శ్రీకాకుళం: ఓపెన్ స్కూల్‌లో పదోతరగతి, ఇంటర్మీడియెట్ పూర్తిచేసేందుకు ఆసక్తిగల అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అరుణకుమారి బుధవారం తెలిపారు. ప్రవేశాలు పొందాలనుకునేవారు ఈ నెల 31 వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా, నవంబర్ 29 వరకు పదోతరగతి వారు రూ.100, ఇంటర్మీడియెట్ వారు రూ.200 అపరాధ రుసుంతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. పదోతరగతి జనరల్ కేటగిరీ వారు రూ. 100 రిజిస్ట్రేషన్ ఫీజు, 5 సబ్జెక్టులకు రూ. 1000, ప్రతి అదనపు సబ్జెక్టుకు రూ. 150, ప్రతి సబ్జెక్టు మార్పునకు రూ. 150 చెల్లించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు, అన్ని వర్గాల మహిళా అభ్యర్థినులు రూ. 100 రిజిస్ట్రేషన్ ఫీజు, 5 సబ్జెక్టులకు రూ. 600, ప్రతి అదనపు సబ్జెక్టు రూ.150, ప్రతి సబ్జెక్టు మార్పునకు రూ.150 చెల్లించాలన్నారు. ఇంటర్మీడియెట్ జనరల్ కేటగిరీ వారు రూ. 200 రిజిస్ట్రేషన్ ఫీజు, 5 సబ్జెక్టులకు రూ. 1100, ప్రతి అదనపు సబ్జెక్టుకు రూ. 200, ప్రతి సబ్జెక్టు మార్పునకు రూ. 150 చెల్లించాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు, అన్ని వర్గాల మహిళా అభ్యర్థినులు రూ. 200 రిజిస్ట్రేషన్ ఫీజు, 5 సబ్జెక్టులకు రూ. 800, ప్రతి అదనపు సబ్జెక్టు రూ. 200, ప్రతి సబ్జెక్టు మార్పునకు రూ.150 చెల్లించాలన్నారు. అభ్యర్థులు స్టడీ సెంటర్లలో ఉచితంగా దరఖాస్తులు పొంది, దరఖాస్తులు పూర్తి చేసిన తరువాత అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జతచేసి సంబంధిత హెచ్‌ఎంకు సమర్పించి దరఖాస్తుపై సంతకం చేరుుంచుకోవాలన్నారు. అనంతరం మీ సేవా కేంద్రాల్లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసి ఫీజు చెల్లించి రశీదు పొందాలని సూచించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అభ్యర్థి ఫొటో, సంతకం స్కాన్‌చేసి అప్‌లోడ్ చేసిన తరువాత దరఖాస్తు ప్రింట్ కాపీని పొందాలన్నారు. మీ సేవా కేంద్రాలకు సర్వీసు చార్జ్‌గా రూ. 30 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు స్టడీ సెంటర్, డీఈవో కార్యాలయం, ఓపెన్ స్కూల్ విభాగాన్ని సంప్రదించాలన్నారు.
ఓపెన్ స్కూల్‌లో టెన్త్, ఇంటర్ ప్రవేశాలు ప్రారంభం
Published Thu, Oct 2 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM
Advertisement