రాజ్యాంగంలోని 226 అధికరణం కింద అధికారాలను ఎప్పుడు వాడొచ్చు?
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంలోని 226 అధికరణం కింద హైకోర్టుకున్న విసృ్తత అధికారాలను ఏయే సందర్భాల్లో.. ఎలా వినియోగించాలన్న విషయంపై ఉమ్మడి హైకోర్టు తీర్పును వారుుదా వేసింది. 226 అధికరణం కింద హైకోర్టుకు విసృ్తత అధికారాలున్నప్పటికీ, ఆ అధికారాలను క్రిమినల్ కేసుల్లో బెరుుల్ మంజూరు చేసేందుకు సైతం వాడొచ్చా? అన్న విషయాన్ని తాము వెలువరించబోయే తీర్పులో తేలుస్తామని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీ క్యూనెట్, దాని అనుబంధ సంస్థ విహాన్ డెరైక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు మైఖేల్ జోసెఫ్ ఫెరీరా, మాల్కమ్ ఎన్.దేశాయ్, ఎం.వి.బాలాజీ, శ్రీనివాసరావు వంకా, నోజర్ కె.దేశాయ్ తదితరులు ఉద్యోగాల పేరుతో మోసం చేశారంటూ వివిధ రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యారుు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదయ్యారుు. ఈ కేసులపై వారు హైకోర్టును ఆశ్రరుుంచారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ రాజా ఇలంగో ఈ కేసుల్లో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేశారు. అదే విధంగా వీరికి షరతులతో కూడిన బెరుుల్ మంజూరు చేయాలని కింది కోర్టును ఆదేశిస్తూ ఈ నెల 4న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై శుక్రవారం ధర్మాసనం విచారణ జరిపింది.
226 కింద బెరుుల్ ఉత్తర్వులు సరికాదు: హోంశాఖ న్యాయవాది వేణుగోపాల్ వాదిస్తూ... క్యూనెట్, విహాన్ ప్రతినిధులు దేశవ్యాప్తంగా రూ.9వేల కోట్ల మేర 5లక్షల మంది ఖాతాదారులను మోసం చేశారన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రతినిధులకు బెరుుల్ మంజూరు చేయాల్సిందిగా సూచిస్తూ, సింగిల్ జడ్జి 226 అధికరణంలోని అధికారాలతో దిగువ కోర్టుకు ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, అధికరణం 226 కింద దాఖలైన పిటిషన్‌లో బెరుుల్ కోసం కోర్టు ఉత్తర్వులు ఎలా ఇవ్వగలదని ప్రశ్నించింది.అధికరణం 226 కింద హైకోర్టుకు విసృ్తత అధికారం ఉన్నప్పటికీ దానిని వాడే విషయంలో పలు పరిమితులు ఉన్నాయంది.
ఎవ్వరూ ప్రశ్నించజాలరు: పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన ఎస్.నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ, అధికరణం 226 కింద హైకోర్టుకున్న విసృ్తత అధికారాలను ఏ ఒక్కరూ ప్రశ్నించజాలరన్నారు. 226 కింద దాఖలు చేసిన పిటిషన్‌లో కూడా బెరుుల్ కోసం ఉత్తర్వులు జారీ చేయవచ్చునని తెలిపారు. పిటిషనర్లపై పలు ప్రాంతాల్లో బహుళ ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యా యని, పోలీసులు అన్ని కేసుల్లోనూ అరెస్ట్ చేసి దేశమంతా తిప్పాలని చూస్తున్నారని, ఈ నేపథ్యంలో వారి హక్కుల రక్షణ కోసం హైకోర్టును ఆశ్రరుుంచారని నిరంజన్‌రెడ్డి తెలిపారు.
విసృ్తతాధికారాలు సరే: ధర్మాసనం స్పందిస్తూ, ‘మీరు చెబుతున్నది నిజమే.. హైకోర్టుకున్న విసృ్తత అధికారాలను ఎవ్వరూ ప్రశ్నించజాలరు. కాని ఆ విసృ్తత అధికారులను ఎలాపడితే అలా ఇష్టమొచ్చినట్లు వాడొచ్చా? 482 ఉండగా, 226 కింద బెరుుల్ ఇచ్చే అధికారం ఉందా? మేజిస్ట్రేట్ నిర్వర్తించాల్సిన బాధ్యతలను 226 కింద మేం లాగేసుకోవచ్చా? అలా లాగేసుకునేంత అసాధారణ పరిస్థితులు ఈ కేసులో ఏమున్నారుు? తమకు కావాల్సింది ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రమే’నని తెలిపింది.
‘226’పై కీలక ప్రశ్నను లేవనెత్తిన ఉమ్మడి హైకోర్టు
Published Sat, Nov 12 2016 3:43 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement