
బీజేపీ, టీఆర్‌ఎస్ కలసి పనిచేయాలి
బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో టీఆర్‌ఎస్ కలసి పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు అన్నారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలో ఉంటే రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుంద న్న విషయం రైల్వే బడ్జెట్ ద్వారా రుజువైందని చెప్పారు.
కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వం కృతజ్ఞతలు చెప్పాలని సూచించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు చేసిన ప్రతిపాదనలు చాలావరకు అమలవుతున్నాయని, చాలా కాలం నుంచి పెండింగులో ఉన్న డిమాండ్లు నెరవేరుతున్నాయన్నారు. రైల్వే బడ్జెట్ తెలంగాణకు, అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉందన్నారు.