
భవనం చెక్కుచెదరలేదు
ఇంటాక్ బృందం
అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆసుపత్రి పాత భవనానికి మరమ్మత్తులు నిర్వహిస్తే మరికొన్ని దశాబ్ధాల పాటు భవనం చెక్కు చెదరకుండా ఉంటుందని డిల్లీకి చెందిన ఇన్‌ట్యాక్ (ప్రాచీన కట్టడాల) పరిరక్షణ బృందం పేర్కొంది. సోమవారం ఉస్మానియా పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు గోపాలకిషన్ ఆధ్వర్యంలో ఇన్‌ట్యాక్ బృందం సభ్యులు ఉస్మానియా ఆసుపత్రి పాత భవనాన్ని సందర్శించారు. ఉస్మానియా పాత భవనంలోని శిథిలావస్తకు చేరిన ఛాయాచిత్రాలను, నమూనాలను సేకరించారు. ఇన్‌ట్యాక్ జాతీయ ఆర్కిటెక్చ్‌వల్ హెరిటేజ్ కన్వీనర్ దివ్వగుప్త మాట్లాడుతూ ఉస్మానియా ఆసుపత్రి పాత భవనం పెచ్చులూడి పడడానికి ప్రధాన కారణం సరైన నిర్వహణ చేయకపోవడమే అన్నారు.
దీని నిర్వహణను సక్రమంగా నిర్వహించి ఉంటే భవనం మరో వందేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేదన్నారు. ఇప్పటికైనా భనానికి మరమ్మతులు చేపడితే మరి దశాబ్ధాలపాటు పటిష్టంగా ఉంటుందన్నారు. దీని నిర్మాణ పునాదుల్లో చాలా గట్టితనం ఉందన్నారు. ఇన్‌ట్యాక్ తెలంగాణ కన్వీనర్ అనురాధారెడ్డి మాట్లాడుతూ... వారసత్వ సంపదను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వపై ఉందన్నారు. ఉస్మానియా ఆసుపత్రి పాత భవనం అంత ప్రమాదకరంగా ఏమీలేదన్నారు. దీనికి మరమ్మతులు చేపడితే మరింత కాలం ఉంటుందన్నారు. ఈ స్థితికి రావడానికి సరైన నిర్వహణ చేయకపోవడమే ప్రధాన కారణమన్నారు. ఉస్మానియా ఆస్పత్రిని కూల్చివేతకయ్యే ఖర్చుకంటే మరమ్మత్తులకు చాలా తక్కువ ఖర్చవుతుందని పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి పాత భవన నమూనాలను సేకరించామని 3 రోజుల్లో పూర్తి నివేదికను అందజేస్తామని ఆమె తెలిపారు. ఈ బృందంలో ఇన్‌ట్యాక్ సభ్యులు సాజిద్, సంజయ్‌తోర్వీ, శంకర్‌నారాయన్, శ్రీనివాస్‌మూర్తి, వేణుగోపాల్, ఎస్‌పీ అన్‌చూరి, ఎల్‌ఎన్, ప్రవీన్, త్రివిక్రమ్, అనురిమా, రంగారావు, అశోక్‌బైరి ఉన్నారు