Kalogi Health University
-
ఆయుష్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ
ఆన్లైన్ దరఖాస్తుకు ఈ నెల 29 వరకు గడువు సాక్షి, హైదరాబాద్: ఆయుష్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2017–18 వైద్య విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఆయుర్వేద, హోమియోపతి, నేచురోపతి కోర్సుల్లో చేరేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. నీట్– 2017లో అర్హత సాధించిన అభ్యర్థులే దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తులను గురువారం ఉదయం 11 గంటల నుంచి ఈ నెల 29న సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని రిజిస్ట్రార్ తెలిపారు. -
నేడు ఎంబీబీఎస్ స్పాట్ కౌన్సెలింగ్
- ఖాళీగా ఉన్న ‘ఏ’ కేటగిరీ సీట్ల భర్తీ - పూర్తిగా నిండిన ‘బి’ కేటగిరీ సీట్లు -‘సి’ కేటగిరీలో 50 సీట్లు ఖాళీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న ‘ఏ’ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి మంగళవారం మాప్– అప్ (స్పాట్) కౌన్సెలింగ్ జరగనుంది. ఇందుకోసం వెబ్ ఆప్షన్లకు అవకాశమి స్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్లో తెలిపింది. ఆగస్టు 29న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. స్పాట్ కౌన్సె లింగ్‌కు అర్హులైన వారి మెరిట్ జాబితాను వర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచారు. గత రెండు కౌన్సె లింగ్లలో సీటు పొంది, జాయిన్ కాని వారికి ఈ కౌన్సెలింగ్‌లో అవకాశం ఉండదు. ఇప్పటికే బీడీఎస్ సీటు పొందిన వారు మాత్రం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకో వచ్చు. కాగా, ఇతర రాష్ట్రాల్లో సీటు పొంది తాజాగా ఇక్కడి కాలేజీల్లో వెబ్ ఆప్షను ఇస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఎంసీఐకి నివేదిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ‘సి’ కేటగిరీలో 50 సీట్లు ఖాళీ.. రాష్ట్రంలోని ప్రైవేటు, ప్రైవేటు మైనార్టీ కాలేజీల్లో ‘బి’ కేటగిరీ సీట్లు పూర్తిగా భర్తీ కాగా, ‘సి’ కేటగిరీలో 50 సీట్లు మిగిలాయి. ప్రతిమ కాలేజీలో 23, మహే శ్వర కాలేజీలో 21, ఎంఎన్ఆర్ కాలేజీలో 4, చల్మెడ కాలేజీలో ఒక సీటు ఖాళీగా ఉన్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం కాళోజీ వర్సిటీ ఇప్పటికే రెండుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించింది. రెండో కౌన్సెలింగ్ తర్వాత ‘బి’ కేటగిరీ సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి. అన్ని కేటగిరీల ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఆగస్టు 31లోపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని భారత వైద్య మండలి నిర్ణయించింది. దీంతో ‘బి’ కేటగిరీలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ అవకాశాన్ని ప్రైవేటు కాలేజీలకు ఇచ్చింది. ఆయా కాలేజీలో గడువులోపే సీట్లను భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 3న బీడీఎస్‌కు.. రెండో కౌన్సెలింగ్ తర్వాత ఖాళీగా ఉన్న ‘ఏ’ కేటగిరీ బీడీఎస్ సీట్ల భర్తీకి సెప్టెంబర్ 3 లేదా 4 తేదీల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. -
అయోమయంలో ఆయుర్వేద విద్య
- అడ్మిషన్లపై ఇప్పటికీ రాని స్పష్టత - ఇంకా విడుదలకాని మార్గదర్శకాలు సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల మొదటి దశ కౌన్సెలింగ్ ముగిసింది. అన్ని కేటగిరీల్లో కలిపి దాదాపు 500 సీట్లు మిగిలిపోయాయి. ఆగస్టు 10 నుంచి రెండో దశ కౌన్సెలింగ్ మొదలుకానుంది. అయితే సంప్రదాయ వైద్య విద్య కోర్సుల సీట్ల భర్తీ విషయంలో మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, న్యాచురోపతి–యోగిక్, పబ్లిక్ హెల్త్ కోర్సుల్లో కలిపి రాష్ట్రంలో 695 సీట్లు ఉన్నాయి. ఈ నాలుగు రకాల కోర్సులకు కలిపి రాష్ట్రంలో 10 కాలేజీలు ఉన్నాయి. న్యాచురోపతి–యోగిక్ కోర్సును అందించే కాలేజీ తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకటే ఉంది. ఈ కాలేజీలోని 30 సీట్లలో రెండు రాష్ట్రాల అభ్యర్థులకు ఉమ్మడిగా ప్రవేశాలు కల్పించేలా నిబంధనలు ఉన్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల భర్తీ తర్వాత ఆయుర్వేద, హోమి యోపతి, యునానీ, న్యాచురోపతి –యోగిక్ కోర్సుల్లో వార్షిక ఫీజు గతేడాది ప్రకారం ‘ఎ’ కేటగిరీకి రూ.21 వేలు, ‘బి’ కేటగిరీకి రూ.50 వేలు, ‘సి’ కేటగిరీకి రూ.1.25 లక్షలు గా ఉంది. నీట్ ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించి కేటగిరీల వారీగా సీట్లకు ఫీజులు ఖరారు చేయాల్సి ఉంది. ప్రభుత్వం మార్గ దర్శకాలు ఖరారు చేశాక కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ మొదటి దశ కౌన్సెలింగ్ ముగిసినా ఇప్పటికీ ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేయలేదు. దీంతో కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఇంకా ఏర్పాట్లు చేయట్లేదు. -
కనీసం సొంత భవనం లేదు!
ఇదీ కాళోజీ ఆరోగ్య వర్సిటీ దుస్థితి - వర్సిటీ ఏర్పాటై మూడేళ్లయినా.. నిలువ నీడ లేదు - కాకతీయ వర్సిటీకి చెందిన పాత భవనంలోనే పాలన సాక్షి, హైదరాబాద్: కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిస్థితి దయనీయంగా తయారైంది. వర్సిటీ ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సొంత భవనం లేని పరిస్థితి నెలకొంది. వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాలకు చెందిన ఓ పాత భవనంలోనే వర్సిటీ పాలన నడుస్తోంది. ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల సీట్ల భర్తీకి జూలై 22న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైంది. వరంగల్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు కాళోజీ వర్సిటీలో స్థలం లేక కాకతీయ వర్సిటీలో నిర్వహిస్తున్నారు. స్వయంగా ఆరోగ్య విశ్వవిద్యాలయంలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసే వ్యవస్థ, వసతి లేకపోవడంతో వర్సిటీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. రూ.45 కోట్లతో భవనం నిర్మాణానికి ప్రణాళిక ఉమ్మడి ఏపీలో వైద్య విద్య నిర్వహణ కోసం విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో వైద్య విద్య కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వరంగల్‌లో కాళోజీ నారాయణరావు పేరుతో ఆరోగ్య వర్సిటీని ఏర్పాటు చేసింది. వర్సిటీ పరిపాలన, ఇతర అవసరాల కోసం భవనాలను నిర్మించేందుకు రూ.130 కోట్లను కేటాయించింది. అందులో రూ.45 కోట్లతో పరిపాలన భవనం నిర్మించేలా ఉన్నతాధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. వరంగల్ సెంట్రల్ జైలుకు చెందిన స్థలంలో భవనం నిర్మించేలా ప్రభుత్వం అనుమతులూ ఇచ్చింది. పరిపాలన భవనం నిర్మాణం కోసం 2016 ఆగస్టు 7న ప్రధాని మోదీ గజ్వేల్‌లో శంకుస్థాపన చేశారు. ఈ మేరకు పరిపాలన భవనం నిర్మాణం బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ ఐడీసీ)కు ప్రభుత్వం అప్పగించింది. టీఎస్ఎంస్ఐడీసీ ఆలస్యంగా టెండరు ప్రక్రియ మొదలు పెట్టింది. రూ.20 కోట్లతో భవనాన్ని నిర్మించేలా కొత్త ప్లాన్ రూపొందిం చింది. ఇంకా టెండరు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. -
450 ఎంబీబీఎస్ సీట్ల కోత!
- అన్ని సీట్లూ కన్వీనర్ ఆధ్వర్యంలోనే భర్తీ - వారంలో ప్రవేశాలకు మార్గదర్శకాలు - అనంతరం షెడ్యూల్ విడుదల ఈ సారి అందుబాటులో ఉన్న సీట్లు 3,250 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీడీఎస్ సీట్లు 1,140 అనుమతులు రాని కాలేజీలు 3 తొలిసారిగా ఉమ్మడి ప్రవేశాలు సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్) ర్యాంకులు వెల్లడైన నేపథ్యంలో వైద్య విద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం రాష్ట్రస్థాయిలో నీట్ ర్యాంకులను వెల్లడించిన కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం, వైద్య విద్య డైరెక్టరేట్లు... ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ సీట్ల భర్తీ ప్రక్రియ షెడ్యూల్ రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. 2017–18 విద్యా సంత్సరంలో వైద్య విద్య కోర్సుల ప్రవేశాలు, ఫీజులు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది. అవి రాగానే ప్రవేశ ప్రక్రియ షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ‘నీట్’ ఆధారంగానే.. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ఈసారి పూర్తిగా మారిపోనుంది. గత విద్యా సంవత్సరం వరకు.. ప్రభుత్వ కళాశాలల్లోని మొత్తం సీట్లు, ప్రైవేట్ కాలేజీల్లోని 50 శాతం సీట్లను ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేసేవారు. ఇక ప్రైవేట్ కాలేజీల్లోని మరో 35 శాతం సీట్లను వైద్య విద్య కాలేజీల యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో భర్తీ చేసేవారు. మిగతా 15 శాతం (ఎన్నారై కోటా) సీట్లను ఆయా కళాశాలలు నేరుగా భర్తీ చేసుకునేవి. అదే తాజా విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ వైద్య కళాశాలల్లోని అన్ని కోటాల ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ సీట్లను.. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేయనున్నారు. 450 సీట్లకు కోత! రాష్ట్రంలో ప్రస్తుతం 3,250 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఏడు ప్రభుత్వ కాలేజీల్లో 1,100 సీట్లు.. 15 ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లో కలిపి 2,150 సీట్లు ఉన్నాయి. గతేడాది మొత్తం 3,700 సీట్లు అందుబాటులో ఉండగా.. వాటిలో ఈ ఏడాదికి 450 సీట్ల కోత పడినట్లు వైద్య విద్య డైరెక్టరేట్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. 150 చొప్పున సీట్లున్న మహవీర్, ఆర్వీఎం, మల్లారెడ్డి మహిళా కాలేజీలకు ఇంకా అనుమతులు రాలేదని వెల్లడించాయి. అలాగే బీడీఎస్ కోర్సులో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి రాష్ట్రవ్యాప్తంగా 1,140 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మార్గదర్శకాలు రాగానే.. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏటా మార్గదర్శకాలు ఖరారు చేస్తుంది. ఈసారి ఉమ్మడి ప్రవేశాలు జరుపుతున్న నేపథ్యంలో మార్గదర్శకాల్లో భారీగా మార్పులు ఉండే అవకాశముందని సమాచారం. ప్రభుత్వం గతేడాది ప్రైవేటు కాలేజీల్లోని సీట్ల వార్షిక ఫీజులను పెంచింది. కన్వీనర్ కోటాలోని 50 శాతం సీట్లకు రూ.60 వేలుగా, యాజమాన్య కోటాలో భర్తీ చేసే 35 శాతం సీట్లకు రూ.11 లక్షలుగా నిర్ణయించి.. ఎన్నారై కోటా సీట్ల ఫీజు యాజమాన్య కోటా ఫీజుకు రెట్టింపు ఉంటుందని ప్రకటించింది. మైనారిటీ కాలేజీల్లో ఈ ఫీజులు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఇక గతేడాది బీడీఎస్ కోర్సులో కన్వీనర్ కోటాకు రూ.45వేలు, యాజమాన్య కోటాకు రూ.4 లక్షలు, ఎన్నారై కోటాకు రూ.5 లక్షల ఫీజు నిర్ణయించారు. ఇలా గతేడాదే ఫీజు పెంచిన నేపథ్యంలో.. ఈసారి పెంపు ఉంటుందా లేదా అనేది మార్గదర్శకాల్లో తేలనుంది. ఇంతకాలం ఎన్నారై కోటా ఇష్టం వచ్చినట్లుగా ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు కాలేజీలు ఉమ్మడి ప్రవేశాల నేపథ్యంలో ఎలా వ్యవహరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. -
చివరి విడత కౌన్సెలింగ్ రద్దు
- యాజమాన్య పీజీ వైద్య సీట్ల చివరి విడత కౌన్సెలింగ్ రద్దు - నోటిఫికేషన్ ఇచ్చి రద్దు చేసుకున్న ఆరోగ్య విశ్వవిద్యాలయం - కేంద్ర ప్రభుత్వ జీవో ప్రకారమే చేశామంటున్న అధికారులు - ప్రైవేట్ కాలేజీల ఇష్టారాజ్యానికి సీట్లు వదిలేసిన వైనం సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మిగిలిన యాజమాన్య పీజీ వైద్య సీట్లకు చివరి విడత (మాప్ అప్ రౌండ్) కౌన్సెలింగ్ రద్దు చేస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నిర్ణయం తీసుకుంది. అందుకోసం సోమవారం జారీచేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ప్రకటన జారీ చేసింది. తెలంగాణ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల సంఘం అభ్యర్థన మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ స్పష్టం చేసింది. మిగిలిన సీట్లను యాజమాన్యాలే సొంతంగా నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించింది. దీంతో బుధవారం జరగాల్సిన కౌన్సెలింగ్ కూడా రద్దు చేసినట్లయింది. ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించాలన్న ఎంసీఐ ఆదేశాలున్నా వర్సిటీ ఇలా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మాప్ అప్ రౌండ్ తర్వాత మిగిలే సీట్లను ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలే భర్తీ చేసుకోవచ్చని ఈ నెల 26న కేంద్రం స్పష్టం చేసిందని, ఆ ప్రకారమే నిర్ణయం తీసుకున్నామని వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. అయితే మాప్ అప్ రౌండ్ ముగియకపోయినా కౌన్సెలింగ్ రద్దు చేయడంపై విమర్శలొస్తున్నాయి. 241 సీట్లను సొంతంగా కేటాయించుకునే వీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల్లో 241 సీట్లు మిగిలిపోయాయి. ఇటీవల 415 మెడికల్ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించగా 268 సీట్లే భర్తీ అయ్యాయి. 147 సీట్లు మిగిలిపోయాయి. పీజీ డెంటల్ కోర్సుల్లోని 153 సీట్లలో 59 భర్తీ కాగా 94 సీట్లు మిగిలాయి. ఆ సీట్లను ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీలు అమ్ముకోవ డానికి వీలు చిక్కింది. మెడికల్ కోర్సు ల్లోని నాన్ క్లినికల్ కోర్సులకు డిమాండ్ లేదని, డెంటల్ కోర్సుల పట్ల విద్యార్థులు ఆసక్తి చూపింట్లేదని అధికారులు చెబుతున్నారు. మిగిలిన మెడికల్ సీట్లల్లో 10 వరకే క్లినికల్ సీట్లుంటా యంటున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో 80 వరకు నాన్ క్లినికల్ సీట్లు మిగిలిపోయా యని వీసీ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. -
పీజీ వైద్య యాజమాన్య సీట్లకు నోటిఫికేషన్
జారీ చేసిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం - ఆన్లైన్ దరఖాస్తుకు ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం వరకు గడువు - కన్వీనర్ కోటాలో రెండో దశలో మిగిలిన సీట్లకూ నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని పీజీ యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశానికి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీచేసింది. ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకునే ప్రక్రియ శనివారం ఉదయం 11 గంటలకే ప్రారంభమైంది. ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తుకు చివరి తేదీగా ప్రకటించారు. పీజీ నీట్–2017లో అర్హు లైన విద్యార్థులు ఎవరైనా ఈ ప్రవేశాలకు దర ఖాస్తు చేసుకోవచ్చు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ సీట్లలో ప్రవేశాలకు అర్హులు. దరఖాస్తు అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి రాష్ట్రంలోని 11 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉన్న పీజీ, డిప్లొమా వైద్య సీట్లను, 8 డెంటల్ కాలేజీల్లోని ఎండీఎస్ సీట్లను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకున్న వారి లో అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను 24వ తేదీ సాయంత్రమే వెల్లడిస్తారు. 25న 25 శాతం యాజమాన్య కోటా సీట్లకు అర్హత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉస్మానియా యూనివర్సిటీలోని దూరవిద్యా కేంద్రంలో నిర్వహిస్తారు. అనంతరం అప్పటికప్పుడే కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటా యిస్తారు. ఇక 15 శాతం ఎన్ఆర్ఐ కోటా, 10 శాతం ఇన్స్టిట్యూషన్ కోటా సీట్లకు 26వ తేదీ ఉదయం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసి సీట్లను కేటాయిస్తారు. ఇక అదేరోజు మధ్యాహ్నం నుంచి ఎండీఎస్ సీట్ల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేసి సీట్లను కేటాయిస్తారు. 27వ తేదీ నాటికి తమకు కేటాయించిన సీట్లలో విద్యార్థులు చేరాలి. సీట్లు మిగిలితే 28వ తేదీన మరో సారి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అందులో సీటొచ్చిన విద్యార్థులు 29వ తేదీన చేరాలి. ఆ తర్వాత కూడా సీట్లు మిగిలితే 30, 31వ తేదీల్లోనూ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులు వెంటవెంటనే కాలేజీల్లో చేరాలి. ఈ నెల 31వ తేదీ నాటికి ఎలాగైనా పీజీ వైద్య అడ్మిషన్ల ప్రక్రియను ముగిస్తారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లకు, ప్రైవేటులోని కన్వీ నర్ కోటా సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఆ సీట్లలో చేరేం దుకు శనివారం మధ్యాహ్నంతో గడువు ముగి సింది. రెండో విడత కౌన్సెలింగ్‌లో మిగిలి పోయిన సీట్లను భర్తీ చేసేందుకు విశ్వవిద్యా లయం మరో నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇన్స్టిట్యూషన్ కోటా అంటే..? తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఈసారి పీజీ మెడికల్ సీట్లలో ఇన్స్టిట్యూషన్ కోటా అంటూ ప్రత్యేక కేటగిరీని తీసుకొచ్చింది. ఇన్స్టిట్యూషన్ కోటాకు 10 శాతం సీట్లు కేటాయించారు. దీంతో పీజీ వైద్య సీట్లలో నాలుగు కేటగిరీలు అయ్యాయి. ప్రస్తుతం కన్వీనర్, యాజమాన్య, ఎన్ఆర్ఐ కోటా సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇన్స్టిట్యూషన్ కోటా ఇప్పటివరకు కర్ణాటకలో తప్ప మరే రాష్ట్రంలోనూ లేదు. ఈ ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేస్తున్నారు. సంబంధిత ప్రైవేటు మెడికల్ కాలేజీ సొంతంగా ఆ సీట్లను కేటాయించుకోవ డానికి వీలు కల్పించడమే ఈ కేటగిరీ ప్రత్యేకత. ప్రైవేటు మెడికల్ కాలేజీ లేదా అనుబంధ బోధనాసుపత్రిలో పనిచేసే వైద్యులు లేదా వారి పిల్లలు లేదా కాలేజీ యజమానుల పిల్లలకు ఈ కేటగిరీలో సీట్లు ఇచ్చుకోవచ్చు. సీట్లు తక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆ కాలేజీ యాజమాన్యం నచ్చినవారికి ఇచ్చుకోవచ్చు. కాగా, వచ్చే ఎంబీబీఎస్ సీట్ల భర్తీలోనూ ఇన్స్టిట్యూషన్ కోటాను తీసుకొచ్చే ఆలోచన ఉందని అంటున్నారు.