హైదరాబాద్ నగరంలోని కారు ప్రమాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్-12లో ఓ కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కారు ప్రమాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్-12లో ఓ కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కొంచెంకొ్ంచెంగా మొదలై ఒక్కసారిగా చెలరేగిపోయాయి. స్థానికులు వేగంగా స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకున్నారు. మంటలను అదుపుచేసి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూశారు.
బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 వైపు వెళుతుండగానే ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో కారులో వారు కూడా వెంటనే గమనించి దిగిపోవడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. సాంకేతిక పరిజ్ఞానం లోపం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారుల చెబుతున్నారు.