మీడియాలో వార్తలు చూసి ఆశ్చర్యపోయా: తరుణ్
హైదరాబాద్ : డ్రగ్స్ మాఫియాతో తనకు సంబంధాలు ఉన్నట్లు మీడియాలో వచ్చిన వార్తలు చూసి ఆశ్చర్యపోయానని నటుడు తరుణ్ అన్నారు. డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తన పేరు ఎందుకు బయటకు వచ్చిందో అర్థం కావడం లేదని తెలిపారు. అసలు తనపేరు ఎందుకు ఇరికించారో తెలియడం లేదని, సంబంధింత అధికారులకు అన్నివిధాల సహకరిస్తానని అన్నారు. ఈ వ్యవహారంతో తన ప్రమేయం లేదని, ఈ వార్త తనను, తన కుటుంబసభ్యులను కలిచివేసిందని తరుణ్ శుక్రవారం మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు.
కాగా డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నోటీసులు జారీ చేసిన తెలుగు సినిమా ప్రముఖుల పేర్లు అనధికారికంగా వెల్లడయ్యాయి. ఇందులో ప్రముఖ హీరోతో పాటు దర్శకుడు, ఇతర టెక్నీషియన్లు ఉన్నారు. నోటీసులు అందుకున్న వారు ఈ నెల 19 నుంచి 27 వరకు సిట్ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు.