డ్రైవర్ చేతివాటం : యజమానికి టోకరా | car driver two lakhs cheating from owner in hyderabad | Sakshi
Sakshi News home page

డ్రైవర్ చేతివాటం : యజమానికి టోకరా

Published Thu, Sep 8 2016 9:03 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

car driver two lakhs cheating from owner in hyderabad

హైదరాబాద్: యజమానికే టోకరా వేసి రూ.2 లక్షలు స్వాహా చేసిన నిందితుడిని సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇతడి నుంచి ఐదు యాపిల్ ఐఫోన్లు, రిస్ట్ వాచీ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ అవినాష్ మహంతి వెల్లడించారు.
 
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన డి.రవి బాగ్‌లింగపల్లిలో నివసించే శైలజా మోహన్ వద్ద డ్రైవర్‌గా పని చేశాడు.  రవి నమ్మకంగా పని చేస్తుండడంతో ఆమె ఆన్‌లైన్ బ్యాంకు లావాదేవీలు సైతం అతనితో చేయించేది. దీన్ని ఆసరాగా చేసుకున్న రవి శైలజకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డు నంబర్లు, సీవీవీ కోడ్ వివరాలను తీసుకున్నాడు. ఆమె గుర్తింపుకార్డు కాపీని దొంగిలించాడు.

జనవరిలో అమెరికాకు వెళ్లిన శైలజ తన సెల్‌ఫోన్ నంబర్‌ను డీ యాక్టివేట్ చేశారు. అప్పటికే దురుద్దేశంతో ఉన్న రవి ఆమె గుర్తింపుకార్డు ఆధారంగా డూప్లికేట్ సిమ్‌కార్డు తీసుకున్నాడు. దీంతో పాటు క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలను వినియోగించి ఆన్‌లైన్‌లో రూ.2 లక్షల మేర షాపింగ్ చేశాడు. జులైలో తిరిగి వచ్చిన శైలజ ఈ విషయం గుర్తించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సీసీఎస్ పరిధిలోని సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు రవిని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement