ఏపీ ఉన్నత విద్యామండలి రికార్డులను తెలంగాణ ఉన్నత విద్యామండలి బుధవారం అప్పగించింది.
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఉన్నత విద్యామండలి రికార్డులను తెలంగాణ ఉన్నత విద్యామండలి బుధవారం అప్పగించింది. హైకోర్టు తీర్పుతో ఏపీ ఉన్నత విద్యామండలి కార్యాలయ భవనాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి స్వాధీనం చేసుకొన్న సంగతి తెలిసిందే. తరువాత ఏపీ మండలి హాకా భవనంలో కార్యకలాపాలను కొనసాగిస్తోంది. వివిధ సెట్ల నిర్వహణ, ప్రవేశాల కోసం రికార్డులు అప్పగించాలని ఏపీ మండలి ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకపోయింది.
ఈ వ్యవహారంపై సుప్రీంలో కేసు ఉండటంతో రికార్డులు తీసుకువెళ్లాలంటూ ఎట్టకేలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏపీ మండలికి లేఖ పంపింది. ఈ మేరకు ఇరు మండళ్ల ైవె స్ చైర్మన్లు ప్రొఫెసర్లు విజయప్రకాశ్, నరసింహారావు, వెంకటాచలం, మల్లేశ్‌లు చర్చించి రికార్డుల జాబితా రూపొందించారు. వాటిలో కొన్ని ఫైళ్లను ఏపీ మండలి అధికారులు తీసుకువెళ్లారు.