నేడు ఎంబీబీఎస్ స్పాట్ కౌన్సెలింగ్
నేడు ఎంబీబీఎస్ స్పాట్ కౌన్సెలింగ్
Published Tue, Aug 29 2017 12:16 AM | Last Updated on Tue, Oct 16 2018 2:57 PM
- ఖాళీగా ఉన్న ‘ఏ’ కేటగిరీ సీట్ల భర్తీ
- పూర్తిగా నిండిన ‘బి’ కేటగిరీ సీట్లు
-‘సి’ కేటగిరీలో 50 సీట్లు ఖాళీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న ‘ఏ’ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి మంగళవారం మాప్– అప్ (స్పాట్) కౌన్సెలింగ్ జరగనుంది. ఇందుకోసం వెబ్ ఆప్షన్లకు అవకాశమి స్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్‌లో తెలిపింది. ఆగస్టు 29న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. స్పాట్ కౌన్సె లింగ్‌కు అర్హులైన వారి మెరిట్ జాబితాను వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. గత రెండు కౌన్సె లింగ్‌లలో సీటు పొంది, జాయిన్ కాని వారికి ఈ కౌన్సెలింగ్‌లో అవకాశం ఉండదు. ఇప్పటికే బీడీఎస్ సీటు పొందిన వారు మాత్రం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకో వచ్చు. కాగా, ఇతర రాష్ట్రాల్లో సీటు పొంది తాజాగా ఇక్కడి కాలేజీల్లో వెబ్ ఆప్షను ఇస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఎంసీఐకి నివేదిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
‘సి’ కేటగిరీలో 50 సీట్లు ఖాళీ..
రాష్ట్రంలోని ప్రైవేటు, ప్రైవేటు మైనార్టీ కాలేజీల్లో ‘బి’ కేటగిరీ సీట్లు పూర్తిగా భర్తీ కాగా, ‘సి’ కేటగిరీలో 50 సీట్లు మిగిలాయి. ప్రతిమ కాలేజీలో 23, మహే శ్వర కాలేజీలో 21, ఎంఎన్‌ఆర్ కాలేజీలో 4, చల్మెడ కాలేజీలో ఒక సీటు ఖాళీగా ఉన్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం కాళోజీ వర్సిటీ ఇప్పటికే రెండుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించింది. రెండో కౌన్సెలింగ్ తర్వాత ‘బి’ కేటగిరీ సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి. అన్ని కేటగిరీల ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఆగస్టు 31లోపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని భారత వైద్య మండలి నిర్ణయించింది. దీంతో ‘బి’ కేటగిరీలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ అవకాశాన్ని ప్రైవేటు కాలేజీలకు ఇచ్చింది. ఆయా కాలేజీలో గడువులోపే సీట్లను భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 3న బీడీఎస్‌కు..
రెండో కౌన్సెలింగ్ తర్వాత ఖాళీగా ఉన్న ‘ఏ’ కేటగిరీ బీడీఎస్ సీట్ల భర్తీకి సెప్టెంబర్ 3 లేదా 4 తేదీల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది.
Advertisement