హైదరాబాద్: సీఎంఆర్ఎఫ్ మెడికల్ బిల్లుల కుంభకోణం(స్కామ్) లో తాజాగా మరో ఐదుగురిని సీఐడీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు. సీఎంఆర్ఎఫ్ మెడికల్ బిల్లుల కుంభకోణంలో రూ. 73 లక్షలు మేర అవకతవకలు చోటు చేసుకున్నట్లు సీఐడీ అధికారులు గతంలో నిర్థారించిన సంగతి తెలిసిందే.
ఆ క్రమంలో సీఐడీ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా సీఎంఆర్ఎఫ్కి వచ్చిన 11,600 దరఖాస్తులను సీఐడీ అధికారులు పరిశీలించారు. 50 ఆసుపత్రుల నుంచి 112 మంది రోగుల పేర్లతో బిల్లులు సృష్టించినట్లు సీఐడీ అధికారులు తమ దర్యాప్తులో తేల్చారు. అలాగే నిందితుల్లో 20 మంది బ్రోకర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో గతంలో 10 మందిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.