
అక్షయ్ గానం
బాలీవుడ్‌లో హీరోలు పాటలు పాడే ట్రెండ్ కొనసాగుతోంది. సల్మాన్ ఖాన్ తర్వాత ఇప్పుడు అక్షయ్ కుమార్ తన తాజా చిత్రం ‘ఎంటర్‌టైన్‌మెంట్’ కోసం పాట పాడాడు. పాట రికార్డింగ్ చేస్తున్న దృశ్యాన్ని వీడియోలో చిత్రించి యూట్యూబ్‌లో పెట్టాడు. ఆ యూట్యూబ్ లింకును ‘ట్విట్టర్’లో పోస్ట్ చేశాడు. ఆన్‌లైన్‌లో అక్షయ్ పాటకు అభిమానుల స్పందన బాగానే లభిస్తోంది. హౌస్‌ఫుల్-2, బాస్ చిత్రాలకు రచయితలుగా పనిచేసిన ఫర్హాద్-సాజిద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.