'వాళ్లవి పసలేని విమర్శలు' | thummala nageswara rao slams on congress | Sakshi
Sakshi News home page

'వాళ్లవి పసలేని విమర్శలు'

Published Sat, Jul 25 2015 1:49 PM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM

thummala nageswara rao slams on congress

భద్రాచలం(ఖమ్మం): రాష్ట్రంలో ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు పసలేనివని తెలంగాణ రహదారులు, పర్యాటక శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిప్పికొట్టారు. ఆయన శనివారం ఖమ్మం జిల్లా భద్రాచలంలో విలేకరులతో మాట్లాడారు. ప్రాణహిత-చేవెళ్ల తదితర పథకాలకు సంబంధించి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన తాజా మార్పులతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన చెప్పారు. గతంలో పాలకులు స్వప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన తాజా మార్పులపై కాంగ్రెస్, టీడీపీ నేతలు చేస్తున్నదంతా విషపూరిత ప్రచారమని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement