డబ్బు లేనప్పుడు ఎక్కడ నుంచి ఇవ్వాలి?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకు ఉద్యోగులపై అసహనం వ్యక‍్తం చేయడం సరికాదని అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం తప్పుపట్టింది. డిమాండ్‌కు సరిపడా డబ్బును బ్యాంకులకు పంపనపుడు తాము ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేయడంతో తమపై ఒత్తిడి పెరిగిందని అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం నాయకులు చెప్పారు. రెండు లక్షల ఏటీఎంలకు 35 వేలే పనిచేస్తున్నాయని తెలిపారు. కార్పొరేట్ కంపెనీల బకాయిలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లాంటి వాళ్ల బకాయిలను వసూలు చేయాలని డిమాండ్ చేశారు.