సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోదీ | PM Narendra Modi Inaugurates Diamond Jubilee Celebrations Of Supreme Court | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోదీ

Published Sun, Jan 28 2024 1:10 PM | Last Updated on Sun, Jan 28 2024 2:57 PM

PM Narendra Modi In Diamond Jubilee Celebrations Of Supreme Court - Sakshi

ఢిల్లీ: సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొత్త వెబ్‌సైట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దీంతో దేశ పౌరులకు సుప్రీంకోర్టు డిజిటల్ నివేదికలు, తీర్పులు అందుబాటులోకి రానున్నాయి.

భారత సర్వోన్నత న్యాయస్థానం 75వ ఏడాదిలో అడుగుపెట్టింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు మొదటిసారిగా ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సుప్రీం వజ్రోత్సవ వేడుకలను ఆదివారం మధ్యాహ్నం ప్రధాని మోదీ ప్రారంభించారు. 

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంతో 1950 జనవరి 26నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. జనవరి 28 నుంచి దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రారంభమైంది. అప్పటి నుంచి దేశంలో ప్రాథమిక హక్కులను కాపాడటంలో సుప్రీం కీలక పాత్ర పోషిస్తోంది. రాజ్యంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న చట్టాలను సైతం సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది.

ఇదీ చదవండి: అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement