ఓపెన్ ఎస్సెస్సీలో 43.39 శాతం ఉత్తీర్ణత | 43.39 percent pass in the open ASC | Sakshi
Sakshi News home page

ఓపెన్ ఎస్సెస్సీలో 43.39 శాతం ఉత్తీర్ణత

Published Wed, Jun 1 2016 4:38 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

ఓపెన్ ఎస్సెస్సీలో 43.39 శాతం ఉత్తీర్ణత

ఓపెన్ ఎస్సెస్సీలో 43.39 శాతం ఉత్తీర్ణత

- ఇంటర్మీడియెట్‌లో 49.69 శాతం..
- రెండింటిలోనూ బాలికల హవా
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో గత మార్చి/ఏప్రిల్ నెలల్లో నిర్వహించిన ఓపెన్ ఎస్సెస్సీ, ఓపెన్ ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను మంగళవారం సచివాలయంలో విడుదల చేశారు. ఓపెన్ ఎస్సెస్సీ పరీక్షల్లో 43.39% మంది, ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో 49.69% మంది ఉత్తీర్ణులయ్యారు. పది రోజుల్లోగా మెమోలను సంబంధిత విద్యా సంస్థలకు పంపిస్తారు. అలాగే విద్యార్థుల మార్కుల జాబితాలను వెబ్‌సైట్‌లో (telanganaopenschool.org) అందుబాటులో ఉంచుతారు. మెమోల్లో ఏమైనా పొరపాట్లు దొర్లితే ఈనెల 9లోగా ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్, జవాబు పత్రాల జిరాక్స్ కాపీ కోసం 4 నుంచి 13వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. రీ కౌంటింగ్ కోసం సబ్జెక్టుకు రూ.100, రీ వెరిఫికేషన్, జవాబు పత్రాల జిరాక్స్ కాపీ కోసం రూ.1,000 చొప్పున ఏపీ ఆన్‌లైన్/మీసేవా కేంద్రాల్లో చెల్లించాలి. మరిన్ని వివరాలకు 9030889097 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చు.

 బాలికల హవా: ఓపెన్ ఎస్సెస్సీ, ఓపెన్ ఇంటర్‌లో బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. ఓపెన్ ఎస్సెస్సీలో 14,864 మంది బాలికలు పరీక్షలకు హాజరు కాగా 7,168 మంది (48.22 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 36,335 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా, 15,046 మంది (41.41 శాతం) ఉత్తీర్ణులయ్యారు. సంఖ్య పరంగా మాత్రం బాలురు ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్‌లో 17,377 మంది బాలికలు పరీక్షలకు హాజరు కాగా, 9,328 మంది (53.68 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 35,137 మంది పరీక్షలకు హాజరు కాగా 16,767 మంది (47.72 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

Advertisement
Advertisement