కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్
ఆర్మూర్: రానున్న నాలుగేళ్ల వరకు యూరియా ధర పెరగకుండా చూస్తామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం తెలిపారు. యూరియా ఉత్పత్తిని సైతం పెంచుతున్నామన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడ్‌లో పుష్కర స్నానం చేశారు. అక్కడి నుంచి రెంజల్ మండలంలోని కందకుర్తికి వెళ్తూ ఆర్మూర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు.
రైతుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంలో భాగంగా మేకిన్ ఇండియా నినాదంతో స్థానిక పరిశ్రమ రంగంలో ఉత్పత్తిని పెంచుతున్నామన్నారు.
ఫిరాయింపు చట్టాన్ని అమలు చేయాలి..
పార్టీలను ఫిరాయిస్తున్న ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ టీఆర్‌ఎస్‌లో చేరే ముందు రాజీనామా పత్రాన్ని స్పీకర్ కార్యాలయానికి పంపించానని అన్నారని గుర్తు చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకుంటే స్పీకర్ కార్యాలయానికి అతని రాజీనామా ఇప్పటి వరకు అందలేదని స్పష్టమైందన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ స్పష్టమైన సమాధానం చెప్పాలన్నారు.
నాలుగేళ్ల వరకు యూరియా ధరలు పెరగవు
Published Mon, Jul 20 2015 1:26 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
Advertisement