
గంగాధరం ఇళ్లలో కొనసాగుతున్న సోదాలు
హైదరాబాద్: ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ గంగాధరం ఇళ్లలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. గంగాధరం బంధువుల ఇళ్లలో సైతం మంగళవారం సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ. 130 కోట్లకు పైగా ఆస్తులు, విలువైన డాక్యుమెంట్లను అధికారులు గుర్తించారు. సోమవారం గంగాధరంకు సంబంధించిన పలు బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసిన అధికారులు విలువైన డాక్యుమెంట్లను గుర్తించిన విషయం తెలిసిందే.
ఇవాళ మరో మూడు లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేయనున్నారు. గంగాధరాన్ని కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు నేడు పిటిషన్ దాఖలు చేయనున్నారు. కాగా.. బహిరంగ మార్కెట్‌లో గంగాధరం కూడగట్టిన ఆస్తుల విలువ వందల కోట్లు ఉంటుందని సమాచారం.