diamond jubilee
-
సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఢిల్లీ: సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొత్త వెబ్‌సైట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దీంతో దేశ పౌరులకు సుప్రీంకోర్టు డిజిటల్ నివేదికలు, తీర్పులు అందుబాటులోకి రానున్నాయి. భారత సర్వోన్నత న్యాయస్థానం 75వ ఏడాదిలో అడుగుపెట్టింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు మొదటిసారిగా ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సుప్రీం వజ్రోత్సవ వేడుకలను ఆదివారం మధ్యాహ్నం ప్రధాని మోదీ ప్రారంభించారు. #WATCH | PM Narendra Modi attends Diamond Jubilee celebrations of the Supreme Court of India pic.twitter.com/Ru2rFUb0pz — ANI (@ANI) January 28, 2024 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంతో 1950 జనవరి 26నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. జనవరి 28 నుంచి దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రారంభమైంది. అప్పటి నుంచి దేశంలో ప్రాథమిక హక్కులను కాపాడటంలో సుప్రీం కీలక పాత్ర పోషిస్తోంది. రాజ్యంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న చట్టాలను సైతం సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది. ఇదీ చదవండి: అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్ -
‘ప్రతిజ్ఞ’కు అరవై ఏళ్లు
చైనాతో 1962లో భారత్ యుద్ధం జరుగుతోంది. దేశ విభజన గాయాల నుంచి దేశం కోలుకుంటున్న ఆ తరుణంలోనే కొందరు స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని మరచిపోతున్నారు. ఇటువంటి పరిస్థితులు పైడిమర్రి వెంకట సుబ్బారావును తీవ్రంగా కలచి వేశాయి. పౌరులలో దేశభక్తిని పెంచడానికి తనవంతుగా ఏదో ఒకటి చేయాలని ఆయన బలంగా అనుకున్నారు. అప్పటికే చైనాలో విద్యార్థులలో దేశభక్తిని పెంచడానికి దేశభక్తి గీతాలు ఉన్నట్లు తెలిసి వెంటనే ఆయన తొమ్మిది వాక్యాల ‘ప్రతిజ్ఞ’ రాశారు. పైడిమర్రి 1962లో విశాఖపట్నంలో జిల్లా ‘ఖజానా’ అధికారిగా పనిచేస్తున్న రోజులవి. సెప్టెంబర్ 17న ఆయన ‘ప్రతిజ్ఞ’ రచన చేశారు. ఆయన మిత్రుడు తెన్నేటి విశ్వనాథం ప్రతిజ్ఞ ప్రతిని చూసి నాటి విద్యా శాఖ మంత్రి పీవీజీ రాజుకు చూపించడంతో ప్రతిజ్ఞ పదాలు విద్యార్థులలో దేశభక్తినీ, సోదరభావాన్నీ పెంచుతాయని భావించి... పాఠ్యపుస్తకాలలో చేర్చారు. 1964 నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాలలో ప్రతిజ్ఞ ముద్రితమవుతున్నది. అదే ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రతిజ్ఞను మిగతా భారతీయ భాషల్లోకి అనువాదం చేయించింది. 1965 జనవరి 26 నుండి దేశవ్యాప్తంగా విద్యాలయాల్లో ప్రతిజ్ఞను ఆలపిస్తున్నారు. కానీ రచయిత పేరును మాత్రం ముద్రించలేదు. 2011లో ఎలికట్టె శంకరరావు ‘ప్రతిజ్ఞ సృష్టికర్త పైడిమర్రి’ పేరుతో ఓ వ్యాసం రాశారు. రాష్ట్ర విభజన తరువాత 2015లో పైడిమర్రి పేరుని వివిధ వర్గాల వారి విజ్ఞప్తి మేరకు రెండు తెలుగు రాష్ట్రాల పాఠ్య పుస్తకాలలో ‘ప్రతిజ్ఞ’ ఎగువన ముద్రిస్తున్నారు. 1916 జూన్ 10న నల్లగొండ జిల్లాలోని అన్నేపర్తి గ్రామంలో పైడిమర్రి జన్మించారు. కవిగా, రచయితగా, నీతి నిజాయితీగల ప్రభుత్వ ఉద్యోగిగా, బహుభాషా కోవిదుడిగా ఆయన పేరు పొందారు. 1988 ఆగస్ట్ 13న పైడిమర్రి తుదిశ్వాస విడిచారు. ఇప్పటికి ‘ప్రతిజ్ఞ’ రాసి 60 ఏళ్లు అవుతోంది. – మందడపు రాంప్రదీప్, తిరువూరు (ఇది ‘ప్రతిజ్ఞ’ వజ్రోత్సవాల సంవత్సరం) -
పరుచూరి బ్రదర్స్‌కు జీవిత సాఫల్య పురస్కారం
మే 4న దర్శకరత్న డా. దాసరి నారాయణరావు 75వ జయంతి. ఈ సందర్భంగా అంతర్జాతీయ సాంస్కృతిక సాహితీ సేవాసంస్థ వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్, రేలంగి నరసింహారావు చైర్మన్‌గా ఏర్పడిన డా. దాసరి– వంశీ జీవిత సాఫల్య పురస్కారం కమిటీలు ఈ నెల 10న ప్రముఖ సినీరచయితలు పరుచూరి బ్రదర్స్ (పరుచూరి వెంకటేశ్వరరావు పరుచూరి గోపాలకృష్ణ)కు జీవిత సాఫల్య పురస్కారం అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటారని వంశీ వ్యవస్థాపక అధ్యక్షులు వంశీ రామరాజు పేర్కొన్నారు. -
గజ్జె ఘల్లుమంది.. గుండె జల్లుమంది
– కేఎంసీలో సాంస్కృతిక పోటీలు ప్రారంభం కర్నూలు(హాస్పిటల్): కర్నూలు వైద్యకళాశాల డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం సంగీత, సాహిత్య, నృత్యపోటీలు (సాంస్కృతిక పోటీలు) ప్రారంభమయ్యాయి. 15 రోజుల పాటు జరిగే ఈ పోటీలను రిటైర్డ్ డీఎంఈ, కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ ఎస్ఏ.సత్తార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యార్థుల్లో సాంస్కృతిక శోభ తగ్గిపోయిందన్నారు. నిత్యం వారు చదువుకే ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ఆటలు, పాటలు, మంచి సాహిత్యం వల్ల వారు జీవితంలో మరింతగా రాణిస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆ దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం వైద్యవిద్యార్థినిలు హర్షిణి బృందంచే గణేష కేతంచే పోటీలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఆర్థోపెడిక్ హెచ్‌వోడి డాక్టర్ రఘునందన్ ఆలపించిన అలనాటి సినీగీతం ‘ఈ దివిలో విరిసిన పారిజాతమో...’ పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అలనాటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి యువనటుల సినిమాల వరకు గీతాలను కూర్చి వైద్యవిద్యార్థులు నృత్యం చేశారు. ఆ తర్వాత ఫిజియాలజి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పావని శాస్త్రీయ నృత్యప్రదర్శన అలరించింది. 2012 బ్యాచ్ వైద్యవిద్యార్థిని సాయిహారిక ఆలపించిన సినీగీతం, సాహితి, వెన్నెల, భరత్, శ్రీహర్ష గ్రూప్ డ్యాన్స్ ఆకట్టుకుంది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణానాయక్, డాక్టర్ పి. చంద్రశేఖర్, ఆకాశవాణి అనౌన్సర్ పోతన, డాక్టర్ బాలమద్దయ్య, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ గెలివి సహదేవుడు తదితరులు పాల్గొన్నారు. -
కేఎంసీలో మహిళా క్రీడలు ప్రారంభం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాల డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం కళాశాలలోని ఉమెన్స్ హాస్టల్లో విద్యార్థినులు, సిబ్బందికి టెన్నికాయిట్ క్రీడలను ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తితో ఆటలు ఆడాలని సూచించారు. అనంతరం ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి, వార్డెన్ డాక్టర్ స్వర్ణలత, డిప్యూటీ వార్డెన్ డాక్టర్ మాధవీశ్యామల, వైద్యులు ఎస్. లక్ష్మి, ఎ. పద్మవిజయశ్రీ, రేవతి, ఫిజికల్ డైరెక్టర్ రామకృష్ణప్రసాద్ పాల్గొన్నారు. -
సైన్స్ ఎగ్జిబిషన్ విజయవంతం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాల డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ విజయవంతమైందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ చెప్పారు. గురువారం కళాశాలలోని నూతన లెక్చరర్ గ్యాలరీలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ మాట్లాడుతూ 20 రోజుల పాటు కొనసాగిన ఎగ్జిబిషన్లో 35 విభాగాలు అద్భుత ప్రదర్శన కనబరిచాయన్నారు. జిల్లా నుంచి గాక రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సైతం సందర్శకులు ప్రదర్శన చూసేందుకు రావడం ఆనందదాయకమన్నారు. ప్రతి విభాగం ఎంతో ఉత్సాహంగా పనిచేయడం వల్లే ఇది విజయవంతం అయ్యిందన్నారు. అనంతరం రిటైర్డ్ డీఎంఈ డాక్టర్ ఎస్ఏ సత్తార్, డాక్టర్ వెంకటేష్ మాట్లాడారు. చివరగా వివిధ అంశాల్లో ప్రతిభ కనపరిచిన విభాగాధిపతులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు శ్రీదేవి, ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్లు కృష్ణానాయక్, పి. చంద్రశేఖర్, ప్రాంతీయ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్రనాథ్‌రెడ్డి, ఎగ్జిబిషన్ ఇన్‌ఛార్జి జోజిరెడ్డి, పి. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
విజ్ఞాన ప్రదర్శనలతో నైపుణ్యాభివృద్ధి
- త్వరలో రాష్ట్ర క్యాన్సర్ యూనిట్ కర్నూలులో ఏర్పాటు – డీఎంఈ డాక్టర్ సుబ్బారావు కర్నూలు (హాస్పిటల్): విజ్ఞాన ప్రదర్శనలతో వైద్యవిద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి జరుగుతుందని వైద్య విద్య సంచాలకులు డాక్టర్ సుబ్బారావు అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజి 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం కళాశాలలో సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞాన ప్రదర్శనలతో వైద్య విద్యార్థుల్లో సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయన్నారు. ఇప్పటి విద్యార్థులకు ఈ రెండు విషయాల్లో నైపుణ్యాలు చాలా అవసరమని చెప్పారు. వారు వైద్య విద్య పూర్తి చేసుకుని బయటకు వచ్చాక ఎవరితో ఎలా మాట్లాడాలో, రోగులతో ఎలా వ్యవహరించాలో కూడా తెలియడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు అంశాల గురించి వారు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఇలాంటి ఎగ్జిబిషన్లతో ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కలుగుతుందన్నారు. శరీర నిర్మాణం, వ్యాధులు, దాని నివారణ, చికిత్స గురించి తెలుస్తాయన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో వార్షికోత్సవాలు, సైన్స్ ఎగ్జిబిషన్లకు ప్రత్యేక నిధులు కేటాయించే విషయం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలోని సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు లేవని, దీనివల్ల డీఎం, ఎంసీహెచ్ సీట్లకు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనన్నారు. ఈ విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి చోటా ఎంసీహెచ్ (మాతాశిశు భవనం)కు రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రుల్లో ఇటీవల ఓపీ బాగా పెరిగిందన్నారు. అనంతపురం మెడికల్ కళాశాలలో సూపర్‌స్పెషాలిటీ విభాగాలను ప్రారంభించామని, దీనివల్ల కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలపై భారం తగ్గుతుందని చెప్పారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో త్వరలో ఎమర్జెన్సీ మెడిసిన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పీడియాట్రిక్, గైనిక్ విభాగాల్లో ప్రస్తుతమున్న నాలుగు యూనిట్ల స్థానంలో ఆరు యూనిట్లు పెంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. రాష్ట్ర క్యాన్సర్ ఇన్సిట్యూట్‌ను కర్నూలులో త్వరలో ప్రారంభమవుతుందని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ శ్రీదేవి, ఏఆర్ఎంవో డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్, ప్రొఫెసర్లు జోజిరెడ్డి, పి.చంద్రశేఖర్, చంద్రశేఖర్, శంకరశర్మ, కైలాష్‌నాథ్‌రెడ్డి, కృష్ణనాయక్, శ్రీహరి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కేఎంసీలో మెడికల్ సైన్స్ ఎగ్జిబిషన్
- 21 నుంచి ఏప్రిల్ 4 వరకు - 36 విభాగాల్లో స్టాల్స్ కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజిలో ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వరకు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం కళాశాలలో విలేకరులకు వెల్లడించారు. గతంలో సిల్వర్‌జూబ్లీ, గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాల సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించామని, ప్రస్తుతం డైమండ్ ఉత్సవాలు(60 ఏళ్లు) సందర్భంగా ఆ అవకాశం వచ్చిందన్నారు. కళాశాల, ఆసుపత్రిలోని 36 విభాగాల వైద్య విద్యార్థులు ప్రదర్శనలో భాగంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తారన్నారు. లెక్చరర్ గ్యాలరీలో ఆయా విభాగాల ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగిన అభివృద్ధి గురించి తెలిపే షార్ట్‌ఫిల్మ్‌లు సైతం ప్రదర్శిస్తామన్నారు. డైమండ్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా నామ మాత్రపు ఫీజుతో కొన్ని రకాల వైద్యపరీక్షలు చేస్తామన్నారు. శరీర ధర్మాలు మొదలు వాటిపనితీరు, వ్యాధులు- వైద్య చికిత్సలు, ఆధునిక వైద్యవిధానాలపై రూపొందించిన ప్రదర్శనలు విజ్ఞానదాయకంగా ఉంటాయని తెలిపారు. రూ.20 నామమాత్రపు ప్రవేశరు సుముతో ప్రదర్శనను తిలకించే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి, ఆసుపత్రి ఏఆర్ఎంఓ డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.