కేఎంసీలో మెడికల్ సైన్స్ ఎగ్జిబిషన్
కేఎంసీలో మెడికల్ సైన్స్ ఎగ్జిబిషన్
Published Fri, Mar 17 2017 11:21 PM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM
- 21 నుంచి ఏప్రిల్ 4 వరకు
- 36 విభాగాల్లో స్టాల్స్
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజిలో ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వరకు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం కళాశాలలో విలేకరులకు వెల్లడించారు. గతంలో సిల్వర్‌జూబ్లీ, గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాల సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించామని, ప్రస్తుతం డైమండ్ ఉత్సవాలు(60 ఏళ్లు) సందర్భంగా ఆ అవకాశం వచ్చిందన్నారు. కళాశాల, ఆసుపత్రిలోని 36 విభాగాల వైద్య విద్యార్థులు ప్రదర్శనలో భాగంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారన్నారు.
లెక్చరర్ గ్యాలరీలో ఆయా విభాగాల ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగిన అభివృద్ధి గురించి తెలిపే షార్ట్‌ఫిల్మ్‌లు సైతం ప్రదర్శిస్తామన్నారు. డైమండ్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా నామ మాత్రపు ఫీజుతో కొన్ని రకాల వైద్యపరీక్షలు చేస్తామన్నారు. శరీర ధర్మాలు మొదలు వాటిపనితీరు, వ్యాధులు- వైద్య చికిత్సలు, ఆధునిక వైద్యవిధానాలపై రూపొందించిన ప్రదర్శనలు విజ్ఞానదాయకంగా ఉంటాయని తెలిపారు. రూ.20 నామమాత్రపు ప్రవేశరు సుముతో ప్రదర్శనను తిలకించే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి, ఆసుపత్రి ఏఆర్‌ఎంఓ డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement