Minister Hansraj gangaram
-
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు లేనట్లే
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచడం కుదరదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విభజన చట్టాన్ని సవరించినా సీట్ల పెంపు సాధ్యంకాదని రాజ్యసభలో కేంద్ర మంత్రి హన్స్ రాజ్ గంగారామ్ తేల్చిచెప్పారు. విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాలను పెంచాలని ఏపీ, తెలంగాణ కేంద్రాన్ని కోరాయి. 2026లో నియోజక వర్గాల పునర్విభజన జరగాల్సివుండగా, రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ముందుగానే సీట్లు పెంచాలని తెలుగు రాష్ట్రాలు కోరాయి. అసెంబ్లీ సీట్ల పెంపుపై టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్ రాజ్ గంగారామ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాజ్యాంగపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం అటార్నీ జనరల్ వివరణ కోరగా, తెలుగు రాష్ట్రాల్లో నియోజక వర్గాల పెంపు కుదరదని కేంద్రానికి అటార్నీ జనరల్ నివేదిక ఇచ్చారు. నియోజక వర్గాలు పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని అటార్నీ జనరల్ చెప్పారు. కేంద్ర మంత్రి ఈ విషయాన్ని సభలో తెలిపారు. -
నాలుగేళ్ల వరకు యూరియా ధరలు పెరగవు
కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ ఆర్మూర్: రానున్న నాలుగేళ్ల వరకు యూరియా ధర పెరగకుండా చూస్తామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం తెలిపారు. యూరియా ఉత్పత్తిని సైతం పెంచుతున్నామన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడ్‌లో పుష్కర స్నానం చేశారు. అక్కడి నుంచి రెంజల్ మండలంలోని కందకుర్తికి వెళ్తూ ఆర్మూర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంలో భాగంగా మేకిన్ ఇండియా నినాదంతో స్థానిక పరిశ్రమ రంగంలో ఉత్పత్తిని పెంచుతున్నామన్నారు. ఫిరాయింపు చట్టాన్ని అమలు చేయాలి.. పార్టీలను ఫిరాయిస్తున్న ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ టీఆర్ఎస్లో చేరే ముందు రాజీనామా పత్రాన్ని స్పీకర్ కార్యాలయానికి పంపించానని అన్నారని గుర్తు చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకుంటే స్పీకర్ కార్యాలయానికి అతని రాజీనామా ఇప్పటి వరకు అందలేదని స్పష్టమైందన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ స్పష్టమైన సమాధానం చెప్పాలన్నారు.