‘ఓపెన్’గా చదువుకోండిలా | open tenth & intermediate coureses to apply in online | Sakshi
Sakshi News home page

‘ఓపెన్’గా చదువుకోండిలా

Published Mon, Oct 27 2014 2:30 AM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM

‘ఓపెన్’గా చదువుకోండిలా - Sakshi

‘ఓపెన్’గా చదువుకోండిలా

చదువు మధ్యలో ఆపేసినా.. ఇతర పనుల కారణంగా ఇంటి వద్దే ఉండి చదువుకోవాలనుకున్నా.. ఓపెన్ స్కూల్‌తో సాధ్యమే..

పదో తరగతి...
ఓపెన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రభుత్వం 1991వ సంవత్సరంలో ప్రారంభించింది. 2008-09 విద్యా సంవత్సరంలో ఈ స్కీము ద్వారా నూతనంగా పదో తరగతి కోర్సును ప్రవేశపెట్టింది. ఇది నియత పాఠశాలలో పదోతరగతికి సమానం.
 
ఇంటర్మీడియట్...

ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్‌లో ఉత్తీర్ణులైన వారితోపాటు నియత పాఠశాలలో పదోతరగతి పూర్తి చేసి వివిధ కారణాలతో ఇంటర్మీడియట్ చదువుకోలేని విద్యార్థులకు సార్వత్రిక విధానంలో కూడా ఇంటర్మీడియట్ కోర్సు అందించాలనే ఉద్దేశంతో ఓపెన్ ఇంటర్మీడియట్ కోర్సును ప్రారంభించింది.

ప్రత్యేకతలు...
సార్వత్రిక దూర విద్యా విధానం
స్వేచ్ఛాయుత విద్యా విధానం
అధ్యయన కేంద్రాల్లో సెలవు రోజుల్లో మాత్రమే తరగతుల నిర్వహణ.
ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ లేక ఓపెన్ స్కూల్ ప్రత్యేకంగా రూపొందించిన స్వయం అధ్యయన సామగ్రి పంపిణీ.
అభ్యాసకులు వృత్తి విద్యా సబ్జెక్టును గ్రూప్ (సి) నుంచి ఒక ఐచ్ఛిక సబ్జెక్టుగా ఎంచుకునే అవకాశం.
 
కనీస ప్రవేశ వయస్సు/అర్హత
టెన్త్‌లో చేరేందుకు కనీస వయస్సు 14 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
ఇంటర్మీడియెట్‌కు కనీస వయస్సు 15 సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితి లేదు.
టెన్త్ కోర్సుకు కనీస విద్యా నైపుణ్యాలు కలిగి ఉండాలి.
ఇంటర్మీడియట్ కోర్సుకు గుర్తింపు పొందిన ఏదైనా బోర్డు నుంచి పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
 
భాషలు..
టెన్త్ తెలుగు ,ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, ఒరియా భాషల్లో...
ఇంటర్మీడియట్ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో..

బోధనా విషయాలు...
టెన్త్/ఇంటర్మీడియట్-ఓపెన్ స్కూల్‌లో బోధనా విషయాలను మూడు గ్రూపులుగా విభజిస్తారు.
గ్రూపు(ఎ) భాషలు, గ్రూపు(బి) మెయిన్ సబ్జెక్టులు, గ్రూపు(సి) వృత్తి విద్యా కోర్సులు
అభ్యాసకులే స్వయంగా బోధన విషయాలను ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంది.
 
కోర్సుల కాలపరిమితి
ఓపెన్ స్కూల్‌లో నమోదైన విద్యా సంవత్సరం చివరిలో (ఏప్రిల్/ మే)లో పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్‌లో అన్ని పరీక్షలు (5 లేక 6 సబ్జెక్టులు) రాయడానికి టెన్త్ ఉత్తీర్ణత సాధించిన నాటి నుంచి ఇంటర్మీడియట్ తుది పరీక్షల వరకు కనీసం రెండు సంవత్స రాల కాల వ్యవధి ఉండాలి.
 
అభ్యాసకులకు తరగతులు...
ఓపెన్ స్టడీ సెంటర్‌లో సెలవు రోజులతోపాటు రెండో శనివారం, ప్రతి ఆదివారాల్లో అభ్యాసకులకు 30 కాంట్రాక్ట్ తరగతులు, నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్ ఉన్న సబ్జెక్టులకు అదనంగా 48 రోజులు తరగతులు నిర్వహిస్తారు.
 
టెన్త్ ప్రవేశ రుసుం
పదో తరగతి: రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100(అందరికీ)
అడ్మిషన్ ఫీజు: జనరల్ కేటగిరి పురుషులు రూ.1000.
ఇతరులు: స్త్రీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఎక్స్‌సర్వీస్‌మెన్ పిల్లలకు, వికలాంగులకు రూ.600.
 
ఇంటర్‌కు...
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 200(అందరికీ)
అడ్మిషన్ ఫీజు: జనరల్ కేటగిరి పురుషులకు రూ.1,100.
ఇతరులు: స్త్రీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఎక్స్‌సర్వీస్‌మెన్ పిల్లలు, వికలాంగులకు రూ.800.

దరఖాస్తు ఎక్కడ పొందాలి?
ఓపెన్ స్కూల్ అప్లికేషన్ ఫారం, ప్రాస్పెక్టస్‌ను నిర్ణీత తేదీల్లో ప్రతి మండలంలోని స్టడీ సెంటర్లలో, విద్యాధికారి కార్యాలయంలో పొందవచ్చు.

ఎక్కడ సమర్పించాలి?
మీ సేవ కేంద్రంలో నిర్ణీత ఫీజు చెల్లించాలి. స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ ధ్రువీకరించిన అప్లికేషన్, సంబంధిత పత్రాలను మీసేవలో ఆన్‌లైన్ చేయడం ద్వారా ఓపెన్ స్కూల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు.. మండల, జిల్లా విద్యాధికారుల వద్ద నుంచి పొందవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement