
సాక్షి, హైదరాబాద్: భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనలకు లోబడే పీజీ మెడికల్ సీట్ల భర్తీలో ఇన్‌సర్వీస్ కోటాను రద్దు చేసి, వెయిటేజీ మార్కు ల విధానాన్ని ప్రవేశపెట్టామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు తెలియజేసింది. పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో ఇన్‌సర్వీస్ కోటాను తెలుగు ప్రభుత్వాలు రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ, ఏపీకిచెందిన వైద్యులు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర వియలక్ష్మిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఎంసీఐ నిబంధనల్లోని తొమ్మిది ప్రకారం ఇన్‌సర్వీస్ కోటాను ఎత్తివేసి వెయిటేజీ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ వాదించారు. అఖిల భారత స్థాయిలో 50 సీట్ల భర్తీ జరుగుతుందని, మిగిలిన సగం సీట్లలో వైద్యులుగా సేవలందించిన వారికి ఇన్ సర్వీస్ కోటాకు బదులు వెయిటేజీ మార్కులు ఇస్తామన్నారు. వెయిటేజీ మార్కుల విధానంలో ఒక్క సీటు కూడా తమకు రాదనే పిటిషనర్ల వాదనను ధర్మాసనం కొట్టేసింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదాపడింది.
Comments
Please login to add a commentAdd a comment