహీతల నుంచి సమాజంలో ఉన్నత స్ధానంలో ఉన్న వ్యక్తుల వరకు దాదాపు ప్రతి ఒక్కరూ తమకు స్ఫూర్తి, ప్రేరణ తమ చిన్ననాటి ఉపాధ్యాయులే అని పేర్కొనడం మనం తరచూ వింటూనే ఉంటాం. అలాంటి గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అనుబంధం అంతంతమాత్రం.. ప్రస్తుతం 21వ శతాబ్దంలో.. 4జీ ఫోన్లు, అరచేతిలో ఒక్క క్లిక్‌తో సమస్త ప్రపంచ సమాచారం కళ్ల ముందుంటోంది. ఈ క్రమంలో ఈ తరం ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు ఎలా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ఎలాంటి శ్రద్ధ చూపుతున్నారు? అంటే .. వీరి మధ్య అనుబంధం అంతగా ఉండటం లేదని చెప్పొచ్చు. తరగతి గది మారింది. పాఠశాల స్థాయిలో బ్లాక్ బోర్డ్, చాక్ పీస్ స్థానంలో వైట్ బోర్డ్స్, మార్కర్ పెన్స్ సంస్కృతి పెరిగింది. ఆడియో-విజువల్ టూల్స్‌తో క్లాస్రూంలు ఆధునికతను సంతరించుకుంటున్నాయి. ‘క్లాస్ రూంలో పాఠాలు వినపోయినా ఫర్వాలేదు. ఇంటర్నెట్, ఈ-లెర్నింగ్ టూల్స్ ఉన్నాయిగా’ అనే దృక్పథం యువతలో పెరుగుతోంది. కానీ ఈ-లెర్నింగ్ టూల్స్, ఆన్లైన్ ట్యూషన్స్, వీడియో లెక్చర్స్ సైతం ఉపాధ్యాయులే రూపొందిస్తారని యువత గుర్తించాలి అని విద్యావేత్తలు అంటున్నారు. ‘టెక్నాలజీ అనేది విద్యా బోధనలో ఒక సాధనం మాత్రమే. విద్యార్థిని తీర్చిదిద్దడంలో టీచర్ పాత్రే అత్యంత కీలకం’ అని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ చేసిన వ్యాఖ్యలే విద్యార్థుల భవిష్యత్ నిర్దేశం దిశగా నేటి ఆధునిక యుగంలో ఉపాధ్యాయుల పాత్రను తేటతెల్లం చేస్తోంది. మూర్తిమత్వానికి చోదక శక్తులు చాలామంది ఉపాధ్యాయులు అంకితభావం, కష్టించే స్వభావం, వృత్తిని ప్రేమించేతత్వాన్ని కలిగి ఉంటున్నారు. తమ బోధనల ద్వారా విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. వారి సంపూర్ణ మూర్తిమత్వానికి చోదక శక్తులుగా నిలవాలనుకుంటున్నారు. అత్యంత శ్రద్ధతో ఒక టీచర్ చెప్పే పాఠాన్ని వింటే.. సదరు అంశానికి సంబంధించి సగం నైపుణ్యం పొందినట్లే. ఎందుకంటే పలువురు విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం ఒక విద్యార్థికి క్లాస్ రూం పాఠం ద్వారా 50 శాతం; లైబ్రరీ ద్వారా 25 శాతం; ఇతర లెర్నింగ్ సదుపాయాల ద్వారా 25 శాతం నైపుణ్యాలు అందుతాయి. అంటే టెక్నాలజీ ఎంత పెరిగినా.. ఎన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చినా ప్రత్యక్షంగా టీచర్ చెప్పే పాఠం ద్వారా లభించే జ్ఞానమే అధికం. దీన్ని నేటి యువత గుర్తించాలి. ఎర్లీ చైల్డ్‌హుడ్.. ఎంతో ప్రధానం సరిగా మాటలు పలకడం కూడా రాని వయసులో ప్రీ-ప్రైమరీ, కిండర్‌గార్టెన్, నర్సరీ, ఎల్కేజీ ఇలా రకరకాల పేర్లతో పిల్లలను పాఠశాలల్లో చేర్చుతున్న రోజులివి. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేది ఉపాధ్యాయులే. ఆట బొమ్మలతో పాఠాలు చెబుతూ.. వాటిని చిన్నారులు అర్థం చేసుకోవడంలో ఉపాధ్యాయులు పాటించే సహనం, ఓర్పు, నేర్పు గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతేకాకుండా చిన్నారుల్లో ఉన్న సహజ సిద్ధ నైపుణ్యాలను వెలికితీయడంలో టీచర్ల పాత్ర వెలకట్టలేనిది. అందుకే గుడ్ టీచర్ నోస్ హౌ టు బ్రింగ్ అవుట్ ది బెస్ట్ ఇన్ స్టూడెంట్స్ అనే మాట కూడా ఉంది. ఉపాధ్యాయుల సలహాలు తీసుకోండి ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయులు - విద్యార్థుల మధ్య సాన్నిహిత్యం కొంత తగ్గుతుందనే మాట వాస్తవమే. కారణం.. ఆధునిక యుగంలో యువత క్లాస్ రూం లెర్నింగ్‌కు తక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఆధునిక టెక్నాలజీ ద్వారా పలు మార్గాలు వీరికి అందుబాటులోకి రావడమే ఇందుకు ప్రధాన కారణం. కానీ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి డాక్టరేట్ స్టడీస్ వరకు స్టూడెంట్ - టీచర్ మధ్య గుడ్ రిలేషన్ ఉండాలి. అది విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. - ప్రొఫెసర్ వి.రామ్ గోపాల్‌రావు డెరైక్టర్, ఐఐటీ-ఢిల్లీ ప్రొఫెషన్‌ను ప్రేమించాలి ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టేవారికి ఈ వృత్తిని ప్రేమించే లక్షణం ఎంతో అవసరం. తాము భావి పౌరులను తీర్చిదిద్దుతున్నామనే ఆలోచనతో ఉండాలి. ముఖ్యంగా ప్రీ-ప్రైమరీ స్థాయిలోని టీచర్లు ఎంతో ప్రత్యేకంగా వ్యవహరించాలి. అప్పటివరకు తల్లిదండ్రులు తప్ప మరో ప్రపంచం తెలియకుండా.. క్లాస్ రూంలో అడుగుపెట్టే చిన్నారులను ఆ వాతావరణానికి అలవాటు పడేలా చేసే నేర్పు ఎంతో అవసరం. దానిపైనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. - సీతాకిరణ్, ప్రిన్సిపాల్, డీఏవీ పబ్లిక్ స్కూల్ -
ఆ రోజు టీచర్స్ కంగారు పడ్డారు! - కాజల్
టీచర్స్ డే స్పెషల్ చదువంటే ఇష్టమే కానీ బాగా అల్లరిపిల్లని. ఓసారి స్కూల్లో అందరితో కలసి ఓ సైన్స్ ఎగ్జిబిషన్‌కి వెళ్లాను. బోర్ కొట్టడంతో మధ్యలోనే ఇంటికి వచ్చేశా. నేను తప్పిపోయాననుకుని టీచర్లు కంగారుపడ్డారు. అమ్మతో చెప్పాలని మా ఇంటికి వచ్చారు. నేను తీరిగ్గా టీవీ చూస్తున్నాను. దాంతో చిన్న చిన్నగా చివాట్లు పెట్టారు. ఇప్పటికీ ఆ సంఘటన తలచుకుంటే బాగా నవ్వొస్తుంది. ఏదో చిన్నప్పుడు తెలియక అలా చేశా కానీ, టీచర్స్ అంటే గౌరవం లేక కాదు. ఆచార్య దేవోభవ అని ఊరికే అనరు. నిజమే.. మనకు విద్యా బుద్ధులు నేర్పించే టీచర్లు దేవుడితో సమానమే. చిన్నప్పుడు ఏవేవో చదవాలనుకున్నాను. చివరకు, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చేశాను. ఏంబీఏ చేయాలనేది నా లక్ష్యం. సినిమాల్లోకి రావడంతో ఫుల్స్టాప్ పడింది. కానీ, ఎప్పటికైనా ఎంబీఏ చేస్తా. -
అమ్మే నా తొలి గురువు : శ్రీయ
టీచర్స్ డే స్పెషల్ చిన్నప్పట్నుంచీ చదువులో నేను యావరేజ్ స్టూడెంటే. డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే.. చిన్నప్పుడు ఓసారి అమ్మతో కలసి గుడికి వెళ్లాను. అక్కడ జరుగు తున్న డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసి అమ్మ చేతిని వదిలేసి అటు వెళ్లా. జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు. నేను కనపడకపోవడంతో అమ్మ కంగారు పడుతూ వెతికింది. చివరకు, స్టేజి మీద డ్యాన్స్ చేస్తూ కనిపించడంతో ఊపిరి పీల్చుకుంది. నాకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో అమ్మకు తెలిసింది. ఆ తర్వాత తనే నాకు నేర్పించింది. అమ్మే నా తొలిగురువు. డ్యాన్స్‌లో నా ప్రతిభ చూసే ఢిల్లీ ‘లేడీ శ్రీరామ్ కాలేజ్’లో సీట్ ఇచ్చారు. అమ్మతో పాటు నా స్కూల్, కాలేజీ గురువులందరూ నాకు ఆదర్శంగా నిలిచారు. ఒక్కో టీచర్లో ఒక్కో లక్షణాన్ని ఆదర్శంగా తీసుకున్నాను. పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర చాలా ఉంటుంది కాబట్టి ‘ఆచార్య దేవోభవ’. -
గురువులకు.. వందనం
-
గురువులకు.. వందనం
సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవమైనది. వృత్తి పట్ల నిబద్ధత, మంచి వ్యక్తిత్వం, సహన శీలత, స్వీయ శిక్షణ, నైతిక విలువల పట్ల క్రమ శిక్షణ, విద్యార్థుల తెలివి తేటల్ని గుర్తించి పదును పెట్టగలిగే సామర్థ్యం ఉన్న వారే ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందారు. అటువంటి వారు విద్యార్థుల మదిలో చిరకాలం గుర్తుండిపోతాడు. అయితే ప్రస్తుత రోజుల్లో అలాంటి వారు నూటి కో కోటికో కనిపిస్తారు. అవార్డుల కోసమో, ఎవరి మెప్పు కోసమో కాకుండా విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్న కాంక్షతో పని చేసే వారు చాలా అరుదు. బొబ్బిలి, పార్వతీపురం, ఎస్. కోట పట్టణాల్లో పని చేస్తున్న కొందరు ఉపాధ్యాయులు ఇదే బాటలో నడుస్తున్నారు. నాలుగు గోడల మధ్య విద్యా బోధనే కాదు...నలుగురూ మెచ్చుకొనే మంచి పనులు చేస్తూ.. సమాజాభివృద్ధిలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు సమాజాన్ని సరైన మార్గంలో నడపడంతో మార్గదర్శులుగా నిలుస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారిపై ‘సాక్షి’ కథనం. బొబ్బిలి: నాలుగు గోడల మధ్య విద్యా బోధనే కాదు... నలుగురూ మెచ్చుకొనే మంచి పనులు చేయడంలోనూ మేం సిద్ధహస్తులమేనని నిరూపిస్తున్నారు బొబ్బిలి పట్టణానికి చెందిన కొందరు ఉపాధ్యాయులు. పట్టణానికి చెందిన టీచర్లంతా యంగ్ మేన్ హ్యాపీ క్లబ్ ఏర్పాటు చేసి అందరూ నవ్వు తూ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ దిశగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాత బొబ్బిలికి చెందిన టీచరు మింది విజయ్‌మోహన్ సీతానగరం మండలం నిడగళ్లులో పని చేస్తున్నా రు. ఆయన ఆధ్వర్యంలో సుమారు 15 మంది టీచర్లు ఒకటై నేడు నవ్వుల లోకాన్ని సృష్టిస్తున్నారు. వారే స్వయంగా నాటికలు తయారు చేసుకొని ప్రదర్శనలు ఇస్తున్నారు. బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెర్లాం, సీతానగరం, బలిజిపేట మండలాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఇప్పటికి దాదాపు 25 వరకూ హాస్య ప్రదర్శనలు ఇచ్చి వారిలో ఉన్న ప్రతిభను బయట ప్రపంచానికి చాటారు. దీనిలో మీసాల గౌరునాయుడు, రెడ్డి బెనర్జీ, బొత్స రత్నకిశోర్, మోజేస్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే జిల్లా స్థాయి ఇంగ్లిష్ లాంగ్వేజ్ అసోసియేషన్ (డెల్టా)ను కూడా స్థాపించి ఆంగ్లంను నేర్పే విధానంతో పాటు సులభతర బోధనపై దృష్టి సారించారు. మొక్కల ప్రేమికుడు... బాడంగి మండలం వాడాడలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు ఎస్వీ రమణమూర్తి పర్యావరణ ప్రేమికుడుగా పేరు గడించారు. పర్యావరణాన్ని ప్రేమించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ఆయన ప్రజల్లో అవగాహన కల్పించడం, వేలాది మొక్కలను సొంత నిధులతో తెప్పించి పంపిణీ చేసి నాటించడానికి నడుం కట్టుకున్నారు. వీటి కోసం గ్రీన్ బెల్టు సొసైటీని ఏర్పాటు చేసి అందులో మరికొందరు టీచర్లను భాగస్వాము లను చేశారు. దీని వల్ల ఒకవైపు మొక్కలు పెంపకంపై అవగాహన పెంచడంతో పాటు పాఠశాలలు, ఖాళీ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహ దారులకు ఇరువైపులా మొక్కలు నాటిస్తూ వాటి సంరక్షణ బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికి వేలాది మొక్కలు నాటి వృక్ష ప్రేమికుడిగా మారారు. రమణమూర్తి చేస్తున్న కృషికి బొబ్బిలి రాజులు కూడా తనదైన సహకారాన్ని అందిస్తూ మొక్కలు రవాణాకు సొంత వాహనాలను సమకూరుస్తున్నారు. కళారాధనలో శ్రీదేవి... సీతానగరం మండలం జానుమల్లవలసలో టీచరుగా పని చేస్తున్న చుక్క శ్రీదేవి కళాసేవలో తనదైన ముద్ర వేశారు. కళలను, సంసృ్కతీ, సాంప్ర దాయాలను పెంపొందించడానికి సాయి చంద్రిక ఏకంగా కళా సేవా సంఘాన్ని ఏర్పాటు చేసి నృత్య, పౌరాణిక, సాంఘిక నాటకాల ప్రదర్శనలు ఏ ర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర స్థాయి నృత్య, నాటక పోటీలు నిర్వహించి మూడు జిల్లాలో ఉన్న నృత్య కళాకారులు, సాంఘిక కళలను పెంపొందిస్తున్నారు. ఇటీవల పర్యావరణాన్ని పరిరక్షించడానికి మట్టి వినాయకులను పంపిణీకి ఈ సంస్థ శ్రీకారం చుట్టింది. ఆయనే నాలో స్ఫూర్తి కలిగించారు నేను నాగార్జునసాగర్‌లోని ఏపీఆర్జేసీలో చదువుతున్నప్పుడు పౌరశాస్త్ర విభాగాధిపతి విజయరాఘవాచారి ఉండేవారు. ఆయన పాఠాలు విద్యార్థు లను ఎంతో ప్రభావితం చేసేవి. ముఖ్యంగా నాకు ఆయన ప్రసంగమన్నా..బోధనన్నా ఎంతో ఇష్టం. ఆయన సబ్జెక్టు చెప్పే తీరు అద్భుతం. జీవితా నికి వెలుగునిచ్చే ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరూ రుణపడాల్సిందే! బి. రామారావు, జాయింట్ కలెక్టర్ ‘ఉపాధ్యాయ’ కుటుంబం విజయనగరం అర్బన్: ఆ ఇల్లు ఉపాధ్యాయులకు పుట్టినిళ్లు. ఐదుగురు అన్నదమ్ములు, వాళ్లలోని ఇద్దరు భార్యలు ఉపాధ్యాయ వృత్తిలోనే స్థిరపడి ఆదర్శంగా నిలిచారు. జిల్లా సరిహద్దుల్లోని విశాఖ జిల్లా పద్మనాభం మండలం రెడ్డిపల్లి అగ్రహారం గ్రామానికి చెందిన రెడ్డిపల్లి సన్యాసిరావు, ఆది లక్ష్మి దంపతులకు ఐదుగురు కుమారులు. నిరాక్షరాస్యులైన వారు ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న గౌరవంతో పిల్లందర్నీ ఉపాధ్యాయ కోర్సులు చదివిం చారు. ప్రస్తుతం వారంతా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విజయనగరం, విశాఖ జిల్లాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్నారు. వీరిలో ఇద్దరి భార్యలు కూడా ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీనివాసరావు బొబ్బాదిపేట ప్రాథమికోన్నత పాఠశాలలోను, (డీఎస్సీ-1998), త్రినాథరావు డెంకాడ మండలం గొడిపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలోను (డీఎస్సీ-1998), ప్రసాదరావు విశాఖ జిల్లా రావికమ తం మండలం కన్నంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో (డీఎస్సీ-2008), అప్పలరాజు విశాఖ జిల్లా భీమిలి ప్రాథమికోన్నత ఫిషర్ మేన్ స్కూల్లో (డీఎస్సీ-2008), రమేష్ భోగాపురం మండలం దిబ్బలపాలెం ప్రాథమిక పాఠశాలలోనూ (డీఎస్సీ-2008) పని చేస్తున్నారు. అలాగే త్రినాథరావు భా ర్య బి. సుజాత గంట్యాడ మండలం రామవరం ఉన్నత పాఠశాలలో, అప్పలరాజు భార్య సంతోషికుమారి పద్మనాభం మండలం పొట్నూరు ప్రాథ మికోన్నత పాఠశాలలోనూ పని చేస్తున్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ప్రాధాన్యతను గుర్తెరిన వీరంతా ఉపాధ్యాయ నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ.. విద్యా సేవ చేస్తున్నారు.