అయోమయంలో ఆయుర్వేద విద్య
ఈ కాలేజీలోని 30 సీట్లలో రెండు రాష్ట్రాల అభ్యర్థులకు ఉమ్మడిగా ప్రవేశాలు కల్పించేలా నిబంధనలు ఉన్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల భర్తీ తర్వాత ఆయుర్వేద, హోమి యోపతి, యునానీ, న్యాచురోపతి –యోగిక్ కోర్సుల్లో వార్షిక ఫీజు గతేడాది ప్రకారం ‘ఎ’ కేటగిరీకి రూ.21 వేలు, ‘బి’ కేటగిరీకి రూ.50 వేలు, ‘సి’ కేటగిరీకి రూ.1.25 లక్షలు గా ఉంది. నీట్ ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించి కేటగిరీల వారీగా సీట్లకు ఫీజులు ఖరారు చేయాల్సి ఉంది. ప్రభుత్వం మార్గ దర్శకాలు ఖరారు చేశాక కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ మొదటి దశ కౌన్సెలింగ్ ముగిసినా ఇప్పటికీ ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేయలేదు. దీంతో కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఇంకా ఏర్పాట్లు చేయట్లేదు.