manideep
-
డకౌట్ల విషయంలో పరువు తీసుకున్న కేకేఆర్ బ్యాటర్
కేకేఆర్ బ్యాటర్ మణిదీప్ సింగ్ డకౌట్ల విషయంలో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా మణిదీప్ సింగ్ నిలిచాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో డేవిడ్ విల్లే బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన మణిదీప్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. కాగా ఐపీఎల్లో మణిదీప్‌కు ఇది 15వ డకౌట్ కావడం గమనార్హం. ఇక మణిదీప్ తర్వాత ఆర్సీబీ బ్యాటర్ దినేశ్ కార్తిక్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మలు 14 సార్లు డకౌట్ అయి రెండో స్థానంలో ఉండగా.. పార్థివ్ పటేల్, అజింక్యా రహానే, అంబటి రాయుడులు 13సార్లు డకౌట్‌గా వెనుదిరిగారు. Two in Two by David Willey! A double wicket maiden by @david_willey 🔥🔥 Venkatesh Iyer and Mandeep Singh depart. Live - https://t.co/V0OS7tFZTB #TATAIPL #KKRvRCB #IPL2023 pic.twitter.com/FjuJoHWzLH — IndianPremierLeague (@IPL) April 6, 2023 చదవండి: Dinesh Karthik: కార్తిక్ తెలివికి కెప్టెన్ డుప్లెసిస్ ఫిదా -
ఆదుకోండి
దిల్సుఖ్నగర్: చదువు కోవాలనే తపన ఉన్నా అమ్మానాన్నలు లేకపోవటంతో అనాథ అయి ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు మణిదీప్ రెడ్డి. వరంగల్ జిల్లా బచ్చన్న పేట మండలం, కేశిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన మణిదీప్, అతని సోదరుడు శశిధర్ రెడ్డిల తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోగా వారిని ఎల్బీనగర్లోని అనాథ విద్యార్థి గృహం నిర్వాహకుడు మార్గం రాజేశ్ చేరదీసి వారి బాగోగులు చూస్తున్నారు. మణిదీప్ రెడ్డి టెన్త్ లో 80 శాతం మార్కులతో ఉప్పల్ సెయింట్ మార్క్స్ స్కూల్, ఇంటర్ 81 శాతంతో దిల్సుఖ్నగర్ ప్రణతి కాలేజీలో, డిగ్రీని 87 శాతంతో చిక్కడపల్లి అరోరా కళాశాలలో ఉత్తీర్ణుడయ్యాడు. అనంతరం నారాయణగూడ ఐఎంఎస్ అకాడమీ ఉచిత కోచింగ్‌లో ఎంబీఏ కోర్స్ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో 90.8 శాతం మార్కులతో మహారాష్ట్ర పూనెకు చెందిన ఐబీఎస్ క్యాంపస్‌లో రెండేళ్ల కోర్స్‌కు సీట్ సాధించాడు. ప్రస్తుతం అనాథ విద్యార్థి గృహం మణిదీప్‌కు అండగా నిలిచినా.. కోర్స్ పూర్తి చేసేందుకు మొత్తం రూ.11.31 లక్షల ఖర్చు అవుతుందని తెలిపారు. దాతలు సహకరించి మణిదీప్‌కు అండగా నిలవాలని విద్యార్థి గృహం నిర్వాహకుడు మార్గం రాజేశ్ విన్నవిస్తున్నారు. -
హరియాణాలో ఖమ్మం విద్యార్థి ఆత్మహత్య
బీఎంఎల్ వర్సిటీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న మణిదీప్ సాక్షి, న్యూఢిల్లీ: హరియాణాలోని గురుగా వ్‌లో ఉన్న బీఎంఎల్ ముంజాల్ యూని వర్సిటీలో బీటెక్ చదువుతున్న మణిదీప్ రంగా అనే తెలుగు విద్యార్థి బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన మణిదీప్ ఇటీవల జరిగిన బీటెక్ ఫస్టియర్ పరీక్షల్లో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపం చెంది బుధవారం రాత్రి అతను ఆత్మహత్య చేసు కున్నట్లు సమాచారం. ఈ ఘటనపై వర్సిటీలో చదువుతున్న ఇతర తెలుగు విద్యార్థులు ధర్నాకు దిగారు. వర్సిటీలో సరైన ఫ్యాకల్టీ, విద్యా బోధన లేదని నిరసన చేపట్టారు. అదనపు ఫీజులు వసూలు చేయాలనే దురుద్దేశంతో యాజమాన్యం కావాలనే విద్యార్థులను పరీక్షల్లో ఫెయిల్ చేస్తోందని ఆరోపిం చారు. దీనిపై వర్సిటీ డీన్ స్పందిస్తూ విద్యార్థి ఆత్మహత్యకు పరీక్షల్లో తప్పడం కారణం కాకపోవచ్చని, ఇతర కారణాల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉండొ చ్చని పేర్కొన్నా రు. విద్యార్థి మరణవార్తను తల్లిదండ్రులకు తెలియజేశామని, మృతదేహాన్ని స్వగ్రామా నికి తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలీసులు మణిదీప్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. -
'మణిదీప్ ఆత్మహత్యకు వర్సీటీ సభ్యులే కారణం'
హర్యానా: బీఎంఎల్ ముంజాల్ వర్సిటీలో తెలుగు విద్యార్థులు ధర్నాకు దిగారు. విద్యార్థి మణిదీప్ ఆత్మహత్యకు యూనివర్సిటీ సభ్యులే కారణమని ఆరోపించారు. క్యాంపస్ లో భైఠాయించిన విద్యార్థులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాజమాన్య నిర్లక్ష్యపు వైఖరి, అదనపు ఫీజుల కోసం ఒత్తిడి చేయడంతోనే మణిదీప్ అఘాయిత్యానికి ఒడిగట్టాడని అన్నారు. విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలు దోచుకుంటూ నాణ్యమైన విద్యను అందించడంలేదని మండిపడ్డారు. కాగా ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి మణిదీప్ సొంత ఊరు ఖమ్మం జిల్లా వైరా. మణిదీప్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు హుటాహుటిన విశ్వవిద్యాలయానికి బయల్దేరి వెళ్లారు. తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని, మృతిపై అనుమానాలున్నాయని చెప్పారు. -
ఢిల్లీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
వైరా: ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి ఢిల్లీలోని బీఎమ్‌ఎల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని వైరా పట్టణానికి చెందిన రంగ క్రిష్ణారావు కుమారుడు మణిదీప్(18) ఢిల్లీలోని బీఎమ్‌ఎల్ యూనివర్సిటీలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కాగా బుధవారం క్యాంపస్‌లోని తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని, మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.