'కండువాలు కప్పే శ్రద్ధ పాలనపై ఏది' | Women leaders in Congress have criticized the government TRS | Sakshi
Sakshi News home page

'కండువాలు కప్పే శ్రద్ధ పాలనపై ఏది'

Published Wed, Mar 2 2016 7:26 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Women leaders in Congress have criticized the government TRS

ఇతర పార్టీల నాయకులకు కండువాలు కప్పడంలో ఉన్న శ్రద్ధ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పాలనపై లేదని మాజీ మంత్రులు విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డి బృందం బుధవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో అత్యాచార బాధితురాలిని వీరు పరామర్శించారు. తిరుగు ప్రయాణంలో జమ్మికుంటలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఓ యువతిపై అత్యాచారం జరిగినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని, కేసును పక్కదారి పట్టించే యత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాధితురాలికి రూ.కోటి రూపాయల పరిహారం, పోలీసు ఉద్యోగంతోపాటు ఐదెకరాల భూమి పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement