‘ఎక్స్‌ప్రెస్ వే’పై కారు బీభత్సం | car accident in express way | Sakshi
Sakshi News home page

‘ఎక్స్‌ప్రెస్ వే’పై కారు బీభత్సం

Published Tue, Dec 8 2015 4:38 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

‘ఎక్స్‌ప్రెస్ వే’పై కారు బీభత్సం - Sakshi

‘ఎక్స్‌ప్రెస్ వే’పై కారు బీభత్సం

అత్తాపూర్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఎగిరి అవతలి రోడ్డుపై పడి మరో కారును ఢీకొట్టి బోల్తాపడింది.  ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ వి.ఉమేందర్ కథనం ప్రకారం... బహదూర్‌పురాకు చెందిన సోహెల్(19) కారు డ్రైవర్. సోమవారం సాయంత్రం 6 గంటలకు తన ఇండికా కారులో శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద ప్రయాణికులను ఎక్కించుకొని మెహిదీపట్నం వైపు వెళ్తున్నాడు. మార్గం మధ్యలో పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌వే పై పిల్లర్ నెంబర్ 239 వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న ఇతని కారు డివైడర్‌ను ఢీకొని ఎగిరి అవతల రోడ్డుపై వెళ్తున్న పోలో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లలో ఉన్న ఐదుగురికి తీవ్రగాయలయ్యాయి. ఈ ప్రమాదంతో ఎక్స్‌ప్రెస్‌వే పై ట్రాఫిక్ జామ్ అయింది. రాజేంద్రనగర్ పోలీసులు క్షతగాత్రులను ఉస్మానియాకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement