
డీఎస్పీల సీనియారిటీపై అఫిడవిట్ దాఖలు చేయండి
సాక్షి, హైదరాబాద్: డీఎస్పీల సీనియారిటీ ప్రక్రియ అంశాన్ని ఎంత కాలం పెండింగ్‌లో పెడతారని, ఆ ప్రక్రియ పూర్తి చేయకపోతే సీనియారిటీని ఎలా నిర్ధారిస్తారని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను హైకోర్టు ప్రశ్నించింది. సీనియారిటీ ప్రక్రియ పూర్తి కి తీసుకున్న చర్యలపై అఫిడవిట్లు దాఖలు చేయా లని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది. ఏపీ ప్రభు త్వం 2015 మే 19న జారీ చేసిన మెమో ఆధారం గా డీఎస్పీ సివిల్ కేడర్‌లో సీనియారిటీని ఖరారు చేయాలని కోరుతూ నేరుగా డీఎస్పీలుగా ఎంపికై న పలువురు డీఎస్పీలు, అదనపు ఎస్పీలు పిటిషన్లు దాఖలు చేశారు.
పిటిషన్లను జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ శంకర్‌నారాయణలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఇన్‌స్పెక్టర్ల నుంచి డీఎస్పీలుగా పదోన్నతి పొందినవారికి నోషనల్ ప్రమోషన్ ద్వారా పదోన్నతి కల్పించడంతో నేరుగా డీఎస్పీలు గా ఎంపికై న వారికి అన్యాయం జరుగుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యవహారంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచా రణను ఈ నెల 21కి వాయిదా వేసింది.