'మణిదీప్ ఆత్మహత్యకు వర్సీటీ సభ్యులే కారణం' | telugu students lauches dharna over student manideep suicide at BML munjal university | Sakshi
Sakshi News home page

'మణిదీప్ ఆత్మహత్యకు వర్సీటీ సభ్యులే కారణం'

Published Thu, Feb 16 2017 3:39 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

telugu students lauches dharna over student manideep suicide at BML munjal university

హర్యానా: బీఎంఎల్ ముంజాల్ వర్సిటీలో తెలుగు విద్యార్థులు ధర్నాకు దిగారు. విద్యార్థి మణిదీప్‌ ఆత్మహత్యకు యూనివర్సిటీ సభ్యులే కారణమని ఆరోపించారు. క్యాంపస్ లో భైఠాయించిన విద్యార్థులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాజమాన్య నిర్లక్ష్యపు వైఖరి, అదనపు ఫీజుల కోసం ఒత్తిడి చేయడంతోనే మణిదీప్‌ అఘాయిత్యానికి ఒడిగట్టాడని అన్నారు. విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలు దోచుకుంటూ నాణ్యమైన విద్యను అందించడంలేదని మండిపడ్డారు.
 
కాగా ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి మణిదీప్‌ సొంత ఊరు ఖమ్మం జిల్లా వైరా. మణిదీప్‌ ఆత్మహత్య విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు హుటాహుటిన విశ్వవిద్యాలయానికి బయల్దేరి వెళ్లారు. తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని, మృతిపై అనుమానాలున్నాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement