హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం | 4 family members died in road accident | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

Published Mon, Dec 12 2016 5:58 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

4 family members died in road accident

హైదరాబాద్: కడ్తాల్ మండలం గండిమైసమ్మ దేవస్థానం సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ ఎదురుగా వస్తోన్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలానికి చేరుకున్న పోలీసులు మృతులు నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబటి పల్లి గ్రామానికి చెందిన ఏదుల కృష్ణయ్య(35), హైమావతి(30), ఇద్దరు చిన్నారులుగా గుర్తించారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భీకర వాతావరణం ఏ‍ర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement