షూటింగ్‌కు వెళ్లి.. యువతి అదృశ్యం
సాక్షి, శంషాబాద్(రాజేంద్రనగర్) : యాడ్ ఫిల్మ్ షూటింగ్ చేసేందుకు డార్జిలింగ్ వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్‌జీఐఏ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని విజయ్‌నగర్ కాలనీకి చెందిన కోటేశ్వర్‌రావు కుమార్తె షణ్ముక ప్రియ(18) ఇంటర్ పూర్తిచేసి యాడ్‌ఫిల్మ్ దర్శకుల వద్ద సహాయకురాలిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కమల్‌సేతు అనే దర్శకుడి వద్ద డార్జిలింగ్‌లో జరిగే షూటింగ్‌కు వెళ్లాలని చెప్పడంతో గత నెల 17న ఆమె తల్లి ఉషాకుమారి.. షణ్ముక ప్రియను శంషాబాద్ విమానాశ్రయంలో వదిలి వచ్చారు.
అదే రోజు మధ్యాహ్నం తల్లికి ఫోన్ చేసిన షణ్ముక ప్రియ తాను కోల్‌కతాకు చేరుకున్నానని ఆగస్టు 28 తిరిగి వస్తానని తెలిపింది. ఆ తరువాత ఆమె ఫోన్‌కు పలుమార్లు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ అని రావడంతో ఆందోళన చెందిన కుటుంసభ్యులు బుధవారం ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు యువకులపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ని రోజులు గడిచినా షణ్ముక ప్రియ జాడ తెలియకపోవడంతో ఆమె కుటుంసభ్యులు ఆందోళన చెందుతున్నారు.