శ్రీకాకుళం జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు.
రోజు రోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతోంది. వడదెబ్బకు గురై ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నిమగామ్ గ్రామానికి చెందిన భద్రయ్య(58) సముద్రంలో స్నానం చేసి తిరిగి వస్తుండగా.. వడదెబ్బకు గురై కుప్పకూలిపోయాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించడానికి యత్నించగా.. అప్పటికే మృతిచెందాడు. ఇదిలా ఉండగా.. పలాసలోని ఉదయపురానికి చెందిన వృద్ధురాలు వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది.