ఢిల్లీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య | telangana student commits suicide in BML university | Sakshi

ఢిల్లీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

Published Thu, Feb 16 2017 2:52 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి ఢిల్లీలోని బీఎమ్‌ఎల్‌ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు.

వైరా: ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి ఢిల్లీలోని బీఎమ్‌ఎల్‌ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని వైరా పట్టణానికి చెందిన రంగ క్రిష్ణారావు కుమారుడు మణిదీప్‌(18) ఢిల్లీలోని బీఎమ్‌ఎల్‌ యూనివర్సిటీలో బీటెక్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కాగా బుధవారం క్యాంపస్‌లోని తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని, మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement