బాబు అవినీతికి ఆ మాటలే సాక్ష్యం: కోలగట్ల | Babu evidence of corruption to the same words: kolagatla | Sakshi
Sakshi News home page

బాబు అవినీతికి ఆ మాటలే సాక్ష్యం: కోలగట్ల

Published Sat, Apr 2 2016 2:09 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

బాబు అవినీతికి ఆ మాటలే సాక్ష్యం: కోలగట్ల - Sakshi

బాబు అవినీతికి ఆ మాటలే సాక్ష్యం: కోలగట్ల

సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసేవారి ఎన్నికల ఖర్చులన్నీ తానే భరిస్తానని సీఎం చంద్రబాబు చెబుతుండడమే ఈ ప్రభుత్వ అవినీతికి సజీవ సాక్ష్యమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ప్రజా సమస్యల్ని, పాలనను పూర్తిగా పక్కన పెట్టిన టీడీపీ పెద్దలు, నేతలు ప్రజాధనాన్ని దోచుకోవడంపై దృష్టిసారించారని ధ్వజమెత్తారు. వేసవిలో మంచినీటి సమస్యపై ప్రకటన చేయడానికి సీఎం పరిమితమయ్యారు తప్ప సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలేమీ లేవని విమర్శించారు. ప్రభుత్వం పేదలకిచ్చే ఇళ్ల నిర్మాణంలోనూ ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకుంటామని బాబు చెబుతుండడాన్ని తప్పుపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement